హోం మంత్రిత్వ శాఖ
ఢిల్లీ విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల క్రమబద్ధీకరణపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష
-అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహణ
प्रविष्टि तिथि:
09 JAN 2023 5:03PM by PIB Hyderabad
ఢిల్లీ విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల క్రమబద్ధీకరణను సమీక్షించేందుకు.. ప్రధాన భాగస్వామ్య పక్షాలవారితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి; ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్; బీసీఏఎస్ డీజీ; బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, ఢిల్లీ పోలీస్, డైయల్ జీఎంఆర్ మరియు వివిధ భద్రతా ఏజెన్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 15 డిసెంబర్ 2022న జరిగిన గత చివరి సమీక్షా సమావేశం నుండి వివిధ విషయాలలో సామర్థ్యాలను స్థిరంగా పెంచడం జరిగిందని అధికారులు ఈ సమావేశానికి తెలియజేయబడింది. ఇటీవలి కాలంలో తీసుకున్న అనేక ముఖ్యమైన చర్యలు:
i. ఎయిర్ స్లాట్ల నిశిత పర్యవేక్షణ మరియు సవరించిన షెడ్యూల్ వల్ల విమానాల బంచింగ్ సంఘటనలు తగ్గాయి.
ii. త్వరిత ఇమ్మిగ్రేషన్ను సులభతరం చేయడానికి, తగినంత సిబ్బందిని పోస్టింగ్ చేయడంతో పాటు అదనపు కౌంటర్లు కూడా పని చేస్తున్నాయి. డొమెస్టిక్ బేలో సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా బ్యాగేజీ స్కానర్లను పెంచారు.
iii. ట్రాఫిక్ లేన్ నిర్వహణ కోసం ఢిల్లీ పోలీసులు సిబ్బంది మోహరింపును పెంచింది.
వాటాదారుల కమిటీ మూల్యాంకనం ఆధారంగా, డైయల్ జీఎంఆర్ ఇమ్మిగ్రేషన్ బే కోసం ఆధునిక లేఅవుట్ ప్లాన్ను సవరించింది. ఈ విషయాన్ని సమావేశంలో తెలియజేయబడింది. ఇమ్మిగ్రేషన్ బే చిందరవందరగా ఉండకుండా వాక్వేస్లో డాక్యుమెంటేషన్ మరియు బయోమెట్రిక్స్ బూత్ల ఏర్పాటు ప్రతిపాదనలో ఉంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమన్వయంతో వ్యవహరిస్తామని భాగస్వామ్య పక్షాలు హామీ ఇచ్చాయి. ఢిల్లీ విమానాశ్రయాలలో విమానాల బయలుదేరుట, రాకపోకలను క్రమబద్ధీకరించడంలో వేగాన్ని కొనసాగించాలని వాటాదారులను అభ్యర్థించారు.
*****
(रिलीज़ आईडी: 1889895)
आगंतुक पटल : 200