శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారత జియోస్పేషియల్ రంగంలో ఆవిష్కరణలు, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి "జియోస్పేషియల్ హ్యాకథాన్” ప్రారంభించిన మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 14 JAN 2023 3:21PM by PIB Hyderabad

2023 మార్చి10 వరకు జరగనున్న "జియోస్పేషియల్ హ్యాకథాన్"..  రెండు విభాగాల్లో నాలుగు విజేతల ఎంపిక కోసం  రీసెర్చ్ ఛాలెంజ్ మరియు స్టార్ట్-అప్ ఛాలెంజ్ జియోస్పేషియల్ సెలెక్ట్ ప్రాబ్లమ్ కోసం   హ్యాకథాన్ ఛాలెంజ్‌ నిర్వహణ

నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటవుతున్న అంకుర సంస్థలు భారతదేశ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు కీలకం: డాక్టర్ జితేంద్ర సింగ్

 

ప్రభుత్వం, పరిశ్రమలు మరియు శాస్త్రీయ రంగాల   మధ్య ఆరోగ్యకరమైన సమన్వయం ఆర్థిక ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుంది.. డాక్టర్ జితేంద్ర సింగ్  

 2030 నాటికి భారతదేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడానికి సహకారం .. డాక్టర్ జితేంద్ర సింగ్ 

హైదరాబాద్, జనవరి 14:

భారతదేశ ఆర్థిక పురోగతికి నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటవుతున్న అంకుర సంస్థలు తోడ్పడతాయని కేంద్ర రాష్ట్ర మంత్రి శాస్త్ర, సాంకేతిక, భూ శాస్త్ర, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్, ప్రజా ఫిర్యాదులు, అణుశాస్త్రం, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ ( స్వతంత్ర బాధ్యత)  డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. "జియోస్పేషియల్ హ్యాకథాన్"ను డాక్టర్ జితేంద్ర సింగ్  ఈ రోజు ఉదయం ప్రారంభించారు. "జియోస్పేషియల్ హ్యాకథాన్" ప్రారంభించిన అనంతరం మాట్లాడిన డాక్టర్ జితేంద్ర సింగ్  భారతదేశ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు అంకుర సంస్థలు కీలకమని అన్నారు.

   జియోస్పేషియల్ రంగంలో ఆవిష్కరణలు, అంకుర సంస్థలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో హ్యాకథాన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని  దేశ భౌగోళిక ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు.

 

దేశ  జనాభాలో సగం మంది 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉన్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ వయస్సు లో ఉన్నవారు అనేక  ఆకాంక్షలు కలిగి ఉంటారని అన్నారు.  2022లో యునికార్న్ క్లబ్‌లో 100వ భారతీయ స్టార్ట్-అప్‌ను జోడించి భారతీయ స్టార్ట్-అప్ రంగం ఆర్థిక వ్యవస్థ ఒక ప్రధాన మైలురాయిని దాటిందని అన్నారు. 

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత కు అనుగుణంగా  భౌగోళిక విప్లవం దిశగా  భారతదేశం దూసుకుపోతోంది అని మంత్రి అన్నారు.  ప్రభుత్వం, పరిశ్రమలు మరియు శాస్త్రీయ రంగాల  మధ్య సమన్వయం దేశ ఆర్థిక పురోగతికి సహకరిస్తుందని అన్నారు. ఈ అభివృద్ధి 2030 నాటికి  భారతదేశ ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లుగా మారడానికి సహాయపడుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

 

జియోస్పేషియల్ హ్యాకథాన్‌  కార్యక్రమాన్ని రూపొందించి నిర్వహించిన కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఐఐటీ హైదరాబాద్ మరియు మైక్రోసాఫ్ట్ ఇండియా,  సర్వే ఆఫ్ ఇండియా లను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు.భారతదేశ జియోస్పేషియల్ వ్యూహం, విధాన రూపకల్పనకు జియోస్పేషియల్ హ్యాకథాన్‌  ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. రాబోయే కాలంలో భౌగోళిక రంగంలో భారతదేశం స్వావలంబన సాధించడానికి జియోస్పేషియల్ హ్యాకథాన్‌ ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశం అంతటా వివిధ పేర్లు మరియు ఆచారాల తో జరుపుకునే పవిత్రమైన మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్న భాగస్వామ్య సంస్థలు,  విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు మరియు నిపుణులను  ఆయన అభినందించారు.

ప్రభుత్వ మరియు ప్రైవేట్ భౌగోళిక రంగాల మధ్య భాగస్వామ్యాన్నిప్రోత్సహించి  దేశ జియోస్పేషియల్ స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా  హ్యాకథాన్ జరుగుతుంది  అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 సాధించడానికి సమర్థవంతమైన విధాన అభివృద్ధి, ప్రణాళిక, సమర్థంగా అమలు చేసి  విశ్వసనీయమైన జియోస్పేషియల్ సమాచారాన్ని  కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

2020లో అంతరిక్ష రంగంలో  ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో  జియోస్పేషియల్ సెక్టార్‌ను సరళీకరించడానికి, ప్రజాస్వామ్యీకరించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. జాతీయ జియోస్పేషియల్ విధానాన్ని  ప్రారంభించడంతో భారతదేశం మొత్తం భౌగోళిక రంగంలో వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించే మార్గంలో నడుస్తుంది అని అన్నారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పోటీని తట్టుకునే విధంగా భారతదేశ జియోస్పేషియల్ రంగం అభివృద్ధి చెందుతుందని  డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

ఐక్యరాజ్యసమితి వరల్డ్ జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ 2022 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపిన సందేశాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. “భౌగోళిక సాంకేతిక దేశం అంతటా ఎవరినీ వదలకుండా కలుపుకుపోయే విధంగా పని చేస్తోంది” అని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారని మంత్రి తెలిపారు. 

  క్లౌడ్, ఓపెన్ ఏపిఐ లు, డ్రోన్ ఆధారిత మ్యాపింగ్, షేరింగ్ మరియు ఇంటిగ్రేషన్ వంటి ఆధునిక జియోస్పేషియల్ సాంకేతిక అంశాల అభివృద్ధి కోసం సర్వే ఆఫ్ ఇండియా  డేటా ప్రాసెసింగ్, పరిష్కార మార్గాల అన్వేషణ, సర్వీసింగ్ ఛాలెంజ్‌ని ప్రతిపాదించింది. దీని ద్వారా ఎంపిక చేసిన సంస్థలను సమస్య పరిష్కారం కోసం సంస్థలను ఎంపిక చేస్తారు. 

 

“జియోస్పేషియల్ హ్యాకథాన్” 2023 మార్చి 10 వరకు జరుగుతుంది.  జియోస్పేషియల్ రంగంలో ఎంపిక చేసిన సమస్యల పరిష్కారం సూచించే  నలుగురు విజేతల ఎంపిక కోసం   రెండు సవాళ్లు- రీసెర్చ్ ఛాలెంజ్ మరియు స్టార్ట్-అప్ ఛాలెంజ్ ఉంటాయి.

శాస్త్ర సాంకేతిక  మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఛాలెంజ్ సమయంలో సమాచారాన్నివిశ్లేషించడానికి, డేటా ప్రాసెసింగ్, పరిష్కారం , సర్వీసింగ్ పరికరాలు  రూపొందించడానికి  వివిధ జియోస్పేషియల్ డేటాసెట్‌లు పాల్గొనే వారందరికీ అందుబాటులో ఉంటాయని అన్నారు.  'ఓపెన్ ఇన్నోవేషన్' మరియు 'ఓపెన్ డేటా షేరింగ్' అనే అంశాల ప్రాతిపదికన రూపొందిన కార్యక్రమం భారతదేశంలో జియోస్పేషియల్ రంగంతో సంబంధం ఉన్నవారందరికీ  ప్రయోజనం కలిగించే అవకాశం ఉందని ఆయన అన్నారు.

 

సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ సునీల్ కుమార్ తన ప్రసంగంలోవిద్యా రంగం , అంకుర సంస్థలు ,  వర్ధమాన సాంకేతిక నిపుణులు, భౌగోళిక నిపుణుల నుంచి వినూత్న ఆలోచనలు మరియు పరిష్కారాలు సమీకరించడం ద్వారా సర్వే ఆఫ్ ఇండియా  ఎదుర్కొంటున్న కొన్ని సాధారణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుందని అన్నారు. భారతదేశం మరియు ఇతర జియోస్పేషియల్ సమాచార సేకరణ సంస్థలు, పరిష్కార మార్గాలు అందిస్తున్న సంస్థలతో  దేశం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు పరిష్కరించి దేశాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. 

ఈరోజు జరిగిన కార్యక్రమంలోఐఐఐటీ  హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.జె. నారాయణన్, ఐఐఐటీ  హైదరాబాద్  ప్రొఫెసర్ రమేష్ లోగనాథన్, మైక్రోసాఫ్ట్ ఇండియా పబ్లిక్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ నవతేజ్ బాల్ , శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సలహాదారు  డాక్టర్ అనితా గుప్తా కూడా పాల్గొన్నారు.

***



(Release ID: 1891334) Visitor Counter : 203