రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మధ్యప్రదేశ్ ఓర్ఛాలో రూ. 6800 కోట్ల వ్యయంతో నిర్మించిన మొత్తం 550 కిమీల పొడవైన 18 జాతీయ హైవే ప్రాజెక్టులను ప్రారంభించిన శ్రీ నితిన్‌గడ్కరీ
Posted On:
23 JAN 2023 6:17PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మధ్యప్రదేశ్‌లోని ఓర్ఛాలో రూ. 6800 కోట్ల వ్యయంతో నిర్మించిన మొత్తం 550 కిమీల పొడవైన 18 జాతీయ హైవే ప్రాజెక్టులను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ వీరేంద్ర కుమార్, కేంద్ర సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర ప్రముఖుల సమక్షంలో ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా బెట్వా వద్ద వంతెన నిర్మించాలన్న స్థానిక ప్రజల ఆకాంక్ష నెరవేరిందని శ్రీ గడ్కరీ అన్నారు. ఈ 665 మీటర్ల పొడవైన వంతెనను రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించారని తెలిపారు. టూలేన్ పేవ్డ్ షోల్డర్ బ్రిడ్జ్ (రోడ్డు పక్కన వేసిన వంతెన), ఫుట్‌పాత్ నిర్మాణంతో ఓర్ఛా, ఝాన్సీ, తికంగఢ్ మధ్య అనుసంధానత అన్నది మెరుగుపడుతుందని అన్నారు.
పోవై, ఓర్ఛా, హర్‌పల్‌పూర్, కౌథి పధారియా కలా, పట్నా తమౌలి, జెస్సో, నాగౌద్ & సాగర్ లింక్ రోడ్ బైపాస్‌లు నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తుందన్నారు. సాగర్ గ్రీన్‌ఫీల్డ్ లింక్ రోడ్డు భోపాల్ నుంచి కాన్పూర్ మధ్య దూరాన్ని 21 కిమీ మేరకు తగ్గిస్తుంది. సతాయ్ ఘాట్ & చౌకా నుంచి ఎంపి/ యుపికి మొహారీ ద్వారా వెళ్ళవచ్చు. సరిహద్దుల వరకు 4 లేన్ వైడెనింగ్ (విస్తరింపు) అన్నది ప్రయాణ సమయాన్ని బాగా తగ్గిస్తుందని ఆయన అన్నారు.సాగర్ సిటీ, ఛత్తర్‌పూర్ నగరం, గధాకోటా లలో ఫ్లైఓవర్ల నిర్మాణం అన్నది ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరిస్తుందని ఆయన వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని ఓర్ఛా, ఖజురాహో, పన్నా, చిత్రకూట్,తికంగఢ్, సాంచీ వంటి పర్యాటక ప్రదేశాలకు చేరుకోవడానికి సులువైన అనుసంధానత ఉంటుందని శ్రీగడ్కరీ తెలిపారు. భోపాల్- కాన్పూర్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణంతో సిమెంటు, ఖనిజాల రవాణా సులభతరం అవుతుందని, వాటికయ్యే ఖర్చు తగ్గుతుందని వివరించారు. కారిడార్ నిర్మాణంతో, భోపాల్, నుంచి కాన్పూర్, లక్నో, ప్రయాగరాజ్, వారణాసి మధ్య అనుసంధానత మెరుగుపడుతుందన్నారు. తికంగఢ్ నుంచి ఓర్ఛాకు పేవ్డ్ షోల్డర్ (ప్రధాన రహదారి పక్కన ట్రాఫిక్ రద్దీ సమయంలో ఉపయోగించేందుకు అదనపు రోడ్డు) వేసిన 2-లేన్ రోడ్డు ట్రాఫిక్‌ను సురక్షితం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గడ్కరీ బమిత నుంచి సత్నాకు రూ. 2000 కోట్ల వ్యయంతో 105 కిమీల పొడవైన 4 లేన్ హరిత క్షత్ర రోడ్డు నిర్మాణాన్ని శ్రీ గడ్కరీ ప్రకటించారు. ఈ రోడ్డు నిర్మాణంతో తికంగఢ్, పన్నా, ఛత్తర్‌పూర్, ఖజురాహో, బాంధవ్‌గఢ్ నేషనల్ పార్క్ వంటి పర్యాటక స్థలాలు అభివృద్ధి చెందుతాయన్నారు.
***
(Release ID: 1893151)
Visitor Counter : 178