విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మూడు వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్న ఆర్ఈసీ


- మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2023 నేపథ్యంలో ఈ ఒప్పందాలు

Posted On: 12 JAN 2023 3:41PM by PIB Hyderabad

 

-      జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోన్న మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్

-      రూ.15,086 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఎంపీ పవర్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఎం.పి.పి.ఎం.సి.ఎల్)తో ఆర్ఈసీ మొదటి అవగాహన ఒప్పందం

-       రీవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ (ఆర్.యు.ఎం.ఎస్.ఎల్) తో రెండవ అవగాహన ఒప్పందం

-      ఇందులో భాగంగా ఆర్ఈసీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం ఆర్థిక సహాయంగా రూ.1,000 కోట్లు అందజేత

-      ప్రపంచ బ్యాంక్ భాగస్వామ్యంతో ఆర్ఈసీ ఎంపిక చేయబడిన ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పంపిణీ సంస్థల కోసం ఫైనాన్సింగ్ సౌకర్యాన్ని రూపొందించింది

-      ఈ సమావేశంలో పాల్గొంటున్న 314 కంటే ఎక్కువ కంపెనీలు

మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నేపథ్యంలో ఆర్ఈసీ లిమిటెడ్ సంస్థ వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుందిత్వరలో అందుబాటులోకి రానున్న సరణి మరియు అమర్కంఠక్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లుసిస్టమ్ మెరుగుదల పనులుటెక్నాలజీ ఆధునికీకరణరినోవేషన్ & ఆధునీకరణ మొదలైన వాటి కోసం ఎంపీ పవర్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఎం.పి.పి.ఎం.సి.ఎల్) సంస్థకు రూ.15,086 కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి గాను మొదటి అవగాహన ఒప్పందం కుదుర్చుకుందిరెవా అల్ట్రా మెగా సోలార్ లిమిటెడ్ (ఆర్.యు.ఎం.ఎస్.ఎల్)తో రెండవ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందిఇందులో భాగంగా ఆర్ఈసీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు మరియు/లేదా విద్యుత్ తరలింపుతో సహా వివిధ సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్ధిని కవర్ చేసే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయంగా రూ.1,000 కోట్లను అందజేయనుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ పార్కులను అభివృద్ధి చేయడానికి ఆర్.యు.ఎం.ఎస్.ఎల్. సంస్థను కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎం.ఎన్.ఆర్.ఇ) సోలార్ పవర్ పార్క్ డెవలపర్ (ఎస్పీపీడీ)గా నియమించింది. ఈ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ యొక్క పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను సాధించడానికి కీలకంగా ఉండనుంది.  2024 ఆర్థిక సంవత్సరం నాటికి పునరుత్పాదక వనరుల ద్వారా 20% విద్యుత్‌ను, 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 30% మరియు 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 50% విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామి ఆర్థిక సేవల ప్రదాతగా అవతరించాలనే దిశగా ఆర్ఈసీ దృష్టి సారించింది. ఈ సదస్సు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.  314 కంటే ఎక్కువ కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. అదనంగా, ప్రపంచ బ్యాంకు భాగస్వామ్యంతో REC ఎంపిక చేయబడిన ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పంపిణీ సంస్థల కోసం ఫైనాన్సింగ్ సౌకర్యాన్ని రూపొందించింది. ఈ ఆర్ఈసీ-వరల్డ్ బ్యాంక్ కార్యక్రమంలో భాగంగా అందుబాటులో ఉన్న మొత్తం ఫైనాన్సింగ్ పరిమాణం 1 బిలియన్ అమెరికా డాలర్లు. ఈ గొడుగు కింద ఆర్ఈసీ పంపిణీ సంస్కరణలను మరింత బలోపేతం చేయడానికి ఎంపీ డిస్కమ్‌లకు రూ.5,000 కోట్ల మొత్తాన్ని అందించేందుకు కట్టుబడి ఉంది.

***


(Release ID: 1890861) Visitor Counter : 144


Read this release in: English , Urdu , Hindi