ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్ అవకాశాలపై రౌండ్ టేబుల్ చర్చలో ప్రసంగించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఔషధాలు, వైద్య పరికరాల లభ్యత,, అందుబాటు, ప్రాప్యత నిర్ధారించడానికి ఇండియన్ లైఫ్ సైన్సెస్ ను ప్రపంచవ్యాప్తంగా పోటీ రంగంగా ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
‘’అత్యాధునిక ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివృద్ధి చేసేందుకు ఫార్మా-మెడ్ టెక్ రంగంలో ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ పై భారత్ సమిష్టి, సమన్వయ చర్యలు తీసుకుంటోంది.’’
‘’ఔషధ ఆవిష్కరణ, వినూత్న వైద్య పరికరాల్లో అగ్రగామిగా ఎదిగేందుకు
ఫార్మా-మెడ్ టెక్ రంగంలో నూతన ఆవిష్కరణలకు అనువైన పర్యావరణ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం
ప్రోత్సహిస్తోంది:
Posted On:
18 JAN 2023 5:07PM by PIB Hyderabad
"దేశీయ ప్రపంచ మార్కెట్లలో మందులు, వైద్య పరికరాల లభ్యత, ప్రాప్యత , అందుబాటును నిర్ధారించడానికి భారతీయ లైఫ్ సైన్సెస్ ను ప్రపంచవ్యాప్తంగా పోటీ రంగంగా ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది".
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో 'ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్ లో అవకాశాలు' అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ చర్చలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు.
తక్కువ ధరకు, అందుబాటులో ఉండే లైఫ్ సైన్సెస్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడం, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో అంతరాలను గుర్తించడం, పరిశోధన - అభివృద్ధిలో విజ్ఞాన మార్పిడి ,ఆవిష్కరణలకు అవకాశాలను విస్తరించడం,లైఫ్ సైన్సెస్ పరిశ్రమ పోటీతత్వాన్ని పెంచడానికి బలమైన ఆర్ అండ్ డి , ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ను సృష్టించడానికి పెట్టుబడి అవకాశాలను గుర్తించడం ఈ సమావేశం ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ వ్యాల్యూ క్యాప్చర్ (6.65 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ లో దాదాపు 40%) పెద్ద వాటా ఇన్నోవేషన్ ఆధారిత ఉత్పత్తుల్లో ఉందని చెప్పారు. ఔషధ పరిశోధన,ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ విలువను అన్ లాక్ చేస్తుంది., భారత ఆర్థిక వ్యవస్థకు పరిశ్రమ సహకారాన్ని (ప్రతి సంవత్సరం ఎగుమతుల్లో అదనంగా 10-12 బిలియన్ డాలర్లు) పెంచుతుంది. ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో భారతదేశ వ్యత్యాసాన్ని పెంచడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణపై పెరిగిన వ్యయం, భారతీయ మధ్యతరగతి పరిమాణం పెరగడం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పట్ల నిబద్ధత ,ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పిఎం-జెఎవై), ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పిఎంబిజెపి) వంటి పథకాలపై శ్రద్ధ ఫార్మా మెడ్ టెక్ రంగాలకు స్థిరమైన డిమాండ్ మార్గాన్ని సృష్టించాయి.
మెరుగైన చికిత్సా ఫలితాలకు డిమాండ్, పర్సనలైజ్డ్ డయాగ్నోస్టిక్స్, ఇన్-హోమ్ ట్రీట్మెంట్, వేరబుల్స్, టెలిమెడిసిన్ మొదలైన వాటికి డిమాండ్ విభిన్న ఉత్పత్తులు , సేవా ఆఫర్లకు అవకాశం కల్పించింది
ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఫార్మా-మెడ్ టెక్ రంగాలు తమ సౌలభ్య జోన్ నుంచి బయటకు వచ్చి తమ వ్యాపార వ్యూహాల్లో సృజనాత్మకతను చోదక లక్షణంగా స్వీకరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి కోరారు. భారతదేశం ఇప్పుడు అంతర్జాతీయ పోటీ రంగాన్ని ఎదుర్కోవడానికి ,అధిక-పరిమాణం నుండి అధిక-విలువ ఉత్పత్తులకు మారడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఫార్మా-మెడ్ టెక్ రంగంలో ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ పై భారత్ సమిష్టిగా, సమన్వయంతో కృషి చేస్తూ అత్యాధునిక ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా అభివృద్ధి చేయడంతోపాటు ఔషధ ఆవిష్కరణ, సృజనాత్మక వైద్య పరికరాల్లో అగ్రగామిగా నిలిచేందుకు ఈ రంగంలో ఆవిష్కరణలకు అనువైన పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తోంది.
ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మూడు ప్రధాన రంగాలపై దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు.
*ప్రొడక్ట్ డెవలప్ మెంట్ లో ఇన్నోవేషన్, రీసెర్చ్ ను సులభతరం చేయడానికి రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ను బలోపేతం చేయడం. రెగ్యులేటరీ నిబంధనల్లో మార్పులతో ఈ విషయంలో గ్లోబల్ హార్మోనైజేషన్ ను నెలకొల్పే దిశగా భారత రెగ్యులేటర్లు కసరత్తు చేస్తున్నాయి.
*ఆర్థిక ,ఆర్థికేతర చర్యల సమ్మిళితం ద్వారా సృజనాత్మకతలో పెట్టుబడులను ప్రోత్సహించడం, తద్వారా లాభదాయక ఫైనాన్సింగ్ ఎంపికలతో రిస్క్ లను సరిపోల్చడం. ఆర్ అండ్ డీ ఇన్నోవేషన్ లో పెట్టుబడులకు మద్దతు ఇచ్చే పథకాలు, ఆర్ అండ్ డీ వ్యయాన్ని రీయింబర్స్ చేయడం, ఆర్ అండ్ డీని ప్రోత్సహించేందుకు తగిన ఆర్థిక ప్రోత్సాహకాల రూపకల్పన వంటి ఇన్నోవేషన్ లకు నిధుల మద్దతును సులభతరం చేసే పలు చర్యలను పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
*పరిశోధన ,అభివృద్ధి ,ఆవిష్కరణ రంగంలో సుస్థిర వృద్ధికి బలమైన సంస్థాగత యంత్రాంగంగా సృజనాత్మకత, క్రాస్-సెక్టోరల్ పరిశోధనకు మద్దతు ఇవ్వడానికి ఫెసిలిటేటరీ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం.
సంప్రదాయ ఔషధాలు, ఫైటో ఫార్మాస్యూటికల్స్ ను ప్రధాన స్రవంతి ప్రజా సంభాషణ, ఆచరణలో సమ్మిళితం చేయడానికి ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రయత్నాలను డాక్టర్ మాండవీయవివరించారు. ఈ విభాగంలో వృద్ధి సరళి ఉపాధి, రైతు సమాజం, పరిశ్రమలు, విద్యారంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా వైద్య పరికరాల రంగానికి ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, బయో ఫార్మాస్యూటికల్స్ రంగం 5 సంవత్సరాల కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సిఎజిఆర్) ను 50% అందించిందని ఆయన చెప్పారు.
ఆత్మనిర్భర్ భారత్ అంటే 'స్వావలంబన భారత్' కోసం గౌరవన ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపును కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు భారతదేశం తన పరిశోధన ,అభివృద్ధి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఫార్మాస్యూటికల్స్ ,వైద్య పరికరాలలో స్వావలంబనను సాధించగలదని, ఇది ప్రాణాలను రక్షించే మందులు ,ఔషధాల ప్రాప్యతను విస్తరించడానికి దోహదపడుతుందని, భారతదేశం గ్లోబల్ ఫార్మాస్యూటికల్స్ ,వైద్య పరికరాల ఎగుమతుల కేంద్రంగా మారడానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు.
ఫార్మా-మెడ్ టెక్ పరిశ్రమలు తమ వ్యాపార వ్యూహాలకు చోదక లక్షణంగా సృజనాత్మకతను స్వీకరించాలని డాక్టర్ మాండవీయ సూచించారు. "భారతదేశం ఇప్పుడు ప్రపంచ పోటీ రంగాన్ని స్వీకరించడానికి ,అధిక-వాల్యూమ్ నుండి అధిక-విలువ ఉత్పత్తులకు మారడానికి సిద్ధంగా ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
****
(Release ID: 1892082)
Visitor Counter : 223