ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ (HMIS) మరియు పునరుత్పత్తి పిల్లల ఆరోగ్యం (RCH) పోర్టల్‌పై రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్‌ను కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించింది.


గ్రామీణ ఆరోగ్య గణాంకాలు 2021-22 నివేదిక హెచ్ ఎం ఐ ఎస్ (HMIS) 2020-21 ; 2021-22: విశ్లేషణాత్మక నివేదిక మరియు జనాభా పరిశోధన కేంద్రాల సంకలనం (PRCలు) లను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి విడుదల చేశారు.

" ఆర్ సీ హెచ్ (RCH), హెచ్ ఎం ఐ ఎస్ (HMIS) పోర్టల్స్ మరియు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) మధ్య చక్కటి అనుబందం ఏకీకరణ జరుగుతుంది"

Posted On: 12 JAN 2023 1:27PM by PIB Hyderabad

“మన ఆరోగ్య రంగానికి చెందిన ఫీల్డ్ వర్కర్లు, డేటా సేకరణ చేసేవారు, డేటా ఇంటిగ్రేటర్లు మరియు డేటా మేనేజర్లు మొదలైన వారిని నేను అభినందిస్తున్నాను. వారు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 2.25 లక్షల ఆరోగ్య సౌకర్యాల నుండి సకాలంలో డేటా సేకరణ చేయడంలో కీలకమైన సహకారం అందించారు. రాష్ట్రాల్లో ఆరోగ్య జోక్యాలకు ప్రాతిపదికగా పనిచేయడానికి ఈ డేటాను నిజ-సమయ ప్రాతిపదికన విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ (HMIS) మరియు పునరుత్పత్తి పిల్లల ఆరోగ్యం (RCH) పోర్టల్‌పై జాతీయ వర్క్‌షాప్‌లో ప్రసంగిస్తూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ ఈ విషయాన్ని తెలిపారు.

 

ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ (HMIS) పోర్టల్ మరియు పునరుత్పత్తి పిల్లల ఆరోగ్యం (RCH) పోర్టల్ యొక్క ఉపయోగం మరియు  పర్యవేక్షణ మరియు విధాన జోక్య సాధనంగా ఉపయోగించడాన్ని పునరుద్ఘాటించడం రెండు రోజుల వర్క్‌షాప్ యొక్క లక్ష్యం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) కింద డిజిటల్ జోక్యాలపై దృష్టి సారించడంతో పాటు ఈ కార్యక్రమంలో మూడు ప్రచురణలు విడుదల చేశారు. ఏ ఎన్ ఎం ఓ ఎల్ ( ఏ ఎన్ ఎం ఆన్‌లైన్), కిల్కారీ మొబైల్ అకాడమీ యొక్క కొత్త ఫీచర్లు కూడా ప్రదర్శించబడ్డాయి.

 

ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య రంగంలో జరుగుతున్న ప్రధాన పరిణామాలపై దృష్టి సారించారు. దేశ వ్యాప్తంగా 1.54 లక్షలకు పైగా హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు (హెచ్‌డబ్ల్యుసి) పని చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 12 ఆరోగ్య ప్యాకేజీలను ఉచితంగా అందించడంతో పాటు,  ఉచిత మందులు  డయాగ్నస్టిక్స్, సాధారణ క్యాన్సర్లు, మధుమేహం మరియు రక్తపోటు కోసం ఉచిత స్క్రీనింగ్ పరీక్షలను కూడా అందిస్తారు. లక్షకు పైగా హెచ్‌డబ్ల్యుసిలు ఇ-సంజీవని టెలిసర్వీసులను కూడా అందిస్తున్నాయి. "ఇది భారీ మొత్తంలో డిజిటల్ డేటా ఉత్పత్తికి సేకరణకు దారి తీస్తోంది, డేటా అప్‌లోడ్ చేయబడిందని మరియు జాగ్రత్తగా విశ్లేషించబడుతుందని మేము నిర్ధారించుకోవాలి" అని ఆయన అన్నారు.

 

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) యొక్క మరొక అభివృద్ధిపై దృష్టి సారించిన శ్రీ రాజేష్ భూషణ్ , “మనం ఆర్ సీ హెచ్ (RCH), హెచ్ ఎం ఐ ఎస్ (HMIS) పోర్టల్స్ మరియు ఏ బీ డీ ఎం (ABDM) మధ్య మరింత సమైక్యత కలిగి ఉండాలి. ఏ బీ హెచ్ ఏ ఐ డి (ABHA ID)ల సృష్టి ద్వారా  ఆరోగ్య రికార్డుల సృష్టి మరియు ఇంటర్‌ఆపరేబిలిటీ నిర్ధారించబడుతోంది. ఆరోగ్య రంగంలో విప్లవాత్మకంగా పని చేసే  ఆర్ సీ హెచ్ మరియు హెచ్ ఎం ఐ ఎస్ తో వీటిని అనుసంధానించవచ్చు. "అన్ని ఆరోగ్య సౌకర్యాలు ఈ ఏ బీ హెచ్ ఏ - ఐ డి లను రూపొందించడానికి మరియు వాటిని డిజిటల్ హెల్త్ రికార్డ్‌లకు లింక్ చేసే స్థితిలో ఉన్నాయని ఆయన మరింత నొక్కి చెప్పారు. పర్యవసానంగా, ఇది మన పౌరులకు డిజిటల్ హెల్త్ రికార్డ్‌లకు పేపర్‌లెస్ మరియు అవాంతరాలు లేని యాక్సెస్ యొక్క బలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది.

