రక్షణ మంత్రిత్వ శాఖ
ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చండీనగర్‌లోని గరుడ్ రెజిమెంటల్ శిక్షణా కేంద్రంలో మెరూన్ బెరెట్ ప్రత్యేక కవాతు
Posted On:
14 JAN 2023 3:33PM by PIB Hyderabad
ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఫోర్సెస్ గరుడ్ కమెండోలు విజయవంతంగా తమ శిక్షణను పూర్తి చేసుకున్న సందర్భంగా 14 జనవరి 2023న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చండీనగర్‌లోని గరుడ్ రెజిమెంటల్ శిక్షణా కేంద్రం(జిఆర్‌టిసి) లో మెరూన్ బెరెట్ సెర్మోనియల్ పెరేడ్ (ప్రత్యేక కవాతు)ను నిర్వహించారు. పెరేడ్ కోసం ఏర్పాట్లను ఎయిర్ మార్షల్ సూరత్ సింగ్ ఎవిఎస్ఎం, విఎం, విఎస్ఎం సమీక్షించారు.
విజయవంతంగా శిక్షణను పూర్తి చేసుకున్నందుకు గరుడ్‌లకు సమీక్షాధికారి అభినందనలు తెలిపారు.
మారుతున్న భద్రతా దృశ్యానికి అనుగుణంగా కఠినమైన శిక్షణ, ప్రత్యేక దళాల నైపుణ్యాలను మెరుగుపరచవలసిన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. విజయవంతమైన గరుడ్ ట్రైనీలకు ఆయన మెరూన్ బెరెట్‌ను, గరుడ్ ప్రొఫిషియన్సీ బాడ్జ్‌ను, స్పెషల్ ఫోర్సెస్ టాబ్స్‌ను అందచేయడమే కాక, విశిష్ట ట్రైనీలకు ట్రోఫీలను అందించారు. ఉత్తమ ఆల్ రౌండర్ ట్రోఫీని ఎసి విక్రమ్ దావర్‌కు అందించారు.
వేడుకలో భాగంగా, గరుడ్‌లు తమ కంబాట్ ఫైరింగ్ స్కిల్ (యుద్ధ కాల్పుల నైపుణ్యాలను), బందీలను కాపాడడం, ఫైరింగ్ డ్రిల్, అసాల్ట్ ఎక్స్‌ప్లోజివ్స్ (దాడికి పేలుడు పదార్ధాలు), అడ్డంకులను దాటే డ్రిల్, గోడలను ఎక్కడం, పాకడం, రాపెల్లింగ్ (తాడుసాయంతో ఎత్తుల నుంచి దిగడం), సైనిక యుద్ధ కళలను ప్రదర్శించారు.
అత్యంత కఠినమైన శిక్షణా షెడ్యూల్ ముగింపును సూచించే ముఖ్యమైన కార్యక్రమం మెరూన్ బెరెట్ సెర్మోనియల్ పెరేడ్. కొత్తగా ఉత్తీర్ణులైన ట్రైనీలు ఎలీట్ గరుడ్ ఫోర్స్‌లో ప్రవేశించి, ఐఎఎఫ్ కార్యాచరణ సామర్ధ్యానికి మరింత బలాన్ని అందిస్తారు.
***
(Release ID: 1891429)
Visitor Counter : 141