మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
విచారణలు జరిపి, పిటిషన్లను పరిష్కరించిన ఎన్‌సిఎం (జాతీయ మైనారిటీల కమిషన్)
Posted On:
18 JAN 2023 4:28PM by PIB Hyderabad
కేవలం గత నెలలోనే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్‌కు (జాతీయ మైనారిటీల కమిషన్) 168 అందగా, అందులో 73 సమస్యలను పరిష్కరించారు. మొగిలిన 95 కేసులలో చర్యలను ప్రారంభించి, నివేదికలను కోరారు. మొత్తం సంవత్సరంలో, 1,895 పిటిషన్లు అందుకోగా అందులో 1, 422ని ఎన్‌సిఎం పరిష్కరించింది.
జాతీయ మైనారిటీల కమిషన్ 1.12.2022 నుంచి 17.1. 2023 వరకు మొత్తం 15 విచారణలను జరిపి, సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించవలసింది సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేసింది. మొత్తం ఏడాదిలో కమిషన్‌లో 40 విచారణలు నిర్వహించారు.
***
(Release ID: 1892112)
Visitor Counter : 177