 

గ్రామీణ ఆరోగ్య గణాంకాలు 2021-22, 1992 నుండి కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క వార్షిక ప్రచురణ. ఇది ప్రతి సంవత్సరం మార్చి 31 వరకు మానవశక్తితో సహా ఆరోగ్య మౌలిక సదుపాయాలపై డేటాను అందిస్తుంది. హెచ్ ఎం ఐ ఎస్ పోర్టల్‌లో రాష్ట్రాలు/ యూ టీ లు అప్‌లోడ్ చేసిన డేటా ఆధారంగా ఈ ప్రచురణ ఉంటుంది. సంబంధిత రాష్ట్రాలు/ యూ టీ ల ద్వారా ధృవీకరించబడిన తర్వాత మాత్రమే ప్రచురించబడుతుంది. దేశంలోని గ్రామీణ, పట్టణ మరియు గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సౌకర్యాలు  మరియు మానవ వనరులలోని ఖాళీలను గుర్తించడంలో ఇది ఒక విజన్ డాక్యుమెంట్‌గా ఉపయోగపడుతుంది. ఇది పౌరులకు కూడా ముఖ్యమైన సమాచార వనరుగా ఉపయోగపడుతుంది.కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఈ పైన వివరించిన మూడు ప్రచురణలను విడుదల చేశారు

 

హెచ్ ఎం ఐ ఎస్ 2020-21 & 2021-22 నివేదిక. ఇది తల్లి ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం, రోగనిరోధకత, కుటుంబ నియంత్రణ సేవల కవరేజ్, కౌమార ఆరోగ్యం మరియు రోగుల సేవలకు సంబంధించిన కీలక పనితీరు సూచికలపై ఈరోజు విడుదల చేసిన నివేదిక విశ్లేషణాత్మక అంతర్దృష్టిని అందిస్తుంది. అదనంగా, బెడ్ ఆక్యుపెన్సీ రేటు, సి-సెక్షన్ రేటు, బ్లడ్ రీప్లేస్‌మెంట్ రేటు, తల్లిముందుగా పాలివ్వడాన్ని  ఉత్ప్రెరించే రేటు, శస్త్రచికిత్స అనంతర ఇన్‌ఫెక్షన్ రేటు ఆధారంగా ఈ రెండేళ్లలో జిల్లా ఆసుపత్రుల పనితీరు మొదలైనవి విశ్లేషించడానికి ప్రత్యేకంగా ఒక విశ్లేషణాత్మక అధ్యాయం చేర్చబడింది. 

 

“అందరికీ ఆరోగ్యం: అవకాశాలు మరియు సమస్యలు” అనే శీర్షికతో 2021-22 పీ ఆర్ సీ ల సంకలనం కూడా ఈరోజు ఆవిష్కరించబడింది. 2021-22 సంవత్సరంలో పీ ఆర్ సీ లు నిర్వహించిన ప్రసూతి ఆరోగ్యం, శిశు ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ, నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు ( ఎన్ సీ డీ లు) & కమ్యూనికేబుల్ వ్యాధులు (సీ డీ లు) మొదలైన వాటిపై ప్రాథమిక మరియు ద్వితీయ డేటా ఆధారంగా ఎంపిక చేసిన పరిశోధన అధ్యయనాలను ఈ సంకలనం లో వున్నాయి. పిఆర్‌సి శ్రీనగర్, పిఆర్‌సి ధార్వాడ్, పిఆర్‌సి కేరళ, పిఆర్‌సి బెంగళూరుకు సంబంధిత పరిశోధన అధ్యయనాలకు అవార్డులు అందించారు.

 

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పి అశోక్ బాబు, డైరెక్టర్ జనరల్ శ్రీ కల్ సింగ్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శ్రీమతి అంజలి రావత్ పాల్గొన్నారు. వర్క్‌షాప్‌కు రాష్ట్రాలు/యుటిల నుండి హెచ్ ఎం ఐ ఎస్ మరియు ఆర్ సీ హెచ్ నోడల్ అధికారులు, మంత్రిత్వ శాఖలోని ప్రోగ్రామ్ విభాగాలు, అభివృద్ధి భాగస్వాములు మరియు ఇతర వాటాదారులు కూడా హాజరయ్యారు.

***


(Release ID: 1890933)