శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఆరోగ్యం, వ్యవసాయం, పారిశ్రామిక సాంకేతికత, ఐటీ, మొబిలిటీ మరియు విద్య రంగాలలో వినూత్న సాంకేతిక ఉత్పత్తులు మరియు 300 డీప్ టెక్ సాంకేతికతల విజయగాథలను భోపాల్‌లోని ఐఐఎస్‌ఎఫ్‌లో ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.


న్యూఢిల్లీలో ఆరు సైన్స్ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల సంయుక్త అధ్వర్యంలో 2023 జనవరి 21 నుండి 24 వరకు నిర్వహించనున్న ఐ ఐ ఎఫ్ ఎస్ సమావేశ సన్నద్ధతను మంత్రి సమీక్షించారు.

భోపాల్‌లోని స్టార్ట్-అప్ కాన్‌క్లేవ్‌లో ఇంక్యుబేషన్ సేవలను అందించే ఎనేబుల్స్ స్టార్ట్-అప్ ఏర్పాటు కోసం అందించే మౌలిక సదుపాయాలు మార్గదర్శకాలను పంచుకుంటారు, మరియూ ప్రదర్శనలు ఉంటాయి.

Posted On: 18 JAN 2023 5:58PM by PIB Hyderabad

భోపాల్‌లో జరగబోయే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్‌ఎఫ్)-2022 స్టార్టప్ సదస్సు లో వినూత్న సాంకేతిక ఉత్పత్తులు మరియు ఆరోగ్యం, వ్యవసాయం, పారిశ్రామిక సాంకేతికత, IT, మొబిలిటీ మరియు విద్య రంగాలలో  300 డీప్‌టెక్ సాంకేతికతల విజయగాథలను ప్రదర్శిస్తామని పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్,  సైన్స్ & టెక్నాలజీ; అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్, ఎర్త్ సైన్సెస్ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 

 

సైన్స్ & టెక్నాలజీ, బయోటెక్నాలజీ, సీ ఎస్ ఐ ఆర్, ఎర్త్ సైన్సెస్, స్పేస్ మరియు అటామిక్ ఎనర్జీతో సహా ఆరు సైన్స్ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల సంయుక్త సమావేశంలో, డాక్టర్ జితేంద్ర సింగ్ 2023 జనవరి 21 నుండి 24 వరకు ఐ ఐ ఎఫ్ ఎస్ భోపాల్ సదస్సు ఏర్పాట్ల  సన్నద్ధతను సమీక్షించారు, సమగ్ర స్టార్టప్‌లు మరియు సమగ్ర పరిశోధన అభివృద్ధి గురించి నొక్కి చెప్పారు. 

 

2015లో ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి, స్టార్ట్-అప్ ఇండియా స్టాండ్-అప్ ఇండియా నినాదాన్ని అందించినప్పటి నుంచి భారతదేశంలో స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ ఊపందుకున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దృష్టి గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.2014లో 350  స్టార్టప్‌లు ఉండగా, ఆగస్టు, 2022లో ఈ సంఖ్య 75,000కి పెరిగిందని, కేవలం కొన్ని నెలల్లోనే దేశంలోని 653 జిల్లాల్లో స్టార్టప్‌ల సంఖ్య 75,000 నుంచి 88,000కి పెరిగిందని ఆయన చెప్పారు. స్టార్టప్‌ రంగం తొమ్మిది లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలను సృష్టించిందని ఆయన తెలిపారు

 

భారతదేశం కూడా 107 యునికార్న్‌లు ఉన్నాయని (స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిపోకుండానే $1 బిలియన్ల వాల్యుయేషన్‌ను చేరుకునే కంపెనీలు) వాటిలో 23, 2022లోనే ఉద్భవించాయని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ డేటా ప్రకారం, నవంబర్ 2022 వరకు, అమెరికా లో 704 యునికార్న్‌లతో ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్-అప్ పరిశ్రమలో అగ్రగామిగా ఉందని, 243 యునికార్న్‌లను కలిగి ఉన్న చైనా తర్వాతి స్థానంలో ఉందని మరియు భారతదేశం చాలా వేగంగా ముందుకు దూసుకుపోతోందని ఆయన అన్నారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, భోపాల్‌లోని స్టార్ట్-అప్ సదస్సు లో అంకుర సేవలు మరియు భాగస్వామ్య మౌలిక సదుపాయాలను అందించే ఎనేబుల్‌ల ప్రదర్శనలు ఉంటాయి. సహా అధ్యయనం, నెట్‌వర్కింగ్ మరియు ఉత్తమ విధానాల బదిలీ  కోసం స్టార్టప్‌లు, ఎనేబుల్ చేసేవారు మరియు లబ్ధిదారుల మధ్య చర్చలు జరుగుతాయి. స్టార్టప్‌ను ఏర్పాటు చేయడం మరియు స్టార్ట్-అప్ ఇండియా కింద అవకాశాలను పొందడంపై మార్గదర్శకత్వం కూడా వేదిక వద్ద అందించబడుతుంది.

