సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పని చేస్తున్నమహిళలకు స్వాంతన కలిగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పాలన సంస్కరణలు .... కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
మహిళా అధికారులు మరియు సిబ్బంది సంక్షేమం కోసం గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా సిబ్బంది వ్యవహారాలు, పర్సనల్, పీజీ పెన్షన్ల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రత్యేక మహిళా-కేంద్రీకృత చర్యలు వివరించిన మంత్రి
Posted On:
17 JAN 2023 12:59PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పాలన సంస్కరణలు పని చేస్తున్నమహిళలకు స్వాంతన కలిగిస్తున్నాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల మహిళా ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కలిగాయని అన్నారు. మహిళా సిబ్బంది కోసం సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న వివిధ చర్యలను డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు వివరించారు. కార్యక్రమాలు అమలు చేసేందుకు నోడల్ మంత్రిత్వ శాఖ వ్యవహరిస్తున్నదని మంత్రి తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళల సంఖ్యను ఎక్కువ చేయడానికి, పనిచేస్తున్న మహిళలకు వృత్తి కుటుంబ వ్యవహారాలు సమానంగా చూసుకునే వీలు కల్పించేందుకు డిఓపిటి కృషి చేస్తున్నాదన్నారు.
మహిళా ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలకు ఉదాహరణ చైల్డ్ కేర్ లీవ్ (సీసీఎల్ ) అని మంత్రి అన్నారు. మహిళా ఉద్యోగులకు 730 రోజుల సీసీఎల్ మంజూరు చేయడంతో పాటు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి వివరించారు.సీసీఎల్ లో ఉన్న ఉద్యోగిని సంబంధిత అధికారి నుంచి ముందుగా అనుమతి పొంది ముందుగానే కార్యాలయాన్ని వదిలి వెళ్ళే వెసులుబాటు కల్పించామన్నారు. సీసీఎల్ లో ఉన్నవారు సంబంధిత అధికారి నుంచి ముందస్తు అనుమతి పొంది సెలవు ప్రయాణ రాయితీ (ఎల్టీసీ ) సౌకర్యం కూడా పొందవచ్చు, సీసీఎల్ లో ఉన్న సిబ్బంది సంబంధిత అధీకృత అధికారుల నుంచి అనుమతులు పొంది విదేశీ ప్రయాణాలపై కూడా కొనసాగవచ్చు. అంతేకాకుండా, నియమం 43-C నిబంధనల ప్రకారం సీసీఎల్ పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగి ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సీసీఎల్ కనీస వ్యవధి 15 రోజుల నుంచి 5 రోజులకు ప్రభుత్వం తగ్గించింది అని మంత్రి వివరించారు. వికలాంగ పిల్లల విషయంలో 22 సంవత్సరాల పరిమితిని తగ్గించమని మంత్రి తెలిపారు.
అంగ వైకల్యం కలిగి ఉన్న మహిళా ఉద్యోగులకు 2022 జూలై 01 నుంచి నెలకు పిల్లల సంరక్షణ కోసం 3,000 రూపాయల చొప్పున ప్రత్యేక భత్యం మంజూరు చేస్తున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఇది డీఏ 50% పెంపుతో 25% పెరుగుతుంది.
లైంగిక వేధింపులకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న బాధిత మహిళా ప్రభుత్వోద్యోగి 90 రోజుల వరకు ప్రత్యేక సెలవు పొందే సదుపాయం కల్పించామని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో మంజూరు చేసే ఈ 90 రోజుల ప్రత్యేక సెలవులు బాధిత మహిళా ప్రభుత్వోద్యోగి సెలవు ఖాతా నుంచి మినహాయించరని స్పష్టం చేశారు.
గర్భంలోనే శిశువు చనిపోవడం లేదా జన్మించిన వెంటనే బిడ్డ చనిపోవడం వల్ల తల్లి జీవితంపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం శిశు మరణాల వల్ల మహిళలకు కలిగే మానసిక గాయాన్ని దృష్టిలో ఉంచుకుని పుట్టిన వెంటనే / చనిపోయిన వెంటనే బిడ్డ మరణించిన సందర్భంలో మహిళా ఉద్యోగికి 60 మంది ప్రత్యేక ప్రసూతి సెలవు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
కోవిడ్ సమయంలో కూడా మహిళా అధికారులు మరియు సిబ్బందికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వివిధ కార్యాలయం మెమోల ద్వారా రోస్టర్ / తప్పనిసరి హాజరు విధానాల నుంచి మినహాయింపు ఇచ్చామని ,గర్భిణులకు ఇంటి నుంచి పనిచేసే సౌకర్యం కల్పించామని అన్నారు.
పింఛనులు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖలో మహిళా-కేంద్రీకృత సంస్కరణలను వివరించిన డాక్టర్ జితేంద్ర సింగ్ ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులను ప్రస్తావించారు. దీని ప్రకారం విడాకుల కోసం తల్లిదండ్రుల మరణం ముందు దరఖాస్తు చేసి తల్లిదండ్రుల మరణం తర్వాత డిక్రీ జారీ అయిన సందర్భంలో సదరు మహిళ కుటుంబ పెన్షన్ పొందడానికి అర్హత పొందుతుంది. అదేవిధంగా,ఎన్పీఎస్ ప్రకారం ఆచూకీ లభించని ఉద్యోగుల కుటుంబాలు ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 6 నెలల లోపు కుటుంబ పెన్షన్ పొందడానికి అర్హత కలిగి ఉంటారు. 7 సంవత్సరాల వరకు వేచి చూసి ఉద్యోగి మరణించాడన్న నిర్ణయం తీసుకోవడానికి ప్రస్తుతం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు అని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 7 సంవత్సరాల సర్వీసు పూర్తి కాకముందే ప్రభుత్వోద్యోగి మరణించిన సందర్భంలో కూడా మొదటి 10 సంవత్సరాలకు చివరి వేతనంలో 50% మరియు ఆ తర్వాత చివరి వేతనంలో @ 30% చొప్పున కుటుంబ పెన్షన్‌ను పెంచాలని కూడా నిర్ణయించామని మంత్రి తెలిపారు.
***
(Release ID: 1891779)
Visitor Counter : 184