గనుల మంత్రిత్వ శాఖ
నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్టుకు ఖనిజాన్వేషణ, సామర్ధ్యాలను మెరుగుపరిచేందుకు రూ. 154.84 కోట్లను ఆమోదించిన గనుల మంత్రిత్వ శాఖ
Posted On:
11 JAN 2023 1:20PM by PIB Hyderabad
గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఇటి - జాతీయ ఖనిజ అన్వేషణ ధర్మనిధి) కార్యనిర్వాహక వర్గ కమిటీ (ఇసి) సమావేశం గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ అధ్యక్షతన జరిగింది.
సమావేశంలో రూ. 154.84 కోట్ల విలువైన ఖనిజ అన్వేషణ & అన్వేషణలో వ్యవస్థాగత సామర్ధ్యాల పెంపు ప్రాజెక్టులను ఆమోదించారు. దేశంలో ఖనిజాల అన్వేషణను పెంచేందుకు, ప్రోత్సహించేందుకు, గ్రాఫైట్ (నల్లసీసం), ఇనుము, బొగ్గు, జింక్ (తుత్తు నాగం) తో పాటు దాని సంబంధ ఖనిజాలు బాక్సైట్ , బేస్ మెటల్ (పిబి, జెడ్ఎన్& సియు), ఫోస్ఫోరైట్ / గ్లాకోనిటిక్ శాండ్ స్టోన్ (ఇసుక రాయి), పిజిఇ & సంబంధిత ఖనిజాలు (క్రోమియం, నికెల్, కోబాల్ట్), టిన్ & సంబంధిత ఖనిజాలు, మాంగనీస్ , సున్నపు రాయి అన్వేషణ తదితర ప్రాజెక్టులు చేపట్టనున్నారు.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబిఎం), రాష్ట్ర డిజిఎంలు/ డిఎంజీలు సంస్థాగత సామర్ధ్యాలను, ఖనిజాల అన్వేషణను పెంచేందుకు ఆర్ధిక సహాయాన్ని కూడా ఆమోదించారు.
ఈ ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులు, అన్వేషణ సంస్థలకు ఆర్ధిక సహాయం అందించడం అన్నది దేశానికి వేలం వేయదగిన ఖనిజ బ్లాకులను అందించడమే కాక గనుల రంగంలో ఆత్మనిర్భర్ భారత్ ను సాకారం చేసేందుకు తోడ్పడుతుంది.
***
(Release ID: 1890561)
Visitor Counter : 139