పర్యటక మంత్రిత్వ శాఖ

జీ -20 సమావేశాలు


జీడీపీకి 56 బిలియన్ అమెరికా డాలర్లను అందించి 14 మిలియన్ ఉద్యోగాలు కల్పించనున్న భారతీయ పర్యాటక రంగం

పర్యాటక రంగంలోకి పెట్టుబడులు ఆకర్షించడానికి 2023 ఏప్రిల్ లో మొదటి ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్న పర్యాటక మంత్రిత్వ శాఖ

Posted On: 19 JAN 2023 6:26PM by PIB Hyderabad

జీ-20 అధ్యక్ష హోదాలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా భారత ప్రభుత్వం 2023 ఏప్రిల్ 10 నుంచి 12 వరకు ప్రపంచ పర్యాటక సదస్సు నిర్వహిస్తుంది. న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సదస్సు జరుగుతుంది. కార్యక్రమంలో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ ) భాగస్వామిగా వ్యవహరిస్తోంది. జీ-20 సభ్య దేశాలకు సదస్సులో పాల్గోవాలని భారతదేశం ఆహ్వానాలు పంపుతుంది.  

సదస్సు నిర్వహణకు ముందు ముంబైలోని సెయింట్ రెగిస్ హోటల్‌లోపర్యాటక మంత్రిత్వ శాఖ  రోడ్‌షో నిర్వహించింది. రోడ్ షో లో   పశ్చిమ ప్రాంత రాష్ట్రాలకు చెందిన పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొని కేంద్ర  పర్యాటక మంత్రిత్వ శాఖ 2023లో నిర్వహించనున్న ప్రధాన సదస్సు ప్రధాన లక్ష్యాన్ని వివరించారు. భారతదేశం జీ-20 అధ్యక్ష హోదాలో పనిచేసే ఏడాది కాలంలో దేశాన్ని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది.దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను  వివిధ దేశాల  కాన్సులేట్‌లు అందించాయి.
భారతదేశం పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను ప్రపంచ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సులో వివరిస్తామని  కేంద్ర  పర్యాటక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ శ్రీ ప్రశాంత్ రంజన్ తెలిపారు.  
 థీమ్ పార్కులు, అడ్వెంచర్ టూరిజం, వెల్‌నెస్ టూరిజం వంటి పర్యాటక రంగాలకు చెందిన  వివిధ విభాగాలలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలు, వ్యాపార అవకాశాలను వివరిస్తామని శ్రీ  ప్రశాంత్ రంజాన్ తెలిపారు. పర్యాటక రంగంలో  56 బిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే ఆదాయాన్ని ఆర్జించాలని,  2030 నాటికి టూరిజంలో దాదాపు 140 మిలియన్ ఉద్యోగాలు కల్పించాలని భారతదేశం భావిస్తోంది. దీనికోసం  క్రూయిజ్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజంపై దృష్టి సారించాలని నిర్ణయించింది.  వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా భారత ప్రభుత్వం మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టి పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తోందని శ్రీ రంజన్ అన్నారు.   పర్యాటకం, ఆతిథ్య రంగాలను  ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం  ఇప్పుడు స్వదేశ్ దర్శన్  2.0 అనే   ప్రవేశపెడుతున్నామని అన్నారు. , పర్యాటక ప్రాంతాల స్థిరమైన మరియు బాధ్యతాయుతమైన అభివృద్ధిపై స్వదేశ్ దర్శన్  2.0 దృష్టి సారిస్తుందని ఆయన పేర్కొన్నారు.

మహారాష్ట్ర లో పర్యాటక పరిశ్రమలో పెట్టుబడి అవకాశాలను సులభతరం చేయడానికి ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్‌ను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మహారాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సౌరభ్ విజయ్ తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి  వినోద ఉద్యానవనాలు, ప్రత్యేక కుటుంబ పర్యాటకం  , క్రూయిజ్ టూరిజం మరియు పర్యావరణ పర్యాటకం వంటి వివిధ రంగాలను గుర్తించామని అన్నారు. పర్యాటక రంగంలో  ప్రైవేటు పెట్టుబడులు, భాగస్వామ్యాలపై కూడా దృష్టి సారించామని పేర్కొన్నారు. మడ అడవులు, అక్వేరియం ప్రాజెక్ట్ వంటి నిర్దిష్ట రంగాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయని గుర్తించామని అన్నారు. సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహణ ద్వారా పర్యాటక రంగంలో  బాధ్యతాయుతమైన పర్యాటక రంగ అభివృద్ధికి గల  అవకాశాలను గుర్తిస్తామని శ్రీ రంజన్ తెలిపారు. సులభతరం వ్యాపార నిర్వహణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం లైసెన్సుల సంఖ్య ని 10 కి తగ్గించింది. సంఖ్యను తగ్గించింది. ' " క్రూయిజ్ క్యాపిటల్ గా ముంబయి'   'టైగర్ క్యాపిటల్' గా తడోబా గుర్తింపు పొందాయని అన్నారు.  

 ముంబై మరియు మహారాష్ట్రలో  రోడ్‌షోను నిర్వహించిన సిఐఐ కి శ్రీ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
సీఐఐ కో-కన్వీనర్ డైరెక్టర్ శ్రీ సునీత్ కొఠారి మాట్లాడుతూ  "భారతదేశంలో ప్రయాణం, పర్యాటక పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మధ్యతరగతి ప్రజల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో  ఈ రంగాలు  ఆకర్షణీయమైన పెట్టుబడి రంగాలుగా ఉన్నాయి. ఈ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది.ఈ రంగాల్లో అభివృద్ధి సాధించడానికి వివిధ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ భారతదేశంలో   మహారాష్ట్ర ప్రధాన రాష్ట్రం, బీచ్‌లు, హిల్ స్టేషన్‌లు, వన్యప్రాణుల అభయారణ్యాలు, పురాతన దేవాలయాలు , స్మారక చిహ్నాలు వంటి విభిన్న ఆకర్షణలకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. రాష్ట్రం దాని అనేక బలాలు మరియు ప్రస్తుత పరిమితులను పరిష్కరిస్తూ ఆదర్శవంతమైన పర్యాటక గమ్యస్థానంగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉంది." అని  శ్రీ సునీత్ కొఠారి అన్నారు. 

గోవా, మధ్యప్రదేశ్, డామన్ డయ్యూ రాష్ట్ర అధికారులు తమ రాష్ట్రాల్లో పర్యాటక / పరిశ్రమల శాఖ ద్వారా వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అమలు చేస్తున్న చర్యలు, ఈ రంగానికి సంబంధించి ప్రత్యేకమైన ఆర్థిక మరియు ఆర్థికేతర ప్రోత్సాహకాల వివరాలు  వివరించారు. పెట్టుబడి రంగంలో సాధించిన విజయాలను అధికారులు వివరించారు.సామాజిక-ఆర్థిక మార్పు కు  పర్యాటక రంగం  సామర్థ్యాన్ని వినియోగిస్తున్నామని అన్నారు. రానున్న సదస్సుపై ఈ రోజు నిర్వహించిన  రోడ్‌షో లో  మధ్యస్థ ఆపరేటర్లు గణనీయమైన ఆసక్తి కనబరిచారు. 

****

 

 



(Release ID: 1892457) Visitor Counter : 175


Read this release in: English , Urdu , Hindi , Punjabi