వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ వేడుకల్లో ప్రసంగించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
ప్రతి లక్ష్యాన్ని సాధించగల మన యువశక్తియే.. మన అతిపెద్ద బలం: శ్రీ తోమర్
డిజిటల్ అగ్రి మిషన్ నుండి రైతులు కొత్త సాంకేతికత ప్రయోజనం పొందుతారు: వ్యవసాయ మంత్రి
Posted On:
24 JAN 2023 6:43PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ భోపాల్ నగరంలో ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్’ ముగిసింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ప్రతి రంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ వాడకం పెరిగిందన్నారు. ఈ రంగం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటిన్నారు. విజ్ఞాన్ భారతి, రాష్ట్ర ప్రభు,త్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, శాస్త్రవేత్తలు, అంకుర సంస్థలకు సమర్థవంతమైన వేదికను అందించిందని కేంద్ర మంత్రి శ్రీ తోమర్ అన్నారు. ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువతను ఆహ్వానించారు. మన దేశం యువ దేశమని అన్నారు. యువశక్తి మన దేశానికి అతిపెద్ద బలం అని వివరించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించినట్లుగా, మన దేశం అమృతకాలం గుండా ప్రయాణిస్తోందన్నారు. యువ జనాభా బలంతో దేశం అతిపెద్ద అంచనాలు, లక్ష్యాలను నెరవేర్చగల సమయం ఇదని అన్నారు. ఇందుకోసం భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సహిస్తోంది. తమ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు, సైన్స్ & టెక్నాలజీకి దాదాపు రూ. 2,000 కోట్ల బడ్జెట్ ఉందని, దానిని ప్రధాన మంత్రి శ్రీ మోదీ రూ. 6,000 కోట్లకు పెంచారని శ్రీ తోమర్ అన్నారు. మాజీ ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్-జై కిసాన్ నినాదాన్ని ఇచ్చారని, ఆ తర్వాత ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ నినాదానికి సైన్స్‌ను చేర్చి జై జవాన్- జై కిసాన్-జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చారని అన్నారు. దీనిని బట్టి ప్రభుత్వ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇప్పుడు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఈ నినాదానికి అనుసంధన్ అనే అంశాన్ని చేర్చారని అన్నారు. ఇప్పుడు అది జై జవాన్-జై కిసాన్-జై విజ్ఞాన్ మరియు జై అనుసంధాన్‌గా మారిందని వివరించారు. సైన్స్ మన జీవితాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని శ్రీ తోమర్ అన్నారు. నేడు దాని ప్రయోజనాన్ని మన దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా అనుభూతి చెందుతోందని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఒక స్థానాన్ని సాధించగల సామర్థ్యం భారతదేశానికి కూడా ఉంది, కానీ అక్కడికి చేరుకుని ముందుకు సాగాలంటే, మనం చిన్న విషయానికి కూడా శాస్త్రీయ ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. అప్పుడే ప్రపంచ పోటీలో ముందుకు వెళ్లగలుగుతామన్నారు.
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా రైతులకు భారీ ప్రయోజనం..
నేడు ఏ రంగం సైన్స్ అండ్ టెక్నాలజీని స్పృషించకుండా లేదని అన్నారు. వ్యవసాయ రంగంలోనూ సాంకేతికత వల్ల సాగు పనులు సులువైందని తెలిపారు. నష్టాలు తగ్గుముఖం పట్టడంతో పాటు సమయం ఆదా అవుతోంది. డ్రోన్ టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారన్నారు. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా రైతులకు భారీ ప్రయోజనాలు కలుగుతున్నాయని అన్నారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు జరుగుతున్న తీరును బట్టి రానున్న రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకుని భారత్ తన ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచుకుంటోందని అన్నారు. దేశ అవసరాలను తీర్చడంతో పాటు, ప్రపంచం పట్ల మన బాధ్యతలను నిర్వర్తించడంలో కూడా విజయం సాధిస్తామన్నారు. మధ్యప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి శ్రీ ఓంప్రకాష్ సక్లేచా కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్, అంతరిక్ష శాఖ కార్యదర్శి శ్రీ ఎస్. సోమనాథ్, విజ్ఞాన్ భారతి జనరల్ సెక్రటరీ శ్రీ సుధీర్ భదౌరియా, మధ్యప్రదేశ్ సెక్రటరీ శ్రీ ఇకుంజ్ శ్రీవాస్తవ, డాక్టర్ సుధాంషు వృత్తి మరియు డాక్టర్ అనిల్ కొఠారి ప్రముఖులు హాజరయ్యారు.
****
(Release ID: 1893471)
Visitor Counter : 168