రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మొత్తం రూ. 4200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న అహ్మదాబాద్- ధొలేరా ఎక్స్‌ప్రెస్‌వే పురోగతిని తనిఖీ చేసిన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
19 JAN 2023 4:36PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా & హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అహ్మదాబాద్- ధొలేరా ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజ్ 1) పనులను గురువారంనాడు తనిఖీ చేశారు. ఈ 109 కిమీల పొడవైన హరితక్షేత్ర కారిడార్‌ను మొత్తం రూ 4200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు.
ఇది అహ్మదాబాద్ & ధొలేరాను అనుసంధానం చేసేందుకు ముఖ్యమైన మార్గమే కాక ధొలేరా నుంచి అహ్మదాబాద్ మధ్య పలు ప్రత్యేక పెట్టుబడి జోన్లను కూడా అనుసంధానం చేస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే అహ్మదాబాద్, ధొలేరా మధ్య అధిక వేగంతో ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ, ప్రయాణ సమయాన్ని 1 గంట (ప్రస్తుతం 2.25 గంటలు) తగ్గిస్తుంది. ఇది ధొలేరాలోని ఎయిర్‌పోర్ట్‌కు కూడా నేరుగా అనుసంధానం చేస్తుంది.
ఈ మార్గం నవగాంవ్‌లోని ధొలేరా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ ద్వారా సర్ఖేజాను అనుసంధానం చేయడంతో పాటుగా ధొలేరా ప్రత్యేక పెట్టుబడి ప్రాంతం (ఎస్ఐఆర్) సమీపంలోని సర్దార్ పటేల్ రింగ్ రోడ్డును కూడా అనుసంధానం చేస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే అహ్మదాబాద్ & ధొలేరాలో పారిశ్రామిక కార్యకలాపాలు వేగవంతం కావడానికి కూడా తోడ్పడుతుంది.
***
(Release ID: 1892455)
Visitor Counter : 157