ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్ తాజా సమాచారం


కోవిడ్ పాజిటివ్ గా 324 మంది లో అన్ని రకాల ఓమిక్రాన్ వేరియంట్లు ఉన్నట్లు గుర్తింపు
గుర్తించిన వేరియంట్ల వల్ల మరణాల సంఖ్య పెరగలేదు, వ్యాప్తి ఎక్కువగా లేదని నిర్ధారణ

Posted On: 09 JAN 2023 7:27PM by PIB Hyderabad

ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడిఎస్పి) సెంటినల్ కేంద్రాలు  2022 డిసెంబర్ 29 నుంచి  2023 జనవరి 7 వరకు 324 కోవిడ్ -19 పాజిటివ్ నమూనాలను సీక్వెన్సింగ్ కోసం 22 ఇన్సకాగ్ కేంద్రాలకు రిఫర్ చేశాయి. ప్రజల  నుంచి సేకరించిన ఈ పాజిటివ్ శాంపిల్స్కు జరిపిన  సెంటినల్ సీక్వెన్సింగ్ లో బిఎ.2 వంటి అన్ని ఓమిక్రాన్ వేరియంట్లు మరియు బిఎ .2.75, ఎక్స్ బిబి  (37), బి క్యూ.1 & బిక్యూ.1.1 (5) మొదలైన వాటితో సహా దాని ఉప-వేరియంట్ల ఉనికిని కనుగొన్నారు. ఈ వేరియంట్లను గుర్తించిన ప్రాంతాల్లో మరణాలు లేదా వ్యాప్తిలో పెరుగుదల కనిపించలేదు.

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2022 డిసెంబర్ 24 నుంచి  వివిధ విమానాశ్రయాలకు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణీకులకు ర్యాండమ్ పరీక్షలు నిర్వహించడం ప్రారంభించింది. అప్పటి నుంచి 7786 విమానాల ద్వారా 13,57,243 మంది అంతర్జాతీయ ప్రయాణీకులు భారతదేశానికి వచ్చారు. వీరిలో  29.113 మంది ప్రయాణికులను ఎంపిక చేసి ఆర్టి పీసీఆర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. వీటిలో 123 పాజిటివ్ గా తేలడంతో వాటిని హోల్ జెనోమ్ సీక్వెన్సింగ్ కోసం 13  INSACOG కేంద్రాలకు పంపడం జరిగింది. 50 నమూనాలకు జరిపిన సీక్వెన్సింగ్ లో వీటిలో ఒమిక్రాన్ మరియు ఒమిక్రాన్ ఉప రకాలు ఉన్నట్టు వెల్లడయ్యింది. అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాల్లో ప్రధానంగా ఎక్స్ బిబి(11) ,బిక్యు 1.1 (12),బిఎఫ్ 7.4.1(1) వేరియంట్లు బయటపడ్డాయి.

ఐడిఎస్పీ వ్యవస్థ ద్వారా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో కోవిడ్ వ్యాప్తి, ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య గమనిస్తూ తగిన చర్యలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది.

***


(Release ID: 1889954) Visitor Counter : 302


Read this release in: English , Urdu , Hindi , Punjabi