శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఎ ఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్, సెమీకండక్టర్, క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్ డ్ వైర్ లెస్, బయోటెక్నాలజీ, జియోసైన్సెస్, ఆస్ట్రోఫిజిక్స్ ,డిఫెన్స్ వంటి రంగాలలో మరింత సహకారం పై భారతదేశంతో చర్చించిన యుఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్)


ఈ రోజు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమైన అమెరికా ఎన్ ఎస్ ఎఫ్ ప్రతినిధి బృందం; ఎస్ అండ్ టి ద్వైపాక్షిక సహకారాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్తామని హామీ

ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రీయ ప్రయత్నాల అన్ని రంగాలలో కొత్త అవకాశాలను తెరిచారు, కానీ ముఖ్యంగా అంతరిక్షం, బయోటెక్, జియోస్పేషియల్ సస్టైనబుల్ స్టార్టప్స్ రంగాలలో ఇంకా ఎక్కువ కొత్త అవకాశాలను, మార్గాలను తెరిచారు: డాక్టర్ జితేంద్ర సింగ్

క్రిటికల్ మినరల్స్, స్మార్ట్ అగ్రికల్చర్, బయో ఎకానమీ, 6జీ టెక్నాలజీస్ వంటి రంగాల్లో సహకారానికి కొత్త మార్గాలను తెరుస్తామని ఎన్ఎస్ఎఫ్ హామీ.

Posted On: 13 JAN 2023 5:00PM by PIB Hyderabad

ప్రీమియర్ సంస్థ అయిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్ఎస్ఎఫ్) కు చెందిన ఉన్నత స్థాయి అమెరికా ప్రతినిధి బృందం ఈ రోజు కేంద్ర శాస్త్ర- సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) , ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) , పీఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవియెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్  తో సమావేశమై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్, సెమీకండక్టర్, క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ వైర్లెస్, బయోటెక్నాలజీ, జియోసైన్సెస్, ఆస్ట్రోఫిజిక్స్, డిఫెన్స్ వంటి రంగాల్లో భారత్ తో విస్తృత సహకారాన్ని గురించి చర్చించారు.

 

అమెరికా ప్రతినిధివర్గం నాయకుడు,  అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ సేతురామన్ పంచనాథన్ మాట్లాడుతూ, భారత్ తో సహకారాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళతామని మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ కు హామీ ఇచ్చారు. గత ఆరు నెలల్లో తాము భారత కేంద్ర శాస్త్ర , సాంకేతిక శాఖ మంత్రి తో సమావేశం జరపడం ఇది మూడవ సారి అని ఇది ఈ విధానం గణనీయతను సూచిస్తోందని ఆయన అన్నారు.

 

గత ఎనిమిదిన్నరేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో వ్యక్తిగత ఆసక్తి కనబరిచారని, సామాన్యులకు జీవన సౌలభ్యాన్ని తీసుకురావడానికి సైన్స్ ఆధారిత పరిష్కారాల ద్వారా సామాజిక రంగ పథకాలను అమలు చేయడానికి చురుకుగా ప్రయత్నించారని డాక్టర్ జితేంద్ర సింగ్ అమెరికా ప్రతినిధి బృందానికి తెలిపారు. మోదీ నుండి లభించిన ప్రోత్సాహం శాస్త్రీయ ప్రయత్నాల అన్ని రంగాలలో ముఖ్యంగా అంతరిక్షం, బయోటెక్, జియోస్పేషియల్, సస్టైనబుల్ స్టార్టప్స్ రంగాలలో.కొత్త అవకాశాలు, మార్గాలను తెరిచిందని తెలిపారు. 2014 నుంచి ప్రతి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ పరిశుభ్రత, హైడ్రోజన్ మిషన్, డిజిటల్ హెల్త్ కేర్ సిస్టమ్, డీప్ ఓషన్ మిషన్, క్లీన్ ఎనర్జీ, స్టార్టప్స్ వంటి కీలక శాస్త్రీయ సవాళ్లను, ప్రాజెక్టులను ప్రముఖంగా ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రపంచ నాయకత్వం కోసం మన్నికైన, బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడానికి భారతదేశం,అమెరికా రెండింటికీ ఇది ఉత్తమ సమయం అని అన్నారు. సంబంధాల్లో చాలా సౌలభ్యం ఉందని, కోరుకున్న లక్ష్యాలను సాధించడానికి సుముఖత,ఆశావాదానికి స్పష్టమైన సంకేతం ఉందని ఆయన అన్నారు.

