వ్యవసాయ మంత్రిత్వ శాఖ

బార్మర్ రైతులకు పంటల బీమా పథకం కింద పూర్తి చెల్లింపులు


540 కోట్ల పంట బీమా క్లెయిమ్‌లను త్వరలో చెల్లింపు

కేంద్ర వ్యవసాయ మంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద చిన్న మొత్తాల క్లెయిమ్‌లకు సంబంధించి రాష్ట్రాలు మరియు బీమా కంపెనీలతో సంప్రదించి విధానాన్ని రూపొందించనున్న కేంద్రం

Posted On: 11 JAN 2023 7:36PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కు సంబంధించి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయరైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం  ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.2021 ఖరీఫ్ పంట కాలానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను బార్మర్ రైతులకు  పూర్తిగా చెల్లించాలని సమావేశంలో నిర్ణయించారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో గత వారం రూ. 311 కోట్ల పాక్షిక క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ   తెలిపింది. ఈరోజు జరిగిన సమీక్షా సమావేశం అనంతరం బీమా కంపెనీ రైతులకు అదనంగా 229 కోట్ల రూపాయల క్లెయిమ్ మొత్తాన్నిచెల్లించడానికి అంగీకరించింది.  బార్మర్‌లోని అర్హులైన రైతులకు మొత్తం చెల్లించాల్సి ఉన్న .540 కోట్ల రూపాయలను సాధ్యమైనంత త్వరగా చెల్లించాలని నిర్ణయించారు. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరిఆర్థికవ్యవసాయ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులుఅగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు రాజస్థాన్ వ్యవసాయ కమిషనర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

సమీక్షా సమావేశంలో కేంద్ర వ్యవసాయరైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ పంట నష్టపోయిన కోట్లాది మంది రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా  ఆర్థిక భద్రత కల్పించామన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.  తీసుకునేటప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు  పంటల బీమా తీసుకునేలా చూడడానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. పంటల బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాలుభీమా కంపెనీలతో చర్చించి చిన్నచిన్న క్లెయిమ్‌ల విషయంలో రైతులకు ప్రయోజనం కలిగేలా చూసేందుకు   కేంద్ర ప్రభుత్వం త్వరలో  చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరించారు. సమావేశంలో పంటల బీమా పథకం సౌలభ్యం మరియు చిన్న క్లెయిమ్‌లకు ప్రతిపాదిత పరిష్కారాలపై సమగ్ర చర్చ జరిగింది.  

 

 భవిష్యత్తులో అర్హులైన రైతులకు ఒకేసారి  ఏకీకృత చెల్లింపు చేయాలని నిర్ణయించారు.

 

***



(Release ID: 1890575) Visitor Counter : 135


Read this release in: English , Urdu , Hindi , Punjabi