మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి ప్రత్యేక, ప్రజాదరణ పొందిన చొరవ పరీక్షా పె చర్చా విద్యార్ధుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాక ఒత్తిడిని నియంత్రించి, ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడిందిః శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
24 JAN 2023 6:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పాల్గొని, నిర్వహించనున్న జనాదరణ పొందిన కార్యక్రమం పరీక్షా పె చర్చ 2023 ముందు కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం విలేకరుల కార్యక్రమాన్ని నిర్వహించారు.
పరీక్షా పె చర్చ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి రూపొందించారు. ఇందులో విద్యార్ధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆయనతో జీవితం, పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలపై ముచ్చటిస్తారు. ఈ ఏడాది పరీక్షా పె చర్చ ఎడిషన్‌ను 27 జనవరి 2023న న్యూఢిల్లీలోని టల్కటోరా ఇన్‌డోర్ స్టేడియం నుంచి ఉదయం 11 గంటలకు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్, ఇతర ప్రధాన టివి ఛానెళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.
విద్యార్ధులు పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు, పరీక్షా పె చర్చను ఒక ప్రజా ఉద్యమంగా బలోపేతం చేయడం, ఈ ఏడాది పెరిగిన విద్యార్ధుల భాగస్వామ్యం సహా పరీక్షా పె చర్చ ప్రాముఖ్యతను, అది చేస్తున్న సహాయం గురించి శ్రీ ప్రధాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేపట్టిన ఈ ప్రత్యేక, ప్రాచుర్యం పొందిన చొరవ విద్యార్ధుల ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాక, వారు ఒత్తిడిని అధిగమించేందుకు, ఆరోగ్యం ఉండేందుకు తోడ్పడిందని అన్నారు. దాదాపు 2400 మంది విద్యార్ధులు ప్రత్యక్షంగా టల్కటోరా స్టేడియంలో ప్రధానమంత్రి పంచుకునే జ్ఞాన గుళికల ద్వారా లబ్ధి పొందనున్నారు. అదే సమంలో కోట్లాది మంది విద్యార్ధులు తమ తమ పాఠశాలల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూస్తారన్నారు.
ఈ ఏడాది 38.80 లక్షల నమోదులు జరిగాయని మంత్రి తెలిపారు. ఇందులో 16 లక్షల మంది రాష్ట్ర బోర్డులకు చెందినవారన్నారు. ఇది, 2022లో జరిగిన పిపిసికి చేసుకున్న నమోదు (15.73 లక్షలు) కన్నా రెండు రెట్ల కన్నా ఎక్కువ. ఈ రిజిస్ట్రేషన్లు 155 దేశాల నుంచి చేసుకున్నారు. అంతేకాకుండా, 20 లక్షల ప్రశ్నలను అందుకున్నామని, ఎన్‌సిఇఆర్‌టి కుటుంబ ఒత్తిడి, ఒత్తిడి నిర్వహణ, అనైతిక పద్ధతులను నిరోధించడం, ఆరోగ్యంగా ఉండడం, కెరీర్ ఎంపికలు తదితరాలు సహా పలు అంశాలపై వచ్చిన ప్రశ్నలను షార్ట్ లిస్ట్ చేసింది.
కళా ఉత్సవ్ పోటీలో 80మంది విజేతలు, దేశం నలు మూలల నుంచి 102 మంది విద్యార్ధులు, ఉపాధ్యాయులు 27 జనవరి 2023న జరుగనున్న ప్రధాన కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరై ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. పాల్గొంటున్న విద్యార్ధులను రాజ్‌ఘాట్, సదైవ్ అతల్, ప్రధానమంత్రి మ్యూజియం, కర్తవ్యపథ్ తదితర జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలకు తీసుకువెళ్ళనున్నారు.ఇది మన సుసంపన్నమైన వారసత్వాన్ని వారికి పరిచయం చేస్తుంది. కళా ఉత్సవ్ విజేతలు, రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్ధులు, అధ్యాపకులు 26 జనవరి 2023న జరుగనున్న గణతంత్ర దినోత్సవ పెరేడ్‌ను, 29 జనవరి 2023న జరుగనున్న బీటింగ్ రిట్రీట్‌ను వీక్షించనున్నారని శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
ప్రధానమంత్రి 2018లో ఎగ్జామ్ వారియర్స్ అన్న పుస్తకాన్ని రచించారని మంత్రి పట్టి చూపారు ఈ పుస్తకం విశేష విజయాన్ని పరిగణనలోకి తీసుకుని, దానిని 11 భారతీయ భాషలు - అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూలలో ప్రచురిస్తున్నారు. సవిరించిన హిందీ & ఇంగ్లీషు భాషల ఎడిషన్లను కూడా ప్రచురించినట్టు చెప్పారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని 23 జనవరిన దేశ వ్యాప్తంగా 500 జిల్లాలలో పిపిసి- 2023కు ముందుగా పెయింటింగ్ పోటీని నిర్వహించినట్టు మంత్రి తెలిపారు. నేతాజీకి నివాళులు అర్పించిన అనంతరం కెవి, ఎన్‌వి, రాష్ట్ర బోర్డులు, సిబిఎస్ఇ అనుబంధ పాఠశాలలకు చెందిన 50000 విద్యార్ధులు ఈ పోటీలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఎగ్జామ్స్ వారియర్స్ బుక్‌లో ఇచ్చిన గుళికలే ఈ పెయింటింగ్‌లకు ఇతివృత్తం.
****
(Release ID: 1893481)
Visitor Counter : 205