మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అపోహలు వాస్తవాలు


కల్తీ పాలు దేశంలో ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలు వాస్తవానికి దూరంగా, తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి

దేశవ్యాప్తంగా వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన పాలు సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది

సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌లలో ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు

Posted On: 19 JAN 2023 2:20PM by PIB Hyderabad

పాలు మరియు పాల ఉత్పత్తుల కల్తీని తక్షణం అరికట్టని పక్షంలో 2025 నాటికి దేశ జనాభాలో 87% ప్రజలకు  క్యాన్సర్ లాంటి తీవ్రమైన వ్యాధులు సోకే ప్రమాదం ఉందని భారత ప్రభుత్వానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసినట్లు ఒక మీడియాలో వచ్చిన వార్త     పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య  మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చింది. ఇటువంటి  తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల వినియోగదారులు  అనవసరమైన భయాందోళనలకు గురవుతున్నారు.

ఈ అంశాన్ని భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)తో మంత్రిత్వ శాఖ సమీక్షించింది. భారత ప్రభుత్వానికి  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటువంటి హెచ్చరికలు జారీ చేయలేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కి పంపిన సమాచారంలో   ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశ కార్యాలయం స్పష్టం చేసింది. 

సామాజిక మాధ్యమాలు, వాట్సాప్‌లో ప్రసారం అవుతున్న ఈ రకమైన తప్పుడు సమాచారాన్ని ఎటువంటి విశ్వసనీయత లేదని, ఇటువంటి ప్రచారంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, కేంద్ర ఇవ్వకూడదని డిపార్ట్‌మెంట్ పునరుద్ఘాటించింది.దేశవ్యాప్తంగా వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన పాలు సరఫరా అయ్యేలా చూడడానికి కేంద్ర పశుసంవర్ధక ,పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అన్ని చర్యలను తీసుకుంటున్నాయి.

దేశంలో ఉత్పత్తి అవుతున్న పాల ఉత్పత్తికి సంబంధించి వస్తున్న వార్తలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. 2018-19లో దేశంలో ప్రతి రోజు 51.4 కోట్ల కేజీల పాల ఉత్పత్తి జరుగుతోందని పశుసంవర్ధక గణాంకాలు 2021 చెబుతున్నాయి. అయితే, వార్త లో దేశంలో పాల ఉత్పత్తి రోజుకు 14 కోట్ల లీటర్ల వరకు ఉంది అని  ప్రచురించారు. దేశంలో పాల ఉత్పత్తి 2014-15లో 146.3 మిలియన్ టన్నుల నుంచి 2021-22 లో 6.1% వార్షిక వృద్ధి రేటుతో 221.06 మిలియన్ టన్నులకు (రోజుకు 66.56 కోట్ల లీటర్లు) పెరిగింది. 2019లో భారతదేశంలో పాలు మరియు పాల ఉత్పత్తుల డిమాండ్‌పై మంత్రిత్వ శాఖ  ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. అధ్యయనం ప్రకారం, 2019లో దేశం మొత్తం మీద పాలు, పాల ఉత్పత్తుల వినియోగం  162.4 మిలియన్ మెట్రిక్ టన్నులు (రోజుకు 44.50 కోట్ల కిలోలు) వరకు ఉందని వెల్లడైంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న పాల ఉత్పత్తి దేశీయ డిమాండ్‌కు సరిపోతుంది.

మార్కెట్‌లో విక్రయించే పాలు,పాల ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను  భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ నిర్దేశించి అమలు చేస్తుంది. పాలు,పాల ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలపై   ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ  జాతీయ స్థాయిలో భద్రత మరియు నాణ్యత సర్వే (NMQS-2018)నిర్వహించింది. 6,432 పాల నమూనాలు పరీక్షించగా వినియోగానికి సురక్షితం కాని విధంగా   కేవలం 12 నమూనాలు (0.19%) మాత్రమే కల్తీ అయినట్టు వెల్లడయింది. పాలు,పాల ఉత్పత్తుల కల్తీ   ఆందోళన కలిగించే అంశం.  అయితే దేశంలో పాలు ఎక్కువగా కల్తీ అవుతున్నాయి అనడం వాస్తవానికి దూరంగా ఉంది.

 

 

****


(Release ID: 1892286) Visitor Counter : 183