వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ బహిరంగ మార్కెట్ అమ్మకం పధకం కింద 30 ఎల్ ఎం టీ ల గోధుమల విక్రయ ప్రతిపాదనను ఆమోదించింది
దేశీయ గోధుమలు మరియు అట్టా ధరలను తగ్గించడానికి వ్యాపారులు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సహకార సంస్థలు / ఫెడరేషన్లు / పీ ఎస్ యూల ద్వారా విక్రయం
Posted On:
25 JAN 2023 7:36PM by PIB Hyderabad
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) బహిరంగ మార్కెట్ అమ్మకం పధకం (దేశీయ) కింద కేంద్ర సమీకరణ నిల్వల నుండి వివిధ మార్గాల ద్వారా మార్కెట్‌కు 30 ఎల్ ఎం టీ ల గోధుమలను విడుదల చేస్తుంది.
బహుళ మార్గాల ద్వారా రెండు నెలల వ్యవధిలో ఓ ఎం ఎస్ ఎస్ (డీ) పథకం ద్వారా 30 ఎల్ ఎం టీ ల గోధుమలను మార్కెట్‌లో విడుదల చేయడం ద్వారా విస్తృతంగా మార్కెట్‌లో చేరుకోవడంతోపాటు పెరుగుతున్న గోధుమలు మరియు అట్టా ధరలపై తక్షణ ప్రభావం చూపుతుంది మరియు పెరుగుతున్న ధరలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది తద్వారా సామాన్యులకు ఉపశమనం.
దేశంలో పెరుగుతున్న గోధుమలు మరియు ఆటా ధరలను పరిష్కరించడానికి, హోం మంత్రి శ్రీ అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ రోజు సమావేశమై దేశం యొక్క నిల్వల స్థితి పై చర్చించింది.
పెరుగుతున్న ధరలపై త్వరిత ప్రభావం చూపేందుకు, మార్కెట్‌కు గోధుమలను విడుదల చేయడానికి క్రింది ఎంపికలను మంత్రుల కమిటీ (CoM) ఆమోదించింది:
పిండి మిల్లర్లు, బల్క్ కొనుగోలుదారులు మొదలైన వారికి ఇ-వేలం ద్వారా ఒక ఎఫ్‌సిఐ రీజియన్ నుండి ఒక్కో కొనుగోలుదారుకు గరిష్టంగా 3000 మెట్రిక్ టన్నులకు గోధుమలు అందించబడతాయి.
ఇ-వేలం లేకుండా వారి పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు / యుటిలకు గోధుమలు కూడా అందించబడతాయి.
పై ఛానెల్‌లు కాకుండా, ఇ-వేలం లేకుండా ప్రభుత్వ పీ ఎస్ యూ లు/సహకార సంస్థలు/ఫెడరేషన్‌లు, కేంద్రీయ భండార్/ ఎన్ సీ సీ ఎఫ్ / ఎన్ ఏ ఎఫ్ ఈ డి మొదలైన వాటికి రూ. 2350/ క్వింటాల్ తగ్గింపు ధరలకు గోధుమలు అందించబడతాయి. ఈ ప్రత్యేక పథకం కింద కొనుగోలుదారు గోధుమలను ఆటాగా మార్చి, గరిష్ట రిటైల్ ధర రూ. రూ. కిలోకు 29.50 విక్రయించాలి.
పెరుగుతున్న గోధుమలు మరియు ఆటా ధరలపై తక్షణ ప్రభావం కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాబోయే రెండు నెలల్లో గోధుమలను మార్కెట్‌కు తరలించాలని నిర్ణయించారు.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2023 జనవరి నుండి మార్చి వరకు దేశవ్యాప్తంగా స్టాక్‌ల ఇ-వేలం ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తుంది.
****
(Release ID: 1893803)