ఉప రాష్ట్రపతి సచివాలయం
83వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సును ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి
Posted On:
09 JAN 2023 2:33PM by PIB Hyderabad
జైపూర్లో 11 జనవరి, 2023న నిర్వహించనున్న 83వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ శ్రీ జగదీప్ జగదీప్ ధన్కర్ ప్రారంభించి ప్రసంగించనున్నారు. ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (ఏఐపీఓసీ) అనేది 2021లో వంద సంవత్సరాలను పూర్తి చేసుకున్న.. భారతదేశంలోని చట్టసభల అత్యున్నత బాడీ. సిమ్లాలో 2021లో జరిగిన 82వ ఏఐపీఓసీ ప్రారంభ సెషన్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. 1921 ఏడాది సిమ్లాలో ఈ బాడీ మొదటి సమావేశం జరిగింది. జైపూర్లోఈ సదస్సు నిర్వహించడం ఇది నాలుగోసారి. త్వరలో నిర్వహించనున్న 83వ సెషన్ చర్చలలో భాగంగా సమకాలీన ఔచిత్యం యొక్క క్రింది ఇతివృత్తాలపై దృష్టి సారించనుంది.
i. ప్రజాస్వామ్యానికి తల్లిగా జి-20లో భారత నాయకత్వం.
ii. పార్లమెంటు మరియు శాసనసభలను మరింత ప్రభావవంతంగా, జవాబుదారీగా మరియు ఉత్పాదకంగా మార్చాల్సిన అవసరం.
iii. డిజిటల్ పార్లమెంట్‌తో రాష్ట్ర శాసనసభల ఏకీకరణ
iv. i. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా శాసనసభ మరియు న్యాయవ్యవస్థ మధ్య సామరస్య సంబంధాన్ని కొనసాగించాల్సిన అవసరం
ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేయనున్నారు.
లోక్సభ స్పీకర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, అన్ని రాష్ట్రాల శాసనసభల ప్రిసైడింగ్ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
****
(Release ID: 1889896)
Visitor Counter : 223