వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఆదర్శ పెట్టుబడికి గమ్యస్థానంగా ఉద్భవించిన మధ్యప్రదేశ్: శ్రీ గోయల్


మధ్యప్రదేశ్ పురోగతి మరియు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు

వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, టూరిజం, టెక్స్‌టైల్స్, పునరుత్పాదక ఇంధనంలో ఎంపీ పుష్కలమైన అవకాశాలను అందిస్తుంది: శ్రీ గోయల్

భారతదేశ బలం రాష్ట్రాలలో ఉందన్న ప్రధాని మోదీ నమ్మకాన్ని శ్రీ గోయల్ పునరుద్ఘాటించారు

గుడ్ గవర్నెన్స్‌లో ఎంపీ చేసిన వేగవంతమైన పురోగతి ప్రధానమంత్రి దృష్టిని నెరవేర్చడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పని చేస్తుందని చూపిస్తుంది: శ్రీ గోయల్

మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగం

Posted On: 11 JAN 2023 4:11PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈరోజు మధ్యప్రదేశ్‌ను ఒక ఆదర్శ పెట్టుబడి గమ్యస్థానంగా హైలైట్ చేశారు.  ఎంపీ పురోగతి మరియు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు ఆయన పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఆయన ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా ప్రసంగించారు.

భారతదేశ  శక్తివంతమైన భవిష్యత్తులో పాల్గొనడానికి నేటి శిఖరాగ్ర సదస్సు పరిశ్రమకు అవకాశాన్ని కల్పిస్తుందని శ్రీ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఉన్న అనేక పెట్టుబడి అవకాశాల గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ..ఇది ఆదర్శ పెట్టుబడికి గమ్యస్థానంగా ఆవిర్భవించిందని అన్నారు. రాష్ట్రంలో విస్తారమైన భూమి, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన వనరులు ఉన్నాయని అలాగే వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, టూరిజం, టెక్స్‌టైల్స్, రెన్యూవబుల్ ఎనర్జీలో భారీ అవకాశాలను అందిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ ఎంగేజ్‌మెంట్‌లలో కూడా ఎంపిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన హైలైట్ చేశారు.

ఎంపీ గురించి మాట్లాడుతూ ఇది నూతన భారతదేశ  చైతన్యాన్ని ప్రతిబింబించే భారతదేశ హృదయంగా పిలువబడుతుందని అన్నారు. ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రం.  చాలా వ్యూహాత్మకంగా దేశం మధ్యలో ఉంది. ఉత్తర-దక్షిణ మరియు తూర్పు పశ్చిమ-కారిడార్లు ఎంపీలో ఉన్నాయి. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో పునరుత్పాదక శక్తి 20 శాతం దోహదపడుతుందని కూడా ఆయన హైలైట్ చేశారు. ఇది ప్రపంచంలోని సేంద్రియ పత్తి ఉత్పత్తిలో 24 శాతానికి దోహదపడుతుందనే వాస్తవం అంతర్జాతీయ మార్కెట్‌లో ఎంపీకి పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఎంపీ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి గత ఏడాది దాదాపు 20 శాతం వృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు.

సుపరిపాలనలో మధ్యప్రదేశ్ వేగంగా అడుగులు వేస్తున్నందుకు శ్రీ గోయల్ ప్రశంసించారు. ఇది త్వరితగతిన పరివర్తన చెందాలనే ప్రధానమంత్రి దృష్టిని నెరవేర్చడానికి పని చేస్తున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు.

ప్రధానమంత్రి ప్రారంభించిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో అనేక రంగాలలో ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక ఇంధనంలో భారీ పెట్టుబడులను తీసుకురావడంలో సహాయపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

భారతదేశ  బలం దాని రాష్ట్రాలలో ఉందని మరియు భారతదేశం ముందుకు సాగాలంటే రాష్ట్రాలు ముందుకు సాగడం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చాలా సందర్భాలలో నొక్కిచెప్పారని శ్రీ గోయల్ అన్నారు. రాష్ట్రాలలో అభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంపై ప్రధాని మోదీ ఎల్లప్పుడూ దృష్టి సారిస్తారని, తద్వారా భారతదేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు అపారమైన అవకాశాలను కల్పిస్తారని ఆయన అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి రాష్ట్రాలు బలమైన స్తంభాలుగా ఉంటాయని ప్రధాని మోదీ విశ్వసిస్తున్నారని, 2022 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల సందర్భంగా దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను జరుపుకోవడంతో దేశం మొత్తం ప్రధానమంత్రితో పాటు కట్టుబడి ఉందని ఆయన అన్నారు.

శ్రీ గోయల్ తన వ్యాఖ్యలలో అవస్థాపన అభివృద్ధికి దృష్టి కేంద్రీకరించిన విధానం, ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాదిని ఏర్పరుస్తుందన్నారు. ఇది ఎల్లప్పుడూ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉంటుందని సూచించారు. మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే ఈ ప్రయాణంలో మధ్యప్రదేశ్ కూడా భాగమైందని ఆయన అన్నారు.

సమ్మిట్‌లో ప్రధానమంత్రి ప్రారంభ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, ఇందులో ప్రభుత్వం యొక్క వివిధ కార్యక్రమాలు- పిఎం గతి శక్తి, నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్, డిజిటల్ ఇండియా గురించి మాట్లాడిన శ్రీ గోయల్ పిఎం శ్రీ నరేంద్ర మోదీ యొక్క దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఇవన్నీ సాధ్యమయ్యాయని అన్నారు. వన్ నేషన్, వన్ టాక్స్, ఐబిసి, వన్ నేషన్ వన్ గ్రిడ్ ఉదాహరణలను ఉటంకిస్తూ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందన్నారు.

భారతదేశం నేడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థగా వేగంగా అభివృద్ధి చెందుతోందని శ్రీ గోయల్ అన్నారు.

భారతదేశ  జీ20 ప్రెసిడెన్సీ గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ.. భారతదేశం పెరుగుతున్న మన బలాలను మరియు ప్రపంచానికి పెరుగుతున్న సహకారాన్ని ప్రపంచానికి ప్రదర్శించడానికి ఇది సరైన సమయమని అన్నారు. భారతదేశం మరోసారి విశ్వ గురువుగా మారుతోంది మరియు ప్రపంచాన్ని నివసించడానికి సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి చొరవ చూపుతోందని తెలిపారు.

ఎంపీ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని పేర్కొంటూ.. కొన్ని నెలల క్రితం కునో నేషనల్ పార్క్‌లో పీఎం విడుదల చేసిన చిరుత వేగంతో ఎంపీ ఎదగాలని ఆకాంక్షించారు. కొత్త అవకాశాలతో పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను ఎంపీ మరింత వేగవంతం చేస్తారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

శ్రీ గోయల్ ఈ రోజు భారతదేశం స్పష్టంగా ప్రపంచంలో ప్రకాశవంతమైన ప్రదేశం అని మరియు మధ్యప్రదేశ్ ముందు నుండి నాయకత్వం వహిస్తుందని మరియు వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నాలలో పాలుపంచుకోవడం కొనసాగించాలని ఆకాంక్షిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.


 

******



(Release ID: 1890589) Visitor Counter : 98