బొగ్గు మంత్రిత్వ శాఖ
ఫెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారెంటీని సవరించడంలో సడలింపులను ప్రతిపాదిస్తున్న బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు బ్లాకుల వేలానికి బిడ్ల గడువు తేదీ 30 జనవరి 2023 వరకు పొడిగింపు
Posted On:
14 JAN 2023 11:55AM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ 141 బొగ్గు గనుల కోసం వాణిజ్య బొగ్గు గనుల 6వ విడతను ప్రారంభించడమే కాక 5 విడతలో రెండవ ప్రయత్నాన్ని 3 నవంబర్ 2022న ప్రారంభించింది. పరిశ్రమ నుంచి వచ్చిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, వ్యాపారం చేయడాన్ని సులభతరం (ఇఒడిబి) చేయడాన్ని ప్రోత్సహించేందుకు మంత్రిత్వ శాఖ సంబంధిత బొగ్గు గనుల ప్రారంభ అనుమతిని మంజూరు చేసిన తర్వాత పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారెంటీ (పిబిజి - పనితీరుపై బ్యాంకుల హామీ)తొలి సవరణను ముందుకు తీసుకువెళ్ళాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
టెండర్ పత్రంలోని నిబంధనల ప్రకారం విజయవంతంగా వేలం వేసిన బొగ్గు గనికి సమర్పించవలసిన పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారెంటీ (పిబిజి)ని సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ నెలలో జాతీయ బొగ్గు సూచీ (ఎన్‌సిఐ) ఆధారంగా ప్రతి ఏడాదీ సవరిస్తారు. మొట్టమొదటి వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని 2020లో ప్రారంభించినప్పటి నుంచి ఎన్‌సిపి రెండింతలు అయ్యిందని, పిబిజి సవరణ నిబంధనలలో సడలింపు కోసం పరిశ్రమ నుండి అనేక నివేదనలు అందాయి. ఎన్‌సిఐలో ముందెన్నడూ లేని పెరుగుదలతో విజయవంతమైన బిడ్డర్లపై ఎక్కువ ఆర్థిక భారం పెరగడానికి దారి తీసిందని, వీరు వేలం పాడిన గనులు కార్యాచరణ ముందస్తు దశలో ఉండడంతో, గనుల కార్యాచరణ కార్యకలాపాలకు నిధుల లభ్యతపై ప్రభావితం చూపుతోందని అభ్యర్ధించారు.
ఈ పెట్టుబడిదారు అనుకూల చొరవ అన్నది బొగ్గు గనుల నిర్వహణ ప్రక్రియలో బిడ్డర్లపై ఆర్ధిక భారాన్ని తగ్గించి, వాణిజ్య బొగ్గు గనుల వేలంలో బిడ్డర్ల భాగస్వామ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. దీనికి బదులుగా ప్రస్తుత వేలం రౌండ్‌లో ఈ సవరణను అమలు చేసేందుకు మంత్రిత్వ శాఖ వేలం బిడ్ గడువు తేదీని ఇంతకు ముందు ప్రకటించినట్టుగా 13 జనవరి 2023 నుంచి 30 జనవరి 2023 వరకు పొడిగించింది.
***
(Release ID: 1891331)
Visitor Counter : 175