భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
జీ 20-చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ (G20-CSAR) ఏర్పాట్ల కోసం ప్రణాళికా సమావేశం భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం నిర్వహించింది.
Posted On:
23 JAN 2023 3:44PM by PIB Hyderabad
ప్రతిపాదిత ఉన్నత-స్థాయి జీ 20-చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్‌టేబుల్(G20-CSAR) కోసం ఎజెండా అంశాలు మరియు ప్రణాళికను చర్చించడానికి రౌండ్‌టేబుల్ ఏర్పాట్ల కోసం ప్రణాళికా సమావేశం శుక్రవారం, 2023 జనవరి 20, 2023న ఆన్‌లైన్ మోడ్‌లో జరిగింది
భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయంలోని సైంటిఫిక్ సెక్రటరీ డాక్టర్ (శ్రీమతి) పర్వీందర్ మైనీ సమావేశానికి అధ్యక్షత వహించారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, నెదర్లాండ్స్ (ఆహ్వానించిన దేశం), రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ అధికారులు పాల్గొని, ఈ రౌండ్ టేబుల్ (G20-CSAR) కోసం పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై వారి వ్యాఖ్యలు సూచనలను అందించారు
సమగ్ర ఆరోగ్యం, అందుబాటు లోకి విద్వాంసుల శాస్త్రీయ జ్ఞానం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు శాస్త్రీయ డేటా బదిలీ అనేవి జీ 20-సీ ఎస్ ఏ ఆర్ కోసం చర్చ సమయంలో ఉద్భవించిన చర్చనీయాంశ సూచిక.
జీ 20-సీ ఎస్ ఏ ఆర్ భారతదేశం జీ 20 అధ్యక్ష స్థానం హోదాలో రూపొందించబడిన ప్రభుత్వం నుండి ప్రభుత్వ స్థాయి చొరవ. ప్రపంచ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన విధాన సమస్యల పై ఉద్దేశపూర్వకంగా చర్చించడానికి మరియు అభివృద్ధి చేయడానికి జీ 20 సభ్య దేశాలకు చెందిన చీఫ్ సైన్స్ అడ్వైజర్‌లను మరియు వారి సమానమైన స్థాయి ప్రతినిధులను, అలాగే ఆహ్వానించబడిన దేశాలను ఒకచోట చేర్చడం ఈ చొరవ యొక్క ప్రేరణ. ఈ చొరవ సమర్థవంతమైన మరియు పొందికైన విశ్వ శాస్త్ర విజ్ఞాన సలహా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంలో కూడా సహాయపడుతుంది.
ఈ జీ 20-సీ ఎస్ ఏ రౌండ్‌టేబుల్‌లు శాస్త్రీయ పరిశోధన, సాంకేతికత అభివృద్ధి మరియు విస్తరణకు సంబంధించి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అలాగే తెలిసిన సమస్యలకు పరిష్కారాలను చర్చించడానికి మరియు సాధించడానికి సమర్థవంతమైన వేదికగా ఉంటాయి. జీ 20-సీ ఎస్ ఏ చొరవ ప్రధాన జీ 20 చట్రం కింద ఇతర వర్కింగ్ గ్రూప్‌లు చొరవలను పూర్తి చేస్తుంది మరియు పరస్పర దోహదకారి అవుతుంది.
“జీ 20 చీఫ్ సైన్స్ అడ్వైజర్స్ రౌండ్‌టేబుల్‌ని ఏర్పాటు చేయడం ద్వారా, మేము ప్రపంచ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన విధాన సమస్యలను చర్చించడానికి సమర్థవంతమైన సంస్థాగత ఏర్పాటును సాధించాలనుకుంటున్నాము; మరియు ప్రపంచ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ఆవరణం ఎదుర్కొంటున్న సరిహద్దు సమస్యలకు అన్నింటికీ కాకపోయినా కొన్ని ప్రభావవంతమైన పొందికైన పరిష్కారాలు చూపాలనుకుంటున్నం”అని సమావేశంలో భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయంలోని సైంటిఫిక్ సెక్రటరీ డాక్టర్ పర్వీందర్ మైని అన్నారు.
భారతదేశం జీ 20 అధ్యక్ష స్థానం హోదా సమయంలో, రెండు ఉన్నత-స్థాయి జీ 20- సీ ఎస్ ఏ ఆర్ సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటి జీ 20- సీ ఎస్ ఏ ఆర్ సమావేశాలు మార్చి 26-28, 2023లో హైదరాబాద్‌లో మరియు 2వ జీ 20- సీ ఎస్ ఏ ఆర్ సమావేశాలు 2023 ఆగస్టు 27-29 మధ్య బెంగళూరులో జరగనున్నాయి.
***
(Release ID: 1893159)
Visitor Counter : 282