కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'లైసెన్స్ ఫీజు మరియు డీటీహెచ్‌ సేవల పాలసీ విషయాల'పై కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసిన ట్రాయ్

Posted On: 13 JAN 2023 5:35PM by PIB Hyderabad

కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈరోజు 'లైసెన్స్ ఫీజు మరియు డీటీహెచ్‌ సేవల పాలసీ విషయాలపై' కన్సల్టేషన్ పేపర్ (సిపి)ని విడుదల చేసింది.

లైసెన్స్ రుసుము అనేది లైసెన్స్ పొందిన కార్యకలాపాన్ని నిర్వహించడానికి అనుమతించబడిన ప్రత్యేక అధికారానికి సేవా ప్రదాతపై విధించబడిన పన్నుయేతర రుసుము. భారతదేశంలో ప్రస్తుతం డీటీహెచ్ ఆపరేటర్లు సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబి)కి త్రైమాసిక ప్రాతిపదికన సర్దుబాటు చేయబడిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌)లో 8% లైసెన్స్ రుసుమును చెల్లించవలసి ఉంటుంది. ఇక్కడ ఏజీఆర్ అనేది స్థూల ఆదాయం (జీఆర్‌) నుండి వస్తు సేవల పన్ను  మినహాయించి లెక్కించబడుతుంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్), 25 అక్టోబర్ 2022న ఏజీఆర్‌ కోసం ఏకీకృత లైసెన్స్ (యూఎల్‌) ఒప్పందంలో సవరణలు చేసింది. సవరణ ప్రకారం కొన్ని రాబడి భాగాలను తగ్గించడం ద్వారా వర్తించే స్థూల ఆదాయం (ఏపిజీఆర్) లైసెన్స్‌దారు యొక్క జీఆర్‌కి సమానంగా ఉంటుంది. ఇంకా ఏజీఆర్ యొక్క నిర్వచనం కూడా సవరించబడింది మరియు ఏపీజీఆర్‌ నుండి కొన్ని భాగాలను మినహాయించడం ద్వారా అందించబడుతుంది.

ప్రస్తుతం ఉన్న డీటీహెచ్ మార్గదర్శకాలు మొదటి రెండు త్రైమాసికాల్లో రూ.5 కోట్ల మొత్తానికి బ్యాంక్ గ్యారెంటీ (బిజీ)ని ఆపై రెండు త్రైమాసికాలకు లైసెన్స్ రుసుముతో సమానమైన మొత్తానికి మరియు సెక్యూరిటైజ్ చేయని ఇతర బకాయిలు సూచిస్తున్నాయి.  06 అక్టోబర్ 2021న బీజీల హేతుబద్ధీకరణకు డాట్‌ కొన్ని సవరణలను కూడా చేసింది.

డాట్ చేసిన పైన పేర్కొన్న సవరణల దృష్ట్యా, మరియు డీటీహెచ్ అసోసియేషన్ మరియు డీటీహెచ్ ఆపరేటర్ల అభ్యర్థన మేరకు ఎంఐబీ 02 ఫిబ్రవరి 2022న ట్రాయ్‌కి సూచనను పంపింది. ఈ క్రింది అంశాలను పాలసీ కోణం నుండి పరిశీలించి  ట్రాయ్ చట్టం, 1997 యొక్క 11(1)(ఏ) సెక్షన్ కింద దాని సిఫార్సులను అందించమని ట్రాయ్‌ని అభ్యర్థించింది.

 

  1. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ద్వారా ఇటీవలి సవరణలు మరియు/ లైసెన్స్ రుసుము విధింపు కోసం ఏదైనా ఇతర స్థావరాన్ని గుర్తించడం వంటి డీటీహెచ్ లైసెన్స్ ఫీజుకు సంబంధించి స్థూల ఆదాయ నిర్వచనం నుండి లైసెన్స్ లేని కార్యకలాపాలను మినహాయించడం. దీని ప్రకారం జీఆర్/ఏజీఆర్ ప్రమాణాల ప్రకారం డిటీహెచ్ సెక్టార్‌లో ఫారం-డి ఫార్మాట్ కూడా అందించబడవచ్చు;
  2. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఇటీవల చేసిన సవరణల విషయంలో ప్రైవేట్ డీటీహెచ్ సేవలకు సంబంధించి బ్యాంక్ గ్యారెంటీల (బిజిలు) శాతం/మొత్తం; మరియు 
  3. అన్ని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫారమ్ ఆపరేటర్లకు (డిపిఓలు) సంబంధించి యూనిఫాం లైసెన్స్ ఫీజు (లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్) జారీ.

 
దీని ప్రకారం, చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజు మరియు డీటీహెచ్ ఆపరేటర్లు అందించిన బ్యాంక్ గ్యారెంటీకి సంబంధించిన సమస్యలపై వాటాదారుల వ్యాఖ్యలు/అభిప్రాయాలను కోరేందుకు ఈ కన్సల్టేషన్ పేపర్ తయారు చేయబడింది. సంప్రదింపు పత్రంపై వ్రాతపూర్వకంగా 13 ఫిబ్రవరి 2023లోపు వాటాదారుల నుండి ఆహ్వానించబడతాయి. కౌంటర్ కామెంట్‌లు, ఏవైనా ఉంటే, 27 ఫిబ్రవరి 2023లోపు సమర్పించవచ్చు. వ్యాఖ్యలు మరియు కౌంటర్-కామెంట్‌లను ఇమెయిల్‌లో ఎలక్ట్రానిక్ రూపంలో పంపవచ్చు:

advbcs-2@trai.gov.in మరియు jtadvisor-bcs@trai.gov.in.

ఏదైనా వివరణ/సమాచారం కోసం, శ్రీ అనిల్ కుమార్ భరద్వాజ్, సలహాదారు (బి&సిఎస్) ఫోన్‌లో +91-11-23237922 నెంబర్‌లో  సంప్రదించవచ్చు.

కన్సల్టేషన్ పూర్తి డాక్యుమెంట్ ట్రాయ్ వెబ్‌సైట్ www.trai.gov.inలో అందుబాటులో ఉంది


 

***


(Release ID: 1891192)
Read this release in: English , Urdu , Hindi