ప్రధాన మంత్రి కార్యాలయం
డైరెక్టర్జనరల్స్ ఆఫ్ పోలీస్/ ఇన్స్ పెక్టర్ జనరల్స్ ఆఫ్పోలీస్ యొక్క అఖిల భారతీయ సమ్మేళనం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
పోలీసు బలగాల ను మరింత స్పందనశీలం గా తీర్చిదిద్దాలని, ఇంకాకొత్త గా ఉనికి లోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాల లో వారికి శిక్షణ ను ఇవ్వాలనిసూచించిన ప్రధాన మంత్రి
వివిధ ఏజెన్సీల కు డేటా బదలాయింపు సాఫీ గా జరగడం కోసం నేశనల్డేటా గవర్నెన్స్ ఫ్రేంవర్క్ ముఖ్యం అని స్పష్టంచేసిన ప్రధాన మంత్రి
రాష్ట్ర పోలీసు మరియుర కేంద్రీయ ఏజెన్సీల మధ్య సహకారంపెంపొందాలని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి
కాలంచెల్లిన నేర సంబంధి చట్టాల ను రద్దు చేయాలని సిఫారసు చేసిన ప్రధాన మంత్రి
Posted On:
22 JAN 2023 7:56PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 21 వ మరియు 22 వ తేదీల లో న్యూ ఢిల్లీ లో ఏర్పాటైన డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ ఇన్స్ పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క అఖిల భారతీయ సమ్మేళనం లో పాలుపంచుకొన్నారు.
పోలీసు బలగాల ను మరింత స్పందనశీలమైనవి గా తీర్చిదిద్దాలని మరి కొత్త గా ఉనికి లోకి వస్తున్నటువంటి సాంకేతిక విజ్ఞానాల లో వారికి శిక్షణ ను ఇవ్వాల ని ప్రధాన మంత్రి సూచనలు చేశారు. ఏజెన్సీల మధ్య ఇబ్బంది లేకుండా డేటా ఆదాన ప్రదానం జరిగేలా చూడడానికి గాను నేశనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేం వర్క్ అనేది చాలా ముఖ్యం అని ఆయన స్పష్టంచేశారు. బయోమెట్రిక్స్ వంటి సాంకేతిక పరిష్కార మార్గాల ను మనం మరింత గా వినయోగించుకొంటూ ఉండాలి, మరో పక్క కాలి నడకన గస్తీ కాయడం మొదలైన సాంప్రదాయక పోలీసింగ్ యంత్రాంగాల ను ఇంకా అధికం గా పటిష్ట పరచుకోవలసిన అవసరం కూడా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. నేర సంబంధి చట్టాల లో వ్యవహార దూరమైనటువంటి చట్టాల ను కొట్టివేయాలని, రాష్ట్రాల మధ్య పోలీసు సంస్థల కు ప్రమాణాల ను నెలకొల్పాలని ఆయన సిఫారసు చేశారు. కారాగార నిర్వహణ ను మెరుగుపరచడం కోసం జైలు సంస్కరణల తీసుకు రావాలని ఆయన సూచించారు. అధికారులు తరచు గా సందర్శనల ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సరిహద్దు ప్రాంతాల లో సురక్ష తో పాటు గా కోస్తా తీర ప్రాంతాల లో సురక్ష ను బలపరచడం అనే అంశాన్ని గురించి కూడా ఆయన చర్చించారు.
సామర్థ్యాల ను వినియోగించుకోవడం మరియు ఉత్తమ అభ్యాసాల ను పరస్పరం ఆచరిస్తుండడం కోసం రాష్ట్రాల పోలీసు మరియు కేంద్రీయ సంస్థల మధ్య సహకారం పెంపొందాలి అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ఎప్పటికప్పుడు ఎదురవుతూ ఉన్న సవాళ్ల ను గురించి మరియు తమ తమ జట్టుల మధ్య తరచు విధవిధాలు గా అనుసరిస్తున్నటువంటి ఉత్తమ అభ్యాసాల ను గురించి చర్చించుకోవడం కోసం డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ ఇన్స్ పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (డిజిఎస్ పి/ఐజిఎస్ పి) సమ్మేళనం వంటి వాటినే రాష్ట్రం/జిల్లా స్థాయిల లో సైతం నిర్వహించడాన్ని గురించి పరిశీలించండి అని ఆయన సూచన చేశారు.
విశిష్ట సేవల కు గాను పోలీసు పతకాల ను ప్రధాన మంత్రి ప్రదానం చేసిన తరువాత సమ్మేళనం ముగిసింది.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం లో ఎదురయ్యే సవాళ్లు,చొరబాటుల ను అడ్డుకోవడం మరియు సైబర్ సెక్యూరిటి లు సహా పోలీసింగ్ కు , ఇంకా జాతీయ భద్రత కు సంబంధించిన వివిధ అంశాల ను సమ్మేళనం లో సమీక్షించడమైంది. కేంద్ర హోం మంత్రి, హోం శాఖ సహాయ మంత్రులు, జాతీయ భద్రత సలహాదారు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ ఇన్స్ పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (డిజిఎస్ పి/ఐజిఎస్ పి), ఇంకా కేంద్రీయ పోలీసు సంస్థల/కేంద్రీయ సాయుధ పోలీసు బలగాల అధిపతులు ఈ సమ్మేళనం లో పాల్గొన్నారు. వీరు కాకుండా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి వేరు వేరు స్థాయిల కు చెందిన దాదాపు గా 600 మంది అధికారులు సైతం వర్చువల్ విధానం ద్వారా ఈ సమ్మేళనం లో పాలుపంచుకొన్నారు.
***
(Release ID: 1892898)
Visitor Counter : 204
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam