పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
శ్కొల్హాపూర్-బెంగళూరు మధ్య రోజువారీ విమానాన్ని ప్రారంభించిన శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
వారంలో ఏడు రోజులు ఈ విమాన సర్వీస్ ను నడపనున్న ఇండిగో
ఈ నగరాల మధ్య పెరిగిన విమాన అనుసంధానం ఈ ప్రాంతంలో పర్యాటకం వాణిజ్య కార్యకలాపాల వృద్ధికి దోహదం
Posted On:
14 JAN 2023 9:24AM by PIB Hyderabad
పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ డాక్టర్ విజయ్ కుమార్ సింగ్ (రిటైర్డ్) కొల్హాపూర్ నుండి బెంగళూరుకు నేరుగా విమాన సర్వీసును ప్రారంభించారు.
క్రింది షెడ్యూల్ ప్రకారం ఈ విమానం నడుస్తుంది:
ఫ్లయిట్ నెం.
|
నుంచి
|
వరకు
|
బయలు దేరు సమయము
|
ఆగమన సమయం
|
ఫ్రీక్వెన్సీ
|
ఎయిర్ క్రాఫ్ట్
|
6E - 7427
|
బెంగళూరు
|
కొల్హాపూర్
|
14:50
|
16:45
|
ప్రతి రోజు
|
ఏ టి ఆర్
|
6E - 7436
|
కొల్హాపూర్
|
బెంగళూరు
|
17:05
|
18:50
|
ప్రతి రోజు
|
|
పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా తన ప్రారంభోపన్యాసంలో ,కొల్హాపూర్ అభివృద్ధి, పురోగతిపై దృష్టి సారించి, కొత్త విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణం, రన్ వే విస్తరణ ,ఎటిసి టవర్ ఏర్పాటు కోసం 245 కోట్ల పెట్టుబడిని ఖరారు చేసినట్లు తెలిపారు.
భారతదేశంలోని ప్రతి మూలను అనుసంధానించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత, సంకల్పానికి అనుగుణంగా ఈ మార్గం ప్రారంభంతో హైదరాబాద్, తిరుపతి, ముంబై, అహ్మదాబాద్ , నేడు భారతదేశ సిలికాన్ రాజధాని బెంగళూరుతో కొల్హాపూర్ అనుసంధానించబడింది.
కనెక్టివిటీ ప్రారంభంతో కొత్త అవకాశాలు పెరుగుతాయని, రెండు నగరాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి ఉద్ఘాటించారు.
జనరల్ డాక్టర్ విజయ్ కుమార్ సింగ్ (రిటైర్డ్) ఈ కనెక్టివిటీని పొందినందుకు కొల్హాపూర్ ప్రజలను అభినందించారు, ఇది ఈ ప్రాంతంలో వ్యాపారం, వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
ఈ కార్యక్రమంలో లోక్ సభ ఎంపీ ప్రొఫెసర్ సంజయ్ సదాశివరావు మాండ్లిక్, కొల్హాపూర్ సౌత్ ఎమ్మెల్యే రుతురాజ్ సంజయ్ పాటిల్,పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ ఎస్ కె మిశ్రా, ఇండిగో ప్రిన్సిపల్ అడ్వైజర్ శ్రీ ఆర్ కె సింగ్, ఎంఒసిఎ, ఎఎఐ, ఇండిగో, కొల్హాపూర్ స్థానిక పాలనా యంత్రాంగాల కు చెందిన ఇతర ప్రముఖులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1891329)
Visitor Counter : 163