ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
వాయు నాణ్యతా పర్యవేక్షణ సిస్టమ్ (AI-AQMS v1.0) కోసం సాంకేతికతను సెక్రటరీ, ఎం ఈ ఐ టీ ప్రారంభించారు
Posted On:
18 JAN 2023 12:23PM by PIB Hyderabad
సెక్రటరీ, ఎం ఈ ఐ టీ శ్రీ అల్కేష్ కుమార్ శర్మ, ఎం ఈ ఐ టీ ప్రోత్సాహక ప్రాజెక్ట్‌ల క్రింద అభివృద్ధి చేసిన వాయు నాణ్యతా పర్యవేక్షణ సిస్టమ్ సాంకేతికతను (AI-AQMS v1.0) నిన్న ఇక్కడ ప్రారంభించారు.
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC), కోల్‌కతా, టెక్స్ మిన్, ఐ ఎస్ ఎం, ధన్‌బాద్‌తో కలిసి 'నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐ సీ టీ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (AgriEnIcs)' కింద ఒక అవుట్‌డోర్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్‌ను పర్యావరణం యొక్క నిరంతర గాలి నాణ్యత విశ్లేషణ కోసం పీ ఎం 1.0, పీ ఎం 2.5, పీ ఎం 10.0, ఎస్ ఓ 2, ఎన్ ఓ 2, సీ ఓ2, పరిసర ఉష్ణోగ్రత, సాపేక్ష ఆర్ద్రత మొదలైన పారామితులను కలిగి ఉన్న పర్యావరణ కాలుష్య కారకాలను పర్యవేక్షించడానికి అభివృద్ధి చేసింది.
ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ (AI-AQMS v1.0), వివిధ గని మరియు సిమెంట్ పరిశ్రమలలో విస్తరణ కోసం అదే సాంకేతికతను మరింత వాణిజ్యీకరించడం కోసం ఎంచుకున్న పరిశ్రమ జే ఎం ఎన్విరోల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కూడా బదిలీ చేయబడింది. టెక్నాలజీ బదిలీ న్యూ ఢిల్లీలోని ఎం ఈ ఐ టీలో జరిగింది, దీనిలో సీనియర్ డైరెక్టర్ & సెంటర్ హెడ్, సీ - డాక్, కోల్‌కతా మరియు డాక్టర్ దీపా తనేజా, సీ ఈ ఓ, జే ఎం ఎన్విరోల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ అల్కేష్ కుమార్ శర్మ, కార్యదర్శి, శ్రీ భువనేష్ కుమార్, అదనపు కార్యదర్శి ఎం ఈ ఐ టీ, శ్రీమతి సునీతా వర్మ, గ్రూప్ కోఆర్డినేటర్, ఎం ఈ ఐ టీ, శ్రీ నవీన్ కుమార్ విద్యార్థి, డైరెక్టర్, డాక్టర్ బసంత కుమార్ దాస్, డైరెక్టర్,, శ్రీ దేబాసిస్ మజుందార్, సీనియర్ డైరెక్టర్ & సెంటర్ హెడ్, సీ - డాక్, కోల్‌కతా, శ్రీ ఓం క్రిషన్ సింగ్, సైంటిస్ట్ , ఎం ఈ ఐ టీ, ఇతర పరిశ్రమ భాగస్వాములు, ప్రాజెక్ట్ టీమ్ సభ్యులు మరియు వివిధ వినియోగదారులు మరియు మంత్రిత్వ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర గౌరవనీయ ప్రముఖుల సమక్షంలో సంతకం చేశారు.
***
(Release ID: 1892083)
Visitor Counter : 219