వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతదేశం అవకాశాల భూమి అని, ప్రవాస భారతీయులు ఈ సందేశాన్ని ప్రపంచానికి తీసుకెళ్లాలని శ్రీ గోయల్ అన్నారు
శక్తివంతమైన భారతదేశ రూపురేఖలను రూపొందించాలని భారతీయ ప్రవాసులకు పిలుపునిచ్చిన శ్రీ పీయూష్ గోయల్
కొన్ని సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది: శ్రీ గోయల్
ప్రపంచానికి భారతీయులు అందిస్తున్న సహకారాన్ని గుర్తించడానికి ప్రవాసీ భారతీయ దివస్ ఒక సందర్భం: శ్రీ గోయల్
పండుగ సందర్భాలలో కానుకగా ఇవ్వడానికి భారతదేశంలో తయారైన ఉత్పత్తులు- చేనేత మరియు హస్తకళలను కొనుగోలు చేయాలని ప్రవాసులకు శ్రీ గోయల్ పిలుపునిచ్చారు
Posted On:
09 JAN 2023 4:15PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు భారతీయ ప్రవాసులు ప్రపంచ వృద్ధికి దారితీసే మరియు విశ్వగురువుగా మారడానికి ఉద్దేశించిన భారతదేశం యొక్క ఆకృతులను అందించడానికి మరియు రూపొందించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
విదేశాలలో విశిష్టమైన సహకారం అందించినందుకు భారతీయ ప్రవాసులను ప్రశంసిస్తూ శ్రీ గోయల్ వారు ఇండియా స్టోరీ యొక్క టార్చ్ బేరర్లు అని అన్నారు. భారతీయ ప్రవాసులు పెద్ద పెద్ద సంస్థలకు నాయకత్వం వహించడానికి మరియు అనేక దేశాల ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడి భారతదేశ గొప్ప సంప్రదాయాలు మరియు సంస్కృతిని ముందుకు తీసుకు వెళ్లడం మనం గర్వించదగిన విషయమని ఆయన అన్నారు. ప్రవాస భారతీయుల విజయాల కారణంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని మరియు గౌరవించబడుతుందని ఆయన హైలైట్ చేశారు. ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మరియు గొప్ప ప్రపంచం చూస్తోందని కూడా ఆయన నొక్కి చెప్పారు. బాలి ఇండోనేషియాలో జరిగిన జి 20 సమావేశం గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ..లీడర్స్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ చేసిన కృషి మరియు నాయకత్వమే సామూహిక ప్రకటనపై అంగీకరించడానికి నాయకులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చిందని అన్నారు.
న్యూజెర్సీలో నివసిస్తున్న భారతీయులతో కలిసి ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) జరుపుకోవడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసిన శ్రీ గోయల్..భారత మాజీ ప్రధాని దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించిన పిబిడి ప్రవాసుల సహకారం గుర్తించడానికి ఒక సందర్భమని అన్నారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు భారతీయ సంప్రదాయం, సంస్కృతి, విలువల వ్యవస్థను సజీవంగా ఉంచుతున్నందుకు ప్రశంసించారు. వివిధ దేశాల్లో నివసిస్తున్న విదేశీ భారతీయులను భారతదేశ రాయబారులుగా భారతీయులు చూస్తారని ఆయన అన్నారు. యూఎస్‌ఏలోని దాదాపు 500 యునికార్న్‌ల వ్యవస్థాపకులలో 1078 మందిలో 90 మంది భారతీయ సంతతికి చెందిన వారేనన్న వాస్తవాన్ని ప్రశంసిస్తూ, ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్యం, జర్నలిజం, సాంకేతికత, నిర్వహణ వంటి వివిధ రంగాలలో భారతీయ ప్రవాసులు తమ పని ద్వారా అద్భుతమైన సామర్థ్యాన్ని స్పష్టంగా ప్రదర్శించారని శ్రీ గోయల్ అన్నారు. అటల్ జీని ఉటంకిస్తూ - "ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన వలసదారుల యొక్క ప్రతి వర్గం విజయం భారత నేల నుండి తీసుకువెళ్ళిన తిరుగులేని స్ఫూర్తికి నిదర్శనం" అని శ్రీ గోయల్ అన్నారు, భారతీయ సమాజం ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సేవా స్ఫూర్తిని పిడిబి జరుపుకుంటుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని వ్యాఖ్యలను ఉటంకిస్తూ "కేవలం పెరుగుతున్న పురోగతి సరిపోదు, నేడు రూపాంతరం అవసరం" అని శ్రీ గోయల్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం చూసిన పరివర్తన సంస్కరణలు దేశాన్ని ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాయని అన్నారు. మరికొన్ని సంవత్సరాల్లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అమెరికా మరియు భారత్ రెండూ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలని, రెండూ బలమైన బంధాలు, భౌగోళిక రాజకీయ సంబంధాలు, వ్యాపారం మరియు రెండు దేశాల ఆర్థిక శ్రేయస్సుపై భారీ ఆసక్తిని కలిగి ఉన్నాయని మంత్రి అన్నారు. ప్రవాసులు భారతదేశం మరియు యూఎస్‌ఏ మధ్య సజీవ వారధిగా పని చేస్తూనే ఉంటారని శ్రీ గోయల్ అన్నారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా డ్రైవ్ గొప్ప విజయాన్ని సాధించిందని అది ప్రతి ఇల్లు, ప్రతి దుకాణం, ప్రతి కార్యాలయానికి చేరిందన్నారు. భిన్నత్వంలో భారతదేశ ఏకత్వాన్ని తిరంగా ప్రదర్శించిందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన మరియు సంపన్న దేశంగా మార్చాలనే 1.4 బిలియన్ల భారతీయుల సమిష్టి ఆకాంక్షను ఇది ప్రతిబింబిస్తున్నాయని శ్రీ గోయల్ గత సంవత్సరం తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి చేసిన 5 సూత్రాలను ప్రస్తావించారు. రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి భారతదేశం యొక్క ప్రయాణంలో భాగంగా ఈ సూత్రాలను తమ మిషన్‌గా ప్రాధాన్యపరచాలని ఆకాంక్షించారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో భారతదేశం అన్ని సవాళ్లను చిత్తశుద్ధితో మరియు దృఢ సంకల్పంతో ఎదుర్కొందని, ఆ సవాళ్లను అవకాశాలుగా మార్చుకుందని శ్రీ గోయల్ అన్నారు. భారతదేశం నేడు దేశీయంగా అభివృద్ధి చేసిన 6 కోవిడ్ వ్యాక్సిన్‌లను కలిగి ఉంది, ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచిందని తెలిపారు. లాక్ డౌన్ తర్వాత భారత్ కూడా త్వరగానే పుంజుకుందన్నారు. గత ఏడాది వృద్ధి, ఎఫ్‌డిఐ, ఎగుమతుల పరంగా భారత్ అద్భుత విజయాన్ని సాధించిందని కూడా ఆయన పేర్కొన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం 800 మిలియన్ల భారతీయులకు ఆహారధాన్యాలను అందించడం కొనసాగించిందని, ఒక్క భారతీయుడు కూడా ఆకలితో నిద్రపోకుండా చూసుకుందని ఆయన అన్నారు.
శ్రీ గోయల్ ఈ రోజు భారతదేశం అవకాశాల భూమి అని హైలైట్ చేసారు మరియు ప్రవాసులు తమ సహకారం కొనసాగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
భారతదేశం గొప్ప సూపర్ పవర్. భారతదేశం దాని పెద్ద దేశీయ వినియోగ డిమాండ్, ప్రజాస్వామ్యం, చట్ట నియమం మరియు పారదర్శక ఆర్థిక వ్యవస్థ కారణంగా భారీ అవకాశాలను అందిస్తుంది. మీ వ్యాపారంలో సరఫరా గొలుసులు, పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలలో భారతదేశం మీ విశ్వసనీయ భాగస్వామిగా ఉండగలదని ఈ సందేశాన్ని ప్రపంచానికి అందజేయాలని ఆయన ప్రతి ఒక్కరినీ కోరారు.
ఈ సందర్భంగా శ్రీ గోయల్ పలు అంశాలపై పిలుపునిచ్చారు:
- ప్రతి ఒక్కరూ తాము చేసే ప్రతి పనిలో అధిక నాణ్యతను తీసుకురావాలని ఆకాంక్షించమని ప్రోత్సహించండి.
- వివిధ పండుగలు, బహుమతులు అందించే సందర్భాల్లో భారతదేశం తయారు చేసిన చేనేతలు/ హస్తకళలు వంటి ఉత్పత్తులను కొనండి
- యూఎస్‌ఏలోని పెట్టుబడిదారులకు భారతదేశ పెట్టుబడి అవకాశాలను అందించండి.
- గొప్ప స్థాయి దాతృత్వం, జ్ఞాన బదిలీలు మరియు భారతదేశానికి ఆవిష్కరణలను తీసుకెళ్లడం ద్వారా భారతదేశ వృద్ధి కథనానికి సహకరించండి.
****
(Release ID: 1889897)
Visitor Counter : 468