క్లిష్టమైన రంగాలలో సాంకేతిక బదిలీ విషయానికి వస్తే, సహకరించడం తప్ప వేరే మార్గం లేనందున, అమెరికా తన సహజ మిత్రదేశానికి (ప్రపంచంలోని పురాతన ,అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు) సహాయం చేసేందుకు ముందుకు రాగలదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ప్రతినిధి వర్గం స్థాయి చర్చల సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణ, టెక్నాలజీ, అంతరిక్షం, భూమి , సముద్ర విజ్ఞానం ,అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు వంటి రంగాలను సహకార విస్తరణ కోసం ఇరు పక్షాలు ఇప్పటికే గుర్తించాయని చెప్పారు.

శాస్త్రీయ పరిశోధనలు,సాంకేతిక ఆవిష్కరణల విషయానికి వస్తే భారత్- అమెరికా మధ్య దీర్ఘకాలిక సంబంధం ఉందని, ఉమ్మడి ఆసక్తిని కలిగి ఉందని, ఈ అనుసంధానాలను విస్తృత ప్రపంచ ప్రయోజనం కోసం బలోపేతం చేయడానికి, ఉపయోగించడానికి సమయం ఆసన్నమైందని మంత్రి చెప్పారు.

 

డాక్టర్ సేతురామన్ పంచనాథన్ ఇంతకు ముందు గుర్తించిన , నేటి సమావేశంలో చర్చకు వచ్చిన విషయాలను లాజికల్ ముగింపునకు తీసుకువెళతామని డాక్టర్ జితేంద్ర సింగ్ కు హామీ ఇచ్చారు.

క్రిటికల్ మినరల్స్, స్మార్ట్ అగ్రికల్చర్, బయో ఎకానమీ, 6జీ టెక్నాలజీస్ వంటి రంగాల్లో సహకారానికి కొత్త మార్గాలను తెరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. గుర్తించిన ప్రాజెక్టులపై 2023 మార్చి నుంచి మరిన్ని ఉమ్మడి కాల్స్ తీసుకోనున్నట్లు మంత్రికి ఆయన తెలియజేశారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ ఎన్ఎస్ఎఫ్ ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ,

ప్రపంచ గమనం లో ముఖ్యంగా సాంకేతిక ఆవిష్కరణల రంగంలో భారతీయ సైన్స్ రంగ ప్రవాస కమ్యూనిటీ ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన కమ్యూనిటీలలో ఒకటి అని అన్నారు. పరస్పర ప్రయోజనం ఉన్న రంగాల్లో డీప్-టెక్ స్టార్టప్ లను సంయుక్తంగా గుర్తించడానికి, పోషించడానికి, ప్రోత్సహించడానికి రెండు దేశాలు మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు.

 

ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ డేటా సిస్టమ్ కోసం కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ ఎన్ఎస్ఎఫ్ మద్దతును కోరారు. ప్రస్తుతం వివిధ సంస్థలు డేటా సమీకరణను వివిధ మార్గాలలో నిర్వహిస్తున్నాయని, అయితే ఇంటిగ్రేటెడ్ డేటా వ్యవస్థ డేటా

అనలిటిక్స్ , సంబంధిత ప్రయోజనాలలో ఎంతో ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు. ఎన్ ఎస్ ఎఫ్ - నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ స్టాటిస్టిక్స్ తో నాలెడ్జ్ భాగస్వామ్యం ఈ రంగంలో దీర్ఘకాలిక సామర్థ్య అభివృద్ధి పరంగా గొప్ప విలువను జోడిస్తుందని మంత్రి అన్నారు.

 

అంతరిక్ష రంగంలో, ప్రధానంగా అంతరిక్ష శిధిలాల నిర్వహణ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకారాన్ని పెంచాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. నాసా-ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని 2023 లో ప్రయోగించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. గుర్తు చేశారు. అమెరికా, భారతీయ సంస్థలు, విద్యార్థుల మధ్య సంబంధాలను నెలకొల్పడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ పార్టనర్ షిప్ మరో కోణమని మంత్రి అన్నారు. అనేక స్టెమ్-ఫోకస్డ్ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో గత సంవత్సరం ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

 

కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ (పీఎస్ఏ) ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ సంయుక్త కార్యదర్శి శ్రీ సత్యజిత్ మొహంతి , ఆరు ఎస్ అండ్ టి విభాగాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

****(Release ID: 1891181) Visitor Counter : 169


Read this release in: English , Urdu , Hindi , Kannada