ఉక్కు మంత్రిత్వ శాఖ
ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం బ్లాస్ట్ ఫర్నేస్ -1లో రికార్డు స్థాయిలో రోజువారీ ఉత్పత్తి నమోదు కర్మాగారం ప్రారంభమైన తర్వాత రికార్డు ఉత్పత్తి
Posted On:
16 JAN 2023 4:42PM by PIB Hyderabad
ద్రవ రూప ఉక్కు రోజువారీ ఉత్పత్తిలో ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం బ్లాస్ట్ ఫర్నేస్ -1 సరికొత్త రికార్డు నమోదు చేసింది. సంక్రాంతి పండుగ వేళ సిబ్బంది పట్టుదలతో పనిచేసి రికార్డు సాధించారు. ఒకే రోజున బ్లాస్ట్ ఫర్నేస్-1 (గోదావరి)లో 8100 టన్నుల ద్రవ రూప ఉక్కు ఉత్పత్తి కావడం ఇదే తొలిసారి. 2023 జనవరి 15న ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఈ రికార్డు సాధించి చరిత్ర సృష్టించింది. 2022 ఫిబ్రవరి 18న బ్లాస్ట్ ఫర్నేస్-1లో ఉత్పత్తి అయిన 8019 టన్నుల ద్రవ రూప ఉక్కు ఇంతవరకు ఉత్తమ రికార్డుగా ఉంది. ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత అత్యధికంగా ఉత్పత్తి సాధించి 2022 ఫిబ్రవరి 18న నెలకొల్పిన రికార్డును ఆర్ఐఎన్ఎల్ 2023 జనవరి 15న అధిగమించింది.
సమిష్టిగా పని చేసి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించిన సిబ్బందిని ఆర్ఐఎన్ఎల్ సీఎండీ శ్రీ అతుల్ భట్ అభినందించారు.
***
(Release ID: 1891609)
Visitor Counter : 192