రక్షణ మంత్రిత్వ శాఖ
ఐసిజిఎస్ శౌర్య, రాజ్‌వీర్ నౌకలు విదేశాలలో మోహరింపు కోసం బాంగ్లాదేశ్‌కు
Posted On:
20 JAN 2023 3:28PM by PIB Hyderabad
భారత, బాంగ్లాదేశ్ కోస్టగార్డ్ (బిసిజి - తీర రక్షక దళం) మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం (ఎంఒయు)లోని అంశాల కింద సహకార ఒప్పందాలు, అంతర్ కార్యాచరణను పెంచేందుకు 13 నుంచి 19 జనవరి 2023 వరకు బాంగ్లాదేశ్‌లోని చత్తోగ్రామ్‌కు భారతీయ కోస్ట్‌గార్డ్ నౌకలు ఐసిజిఎస్ శౌర్య, రాజ్‌వీర్‌లు ఆరు రోజుల పర్యటనకు వెళ్ళాయి. ఈ ప్రాంతంలో భద్రమైన, సురక్షితమైన, స్వచ్ఛమైన సముద్రాన్ని హామీ ఇచ్చేందుకు గత కొన్నేళ్ళలో ఎన్నోరకాలుగా బిసిజితో పెరిగిన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రాముఖ్యత. పర్యటన సందర్భంగా బిసిజికి చెందిన వివిధ సీనియర్ అధికారులు, సిబ్బందితో ఫలవంతమైన చర్చలు బెస్తవారు, నావికుల భద్రత, సంక్షేమం అన్నవి మరింత పెంచాయి.
పర్యటన సందర్భంగా, భారతీయ కోస్ట్‌గార్డ్ కు చెందిన కాలుష్య పరతిస్పందన బృందాలు 20మంది బిసిజి సిబ్బంది కోసం బాంగ్లాదేశ్‌లో తొలిసారి కాలుష్య ప్రతిస్పందనపై ఐదురోజుల అంతర్జాతీయ సముద్ర సంబంధ సంస్థ లెవెల్ 1 కోర్సును నిర్వహించింది. దీనితోపాటుగా, బిసిజి సిబ్బందికి ఐసిజిఎస్ నౌకలు శౌర్య, రాజ్‌వీర్‌లపై పిఆర్ పరకరాల కార్యకలాపాలపై శిక్షను కూడా అందించారు.
పర్యటన సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, సోదాలు, రక్షణ రంగంలో ప్రామాణిక కార్యాచరణ విధానాలు (ఎస్ఒపి)లను ధృవీకరించడానికి బిసిజి నౌకలతో కలిసి సముద్రంలో ఉమ్మడి విన్యాసాలు నిర్వహించారు. సీనియర్ అధికారులు, ట్రైనీలు ప్రదర్శించిన తీవ్ర ఆసక్తి,, ఉత్సాహం ఈ ప్రాంతంలో ఆయా ప్రభుత్వాలు చేపట్టిన సముద్ర పర్యావరణ పరిరక్షణ చొరవలను తప్పనిసరిగా తోడ్పడతాయి.
***
(Release ID: 1892668)
Visitor Counter : 192