గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

భారత కోస్ట్ గార్డ్, రక్షణ మంత్రిత్వ శాఖ సహకారంతో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మిలిటరీ టాటూ మరియు గిరిజన నృత్య ప్రదర్శన -ఆది శౌర్య-పర్వ్ పరాక్రమ్ కా కార్యక్రమం- న్యూ ఢిల్లీలోని జే ఎల్ ఎన్ స్టేడియం వేదిక


నృత్య ప్రదర్శన కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయి

Posted On: 20 JAN 2023 12:12PM by PIB Hyderabad

గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి, భారత తీర రక్షక దళం సమన్వయ సంస్థ గా, అమృత్ మహోత్సవ్ ప్రత్యేక సందర్భంగా మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (పరాక్రమ్ దివస్) 126వ జయంతిని పురస్కరించుకుని మిలిటరీ టాటూ మరియు గిరిజన నృత్య ఉత్సవం 'ఆది శౌర్య-పర్వ్ పరాక్రమ్ కా'ను న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 2023 జనవరి 23 మరియు 24 తేదీల్లో  నిర్వహిస్తోంది. 

 

ఈ ఉత్సవం లో  సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రదర్శించడానికి మిలిటరీ టాటూ, భారతదేశ వ్యాప్తంగా ఉన్న గిరిజన సంఘాలచే  గిరిజన సంస్కృతి వైవిద్యపు  అందాన్ని ప్రదర్శించే ఉత్సహపూరిత నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్థాన్, జార్ఖండ్, లడఖ్, మధ్యప్రదేశ్ మరియు మరిన్ని రాష్ట్రాల నుండి గిరిజన నృత్య బృందాలు వేదిక వద్దకు చేరుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ నుండి గడ్డి నాతి, గుజరాత్ నుండి సిద్ధి ధమాల్, పశ్చిమ బెంగాల్ నుండి పురూలియా చౌ మరియు మరెన్నో అద్భుతమైన నృత్యాలను ప్రేక్షకులు చూస్తారు.

 

రిహార్సల్స్‌ను పరిశీలించడానికి శ్రీమతి. ఆర్ జయ,గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి  నిన్న అంటే 19 జనవరి 2023న వేదికను సందర్శించారు. ఆమె రక్షణ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు.

 

అద్బుతమైన కార్యక్రమాలకు, ముఖ్యంగా గిరిజన నృత్యాలకు అలంకరణ వస్తువులు తో కూడిన డ్రెస్ రిహార్సల్స్ గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. 1200 మందికి పైగా ప్రదర్శకులు తమ కళారూపాలను మెరుగుపరుస్తున్నారు. వారు తమ మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలతో నగరాన్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. సందర్శకులను ఆకట్టుకునేందుకు వేదికను ప్రాంగణంలోపల, స్టేడియం సముదాయం వెలుపల గిరిజన కళారూపాలతో అలంకరించారు. రెండు మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు వైభవంగా గా ఘనంగా విజయవంతం చేసేందుకు సన్నాహాలను పరిశీలిస్తున్నారు.

 

ముగింపు కార్యక్రమం లో ప్రసిద్ధ నేపథ్య గాయకుడు శ్రీ కైలాష్ ఖేర్ ప్రదర్శనతో పాటు సైనిక టాటూ మరియు గిరిజన నృత్యాలు రెండింటిని కలిపి ప్రదర్శించే చివరి అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శిస్తారు. రెండు రోజుల్లో 60,000 మందికి పైగా ప్రజలు వేదిక వద్దకు వచ్చే అవకాశం ఉంది.

 

ప్రేక్షకులు తమ సీట్లను దిగువ లింక్ పై క్లిక్ చేసి  ఉచితంగా రిజర్వ్ చేసుకోవచ్చు.  https://in.bookmyshow.com/

 

******



(Release ID: 1892667) Visitor Counter : 171