 

డా. కృష్ణ ఎల్లా, సీ ఎం డీ, భారత్ బయోటెక్, డాక్టర్ అర్చన శర్మ, సీ ఈ ఆర్ ఎన్, జెనీవా, శ్రీ ఎస్. సోమనాథ్, ఇస్రో ఛైర్మన్, ఆనంద్ దేశ్‌పాండే, ఫౌండర్ & సీ ఎం డీ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ప్రొఫెసర్. ఏ. పీ. డిమ్రీ, డైరెక్టర్, డీ ఎస్ టీ- ఐ ఐ జీ, డాక్టర్ అనిల్ భరద్వాజ్, డైరెక్టర్, పీ ఆర్ ఎల్, ప్రొఫెసర్. అమితవపాత్ర, డైరెక్టర్, ఐ ఎన్ ఎస్ టీ మొహాలీ, ప్రొఫెసర్. తపస్ చక్రవర్తి, డైరెక్టర్ ఐ ఏ సీ ఎస్ వంటి ముఖ్యమైన ప్రధాన వక్తలు మరియు నిపుణులు ఐ ఐ ఎస్ ఎఫ్ భోపాల్‌లో పాల్గొంటున్నారు.

 

సైన్స్‌లో కొత్త సరిహద్దులతో ముఖాముఖి అనే అంశంపై చర్చ ఎస్ అండ్ టీ యొక్క వివిధ విభాగాలలో అత్యుత్తమ వ్యక్తులతో విద్యార్థులు/పరిశోధకుల సహృదయ పరస్పర అవగాహన మరియు చిన్న చర్చ-ఆధారిత సెషన్‌లకు వేదిక అవుతుంది. ఇది విద్యార్థులను అతని/ఆమె కెరీర్‌లో సైన్స్ మరియు పరిశోధనలను కొనసాగించడానికి ఖచ్చితంగా స్ఫూర్తినిస్తుంది.

 

“సైన్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా ఆత్మనిర్భర్ భారత్‌ను శక్తివంతం చేయడం” అనే సెషన్‌కు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా నాయకత్వం వహిస్తారు. ఆనంద్ దేశ్‌పాండే, వ్యవస్థాపకుడు & సీఎండీ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ “డేటా సైన్స్‌లో సాంకేతిక పురోగతి మరియు డిజిటల్ పరివర్తనలో భారతదేశ నాయకత్వం” అనే అంశంపై సెషన్‌కు అధ్యక్షత వహిస్తారు.

 

డాక్టర్ అర్చన శర్మ, సీ ఈ ఆర్ ఎన్, జెనీవా "విశ్వంలోని రహస్యాలను ఛేదించడం లో శాస్త్రవేత్త యొక్క ప్రయాణం" అనే అంశంపై ప్రధాన వక్తగా వ్యవహరిస్తారు, ఇస్రో ఛైర్మన్ "అంతరిక్షంలో సాంకేతిక పురోగతితో అమృత్ కాల్ వైపు కవాతు" అనే సెషన్‌కు అధ్యక్షత వహిస్తారు.

 

జనవరి 22 నుంచి జనవరి 24 వరకు యువ శాస్త్రవేత్తల సదస్సు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఫ్యాకల్టీలు మరియు జాతీయ ప్రయోగశాలలు, విద్యాసంస్థలు మరియు సైంటిఫిక్ ఇండస్ట్రీ సోదరుల నుండి సైన్స్ ఇన్నోవేటర్ల కోసం ఉద్దేశించబడింది. యంగ్ సైంటిస్ట్ కాన్ఫరెన్స్ కోసం  సైన్స్ రీసెర్చ్ యొక్క సరిహద్దు దాటి ముందుకు, మహమ్మారి సవాళ్లు, వ్యాక్సిన్ డెవలప్‌మెంట్‌ ప్రభావాలు మరియు పరిశోధనలు, నీటి వనరులు, పరిరక్షణ, రీసైక్లింగ్ మరియు శుద్దీకరణ, జీవవైవిధ్యం, పర్యావరణం & వాతావరణ మార్పు, స్వయం-ప్రగతి భారతదేశం కోసం ఆహారం మరియు శక్తి భద్రత  అంశాలు ఎంపిక చేశారు.

 

న్యూ ఏజ్ టెక్నాలజీస్ షో (22-24 జనవరి) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, డిజిటల్ కరెన్సీ ఇండస్ట్రీ, 4.0, 5G/6G, క్వాంటం కంప్యూటింగ్, సెమికండక్టర్ టెక్నాలజీస్, గ్రీన్ ఎనర్జీస్, స్పేస్ టెక్నాలజీస్, సెన్సార్ టెక్నాలజీస్, సిస్టమ్స్ మరియు సింథటిక్ బయాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 

 

ఎన్ ఎ టీ ఎస్ ఎగ్జిబిషన్/ ఇన్నోవేషన్ షోకేస్ [100] ఉంటుంది, ఇక్కడ విద్యార్థులు వివిధ అత్యాధునిక రంగాలలో ఇంజనీరింగ్ నమూనాలు మరియు ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.

 

ఈ సమావేశానికి భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, సెక్రటరీ, డీ ఎస్ టీ, సెక్రటరీ, డీ ఓ స్పేస్, సెక్రటరీ, ఎం ఓ ఎర్త్ సైన్సెస్, సెక్రటరీ, డీ ఓ బయోటెక్నాలజీ, సెక్రటరీ, డీ ఎస్ ఐ ఆర్ విభాగాల  ప్రతినిధులు మరియు ఇతర  సీనియర్ సైన్స్ అధికారులు పాల్గొన్నారు. 

***



(Release ID: 1892080) Visitor Counter : 171