వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పంట అనంతర మౌలిక సదుపాయాలు నిర్వహణ మరియు సామజిక వ్యవసాయ ఆస్తుల కల్పన కోసం వ్యవసాయ రంగంలోని ప్రాజెక్టులకు వ్యవసాయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మూలధన సమీకరణ రూ.30,000 కోట్లను దాటింది
Posted On:
23 JAN 2023 3:27PM by PIB Hyderabad
అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (AIF) అమలులోకి వచ్చిన రెండున్నరేళ్లలో, ఏ ఐ ఎఫ్ కింద వ్యవసాయ మౌలిక సదుపాయాల రంగంలోని ప్రాజెక్టుల కోసం ఈ పథకం రూ.30,000 కోట్లకు పైగా సమీకరించింది రూ.15,000 కోట్ల మొత్తంను మంజూరు చేసింది. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఇతర పథకాలతో కలిపి సీ జీ టీ ఎం ఎస్ ఈ (CGTMSE) ద్వారా రుణ హామీ మద్దతు తో రూ.2 కోట్ల వరకు రుణం, 3% వడ్డీ రాయితీ మద్దతు సౌకర్యం అందించే పధకం. ఏ ఐ ఎఫ్ రైతులకు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), స్వయం సహాయక బృందాలు (SHGలు), ఉమ్మడి బాధ్యత బృందాలు (JLGలు) మొదలైన అనేక ఇతర రైతు సంఘాలకు మరియు పంట అనంతర నిర్వహణ మౌలిక సదుపాయాలు సృష్టించేందుకు అన్ని రకాల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా సామాజిక వ్యవసాయ ఆస్తిని నిర్మిస్తుంది.
వినియోగదారుల అవసరాలకు మరియు రైతుల నుండి ప్రాథమిక ప్రాసెస్ చేసిన కూరగాయల సరఫరాకు మధ్య డిమాండ్ సరఫరా అంతరాన్ని అర్థం చేసుకున్న కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన యోగేష్ సిబి కూరగాయల కోసం ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నాడు. ప్రభుత్వం నుండి అందుబాటులో ఉన్న మద్దతు కోసం వెతుకుతున్నప్పుడు, అతను 2020 సంవత్సరంలో ఏ ఐ ఎఫ్ పథకాన్ని గురించి తెలుసు కున్నాడు. అతను రూ.1.9 కోట్ల రుణం కోసం ఏ ఐ ఎఫ్ పోర్టల్‌లో దరఖాస్తు చేశాడు. దరఖాస్తు వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ధృవీకరించబడింది డిసెంబర్ 2020లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా చాలా త్వరగా రుణం మంజూరు అయ్యింది. ఏ ఐ ఎఫ్ సహాయంతో అతను తన కల ను సాకారం చేసుకోగలిగాడు ఏరియెన్ట్ వెజ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉనికిలోకి వచ్చింది. ఏ ఐ ఎఫ్ కింద అందించబడిన వడ్డీ రాయితీ ద్వారా అతను కేవలం 5.45% ప్రభావవంతమైన వడ్డీ రేటు (RoI) వద్ద రుణం పొందగలిగాడు, ఇది బహిరంగ మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ. ప్రస్తుతం, ఏరియంట్ వెజ్ 250 మందికి పైగా స్థానిక రైతులకు విత్తనాలు మరియు నాణ్యమైన కూరగాయలను పండించే సాంకేతికతను అందించడం ద్వారా వారికి మద్దతునిస్తుంది, ఆపై వారు రైతుల నుండి పంట దిగుబడిని సరసమైన ధరకు సేకరిస్తారు, రోజువారీగా తుది వినియోగదారుని చేరుకోవడానికి ముందు
వాటిని శుభ్రం చేసి, క్రమబద్ధీకరించి, గ్రేడింగ్ చేసి, ప్రాసెసింగ్ సెంటర్‌లో ప్యాక్ చేస్తారు.
అదేవిధంగా, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాకు చెందిన ఆనంద్ పటేల్ అనే రైతు వ్యవసాయంలో యాంత్రీకరణ యొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకతను ముఖ్యంగా వ్యవసాయ యంత్రాలు గిట్టుబాటు ధర లో అందుబాటు లో లేని చిన్న మరియు సన్నకారు రైతుల దురవస్థలను గ్రహించారు. అతను హైటెక్ హబ్‌ను స్థాపించాడు, అక్కడ వ్యవసాయ యంత్ర పరికరాలను స్థానిక రైతులకు అద్దె ప్రాతిపదికన అందించారు. ఈ హైటెక్ హబ్‌లో కంబైన్ హార్వెస్టర్, థ్రెషర్, లేజర్ ల్యాండ్ లెవలర్, ట్రాక్టర్లు, జీరో టు సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, మల్చర్ మొదలైన వాటితో సహా 12 వ్యవసాయ యంత్రాలు ఉన్నాయి, దీని ధర సుమారు రూ. 60.82 లక్షలు మిస్టర్ పటేల్ లాంటి రైతుకు ఈ మొత్తం చాలా పెద్దగా అనిపించింది. కానీ అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ తో పాటు ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు కలిపి , పటేల్ కేవలం 5.4% వడ్డీ రేటుతో రూ. 45.62 లక్షలు రుణాన్ని అలాగే మంత్రిత్వ శాఖ యొక్క సబ్-మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (SMAM) పథకం కింద మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 40% మూలధన రాయితీ ప్రయోజనం కూడా పొందారు. ఇప్పుడు అతను 100 మందికి పైగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఈ యంత్రాల సేవలను అందిస్తున్నాడు, ఇది వారికి చాలా శ్రమ, సమయం మరియు డబ్బు ఆదా చేయడంలో సహాయపడింది.
ఏ ఐ ఎఫ్ 20,000 కంటే ఎక్కువ మంది లబ్ధిదారులలో యోగేష్ మరియు ఆనంద్ ఇద్దరు ఉన్నారు, వారి జీవితాలను సాఫల్యం చేయడానికి మరియు వ్యవసాయ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలనే వారి కల ఏ ఐ ఎఫ్ మద్దతు ద్వారా నిజమైంది. ఏ ఐ ఎఫ్ చాలా అవసరమైన వ్యవసాయ మౌలిక సదుపాయాలను సృష్టించడం మరియు ఆధునీకరించడం ద్వారా భారతీయ వ్యవసాయం యొక్క దృశ్యాన్ని నిశ్శబ్దంగా మారుస్తోంది. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లు పంట అనంతర నష్టాలను తగ్గించడంలో, వ్యవసాయ ప్యాకేజీ మరియు పద్ధతులను ఆధునీకరించడంలో మరియు రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన ధరను పొందడంలో సహాయపడతాయి.
అగ్రికల్చర్ ఇన్‌ఫ్రా ఫండ్ (AIF) 8 జూలై 2020న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో, పంట దిగుబడి అనంతర మౌలిక సదుపాయాలు నిర్వహణ మరియు సామాజిక వ్యవసాయ ఆస్తుల కల్పన కోసం ప్రారంభించబడిన ఫైనాన్సింగ్ సదుపాయం. ఈ పథకం కింద, 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1 లక్ష కోట్లు పంపిణీ వడ్డీ రాయితీ మరియు క్రెడిట్ గ్యారెంటీ సహాయం 2032-33 సంవత్సరం వరకు ఇవ్వబడుతుంది.
***
(Release ID: 1893155)
Visitor Counter : 278