వ్యవసాయ మంత్రిత్వ శాఖ

బెంగుళూరులో చిరు ధాన్యాలు మరియు సహజ ఆహార ఉత్పత్తులపై అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను సందర్శించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్


చిన్న సన్నకారు రైతుల పట్ల ప్రధాన మంత్రి చాలా సహానుభుతి తో ఉంటారు - శ్రీ తోమర్

చిరుధాన్యాలు ఉత్పత్తి, వినియోగం మరియు ఎగుమతుల వృద్ది వల్ల రైతులు లాభపడతారు

Posted On: 22 JAN 2023 7:52PM by PIB Hyderabad

దేశంలోని చిన్న సన్నకారు రైతుల పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చాలా సహానుభుతి తో వ్యవహరిస్తున్నారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. శ్రీ మోదీ దూరదృష్టితో ఐక్యరాజ్యసమితిలో చిరుధాన్యాల సమస్యను లేవనెత్తారు, అక్కడ 72 దేశాల మద్దతుతో భారత ప్రభుత్వ తీర్మానం ఆమోదించబడింది మరియు ఐక్యరాజ్యసమితి ప్రకటన ప్రకారం, ఇప్పుడు భారతదేశం నాయకత్వంలో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నారు. దీని వెనుక, చిరుధాన్యాల ఉత్పత్తి మరియు ఉత్పాదకత, ప్రాసెసింగ్ మరియు ఎగుమతులు పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం, ఇది చివరికి దేశ రైతులకు సహాయపడుతుంది.

 

చిరుధాన్యాల మరియు సహజ ఆహార  ఉత్పత్తులపై జరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీ తోమర్ ఈరోజు బెంగళూరులో మాట్లాడారు. చిరుధాన్యాల పంటలను తక్కువ నీటితో పండించవచ్చని శ్రీ తోమర్ చెప్పారు. చిరుధాన్యాలు కూడా రైతుల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడతాయి. దేశంలో చిరుధాన్యాలు ఉత్పత్తి మరియు వినియోగం పెరగడంతో, దాని ఎగుమతి కూడా పెరుగుతుంది, ఇది పెద్ద సంఖ్యలో రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చిరుధాన్యాల ఉత్పత్తి మరియు వినియోగాన్ని పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఈ సంధర్భంగా రూ. 201 కోట్ల రూపాయ విలువైన అవగాహన ఒప్పందం పై సంతకాలు చేయటం ఒక ముఖ్యమైన మైలురాయి. రాష్ట్రంలోని రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను కూడా కొనియాడారు.

 

రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు వారి సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ముఖ్యమైన పథకాలను అమలు చేస్తున్నాయని శ్రీ తోమర్ చెప్పారు. రైతులకు వార్షిక ఆదాయ సాయంగా  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీ ఎం-కిసాన్) పథకం ద్వారా రూ. 6,000. అంతేకాకుండా, కర్ణాటకలోని రైతులకు అదనపు వార్షిక ఆదాయ మద్దతుగా ఒక్కొక్కరికి రూ. 4,000  అందిస్తున్నాయి . అత్యధికంగా ఉన్న చిన్న రైతుల సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో, ప్రధాన మంత్రి శ్రీ మోదీ దేశంలో 10,000 కొత్త రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPO) ను ప్రారంభించారు, దీని కోసం భారత ప్రభుత్వం రూ. 6,865 కోట్లు ఖర్చు చేసింది. దేశవ్యాప్తంగా అలాగే కర్ణాటకలో కొత్త ఎఫ్‌పిఓల ఏర్పాటులో ఉత్సాహభరితమైన సహకారాన్ని ఆయన అభినందించారు. శ్రీ తోమర్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని పురోగమింపజేసి రైతులు అభివృద్ధి చెందేందుకు కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

 

ఈ సందర్భంగా శ్రీ తోమర్ వివిధ రంగాలకు అవార్డులను ప్రదానం చేశారు.కేంద్ర రసాయనాలు  మరియూ ఎరువులు మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా, ఉత్తరప్రదేశ్ వ్యవసాయ మంత్రి శ్రీ సూర్య ప్రతాప్ సింగ్ షాహి మరియు రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శ్రీ దినేష్ ప్రతాప్ సింగ్, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ బి.సి. పాటిల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

***



(Release ID: 1892900) Visitor Counter : 160


Read this release in: English , Urdu , Hindi , Kannada