ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ 19 - అపోహలు - వాస్తవాలు
'కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కలుగుతున్న బహుళ దుష్ప్రభావాల వల్ల ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఐసీఎమ్ఆర్,సీడీఎస్సీఓ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవ విరుద్ధంగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలను మాత్రమే ఐసీఎమ్ఆర్,సీడీఎస్సీఓ వర్గాలు తెలిపాయి
Posted On:
17 JAN 2023 2:48PM by PIB Hyderabad
ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇస్తూ 'కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కలుగుతున్న బహుళ దుష్ప్రభావాల వల్ల ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఐసీఎమ్ఆర్ (భారత వైద్య పరిశోధన మండలి),సీడీఎస్సీఓ (కేంద్ర ఔషధాలు,నిబంధనల నియంత్రణ సంస్థ ) అంగీకరించినట్టు ఇటీవల ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ఐసీఎమ్ఆర్,సీడీఎస్సీఓ వర్గాలు అన్ని కోవిడ్ వ్యాక్సిన్‌ల నుండి ఉత్పన్నమయ్యే అనేక పరిణామాలను వివరించినట్టు కథనం పేర్కొంది. అయితే, ఈ వార్తాకథనం తప్పుడు సమాచారంతో కూడినదని, తప్పుడు సమాచారం అందించే విధంగా ఉంది.
పబ్లిక్ డొమైన్‌లో పొందుపరిచిన అంతర్జాతీయ శాస్త్రీయ సాక్ష్యాలను బహిర్గతం చేయాలన్న కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా ఆర్టీఐ నెంబర్ R/X/22/00075లోని 4, 5 ప్రశ్నలకు ఐసీఎమ్ఆర్ సమాధానం అందించింది. దీనిలో వ్యాక్సిన్‌ల ప్రయోజనాలు, కలిగే ప్రతికూల అంశాలను ఐసీఎమ్ఆర్ వివరించింది. తన సమాధానంలో ఐసీఎమ్ఆర్ వివిధ కోవిడ్ 19 వ్యాక్సిన్‌లపై ప్రపంచవ్యాప్తంగా సేకరించిన సమాచారం పొందుపరిచిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ ), సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ), కేంద్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ల లింక్‌లను అందించింది.
అన్ని ఇతర వ్యాక్సిన్‌ల మాదిరిగానే వివిధ కోవిడ్-19 వ్యాక్సిన్‌లతో టీకాలు వేయించుకున్నవారిలో టీకా వేసిన ప్రాంతంలో నొప్పి తో పాటు తలనొప్పి, అలసట, కండరాల నొప్పి , అస్వస్థత, జ్వరం, చలి, కీళ్ల నొప్పులు వంటి తేలికపాటి లక్షణాలు కనిపించవచ్చు. అరుదుగా, కొంతమంది వ్యక్తులు తీవ్ర లక్షణాలతో బాధపడవచ్చు. కొన్ని పరిస్థితులపై ఆధారపడి ప్రతికూల పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. .
ఆసుపత్రిలో చేరడం, మరణాలను తగ్గించడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించే అంశంలో కోవిడ్-19 టీకా సహాయపడిందని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాలు వెల్లడించాయి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలతో పోల్చి చూస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో ఉపయోగిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్‌ల వల్ల ప్రయోజనాలు, దుష్ప్రభావాలను ఎన్ టిఏజిఐ(నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్)ఎప్పటికప్పుడు సమీక్షించి పై ఫలితాలను ధ్రువీకరించింది.
అదనంగా, జాతీయ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆమోదించిన కోవిడ్ వ్యాక్సిన్‌ల జాబితా వెబ్‌సైట్‌లో (cdsco.gov.in) అందుబాటులో ఉందని సీడీఎస్సీఓ తన ఆర్టీఐ ప్రత్యుత్తరంలో భాగంగా పేర్కొంది. దీనికి సంబంధించి తమ వద్ద ఇతర సమాచారం లేదని సీడీఎస్సీఓ స్పష్టం చేసింది.
వాస్తవ అంశాలను గమనిస్తే ఐసీఎమ్ఆర్ తన సమాధానం లో అందించిన పత్రాలు, లింకులపై ఐసీఎమ్ఆర్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం అవుతోంది.
***
(Release ID: 1891821)
Visitor Counter : 367