మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
విద్య & నైపుణ్యాభివృద్ధి రంగాల్లో బలమైన బంధాలతో భారత్-సింగపూర్ సహజ మిత్రదేశాలు - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ ప్రతినిధి బృందంతో సమావేశమైన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
प्रविष्टि तिथि:
18 JAN 2023 4:36PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
- ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకురావడం, యువపారిశ్రామికత్వాన్ని ప్రోత్సహించడం, యువతకు అవకాశాలను సృష్టించడంపై దృష్టి సారించేలా విద్యారంగంలో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి
సింగపూర్ హైకమిషన్ ఫస్ట్ సెక్రటరీ శ్రీ అమండా క్వెక్ నేతృత్వంలో వచ్చిన సింగపూర్ నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ప్రతినిధి బృందంతో కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ సమావేశమయ్యారు. ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకురావడం, యువపారిశ్రామికత్వాన్ని ప్రోత్సహించడం, యువతకు అవకాశాలను సృష్టించడంపై దృష్టి సారించేలా విద్యారంగంలో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు.
విద్య & నైపుణ్యాభివృద్ధి రంగాల్లో బలమైన బంధాలతో భారత్-సింగపూర్ సహజ మిత్రదేశాలు ఈ సమావేశంలో శ్రీ ప్రధాన్ చెప్పారు. విద్యాసంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో సింగపూర్‌తో మిత్రత్వాన్ని పెంపొందించుకోవడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.


****
(रिलीज़ आईडी: 1892075)
आगंतुक पटल : 207