ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎయిమ్స్ భువనేశ్వర్‌లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ బాడీ ఆఫ్ ఆల్ ఎయిమ్స్ 6వ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా


అత్యుత్తమ నాణ్యత, క్లినికల్ కేర్, అత్యున్నత ప్రమాణాలు గల వైద్య విద్య, అత్యాధునిక పరిశోధనలతో గ్లోబల్ ఎక్సలెన్స్ ఇన్‌స్టిట్యూట్‌లుగా ఎయిమ్స్‌లన్నీ రూపాంతరం చెందుతున్నారు: డాక్టర్ మాండవ్య

ఐఐటీ మరియు ఐఐఎం వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇతర సంస్థల నుండి నేర్చుకునేలా ఎయిమ్స్‌ల ప్రతినిధులను ప్రోత్సహించారు

Posted On: 08 JAN 2023 8:16PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు ఇక్కడ జరిగిన ఆల్ న్యూ ఎయిమ్స్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ బాడీ (సిఐబి) 6వ సమావేశంలో ప్రసంగించారు. ఆయనతో పాటు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, పార్లమెంటు సభ్యులు డాక్టర్ అనిల్ జైన్, పార్లమెంటు సభ్యులు శ్రీ రమేష్ భిదూరి మరియు నీతి ఆయోగ్ సభ్యులు (హెల్త్‌) డాక్టర్ వి.కె. పాల్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బహ్ల్, హెల్త్ సైన్సెస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయెల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఐబి అనేది ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఖాళీలు, రిక్రూట్‌మెంట్, విధానాల అమలు, సవాళ్లు మరియు సేకరణ కోసం అన్ని ఎయిమ్స్‌లకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే సంస్థ. మునుపటి సిఐబి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సమీక్షించడమే నేటి సిఐబి సమావేశ ఎజెండా.
 

image.png

 

ఢిల్లీ వెలుపల జరిగిన మొదటి సిఐబి సమావేశానికి ఎయిమ్స్‌ ప్రతినిధులు, ప్రముఖ నిపుణులు మరియు ప్రత్యేక ఆహ్వానితులతో సహా పాల్గొనే వారందరినీ స్వాగతిస్తూ డాక్టర్ మాండవ్య మాట్లాడుతూ “ఈ సిఐబి మునుపటి నిర్ణయాల సమ్మతిని సమీక్షించడానికి మాత్రమే కాకుండా  కార్యక్రమంలో పాల్గొనే వారందరి గొప్ప అనుభవం మరియు నైపుణ్యం ఆధారంగా తాజా ఆలోచనలు, వినూత్న ఆలోచనలు మరియు సూచనలు సమీకరించడానికి చింతన్ శివిర్ అని అన్నారు. ఎయిమ్స్‌లన్నీ తృతీయ సంరక్షణకు సంబంధించిన కీలకమైన జాతీయ సంస్థలు అని వాటిని గ్లోబల్ ఎక్సలెన్స్ ఇన్‌స్టిట్యూట్‌లుగా తీర్చిదిద్దడమే తమ దృష్టి అని ఆయన నొక్కి చెప్పారు. అత్యుత్తమ నాణ్యత, క్లినికల్ కేర్, అత్యున్నత ప్రమాణాల వైద్య విద్య మరియు అత్యాధునిక పరిశోధనలతో మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆయన నొక్కి చెప్పారు.

 

image.png

 

పెద్ద సహకార సంస్థ 'సంవాద్' కోసం ఆలోచనలను రేకెత్తించే ఆలోచనలు మరియు పరిష్కారాల వేదికను అందిస్తూ "ఐఐటీలు మరియు ఐఐఎంల వంటి ఇతర జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల నుండి నేర్చుకునేలా" ప్రముఖులను ప్రోత్సహించారు.

ఏఐ కోసం మెటాడేటాను రూపొందించడం మరియు ఉన్నతమైన ఫలితాలను అందించగల వృత్తిపరమైన పని సంస్కృతి యొక్క ఆవశ్యకతను హైలైట్ చేస్తూ కేంద్ర మంత్రి ఎయిమ్స్‌  డైరెక్టర్లందరి పనితీరు యొక్క వినూత్న నమూనాలను రూపొందించి వాటిని తదుపరి సిఐబి సమావేశంలో ప్రదర్శించమని ప్రోత్సహించారు. ఎయిమ్స్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటితో పోటీపడేలా చేసేందుకు అధికారులందరూ పట్టుదలతో కృషి చేయాలని ఆయన కోరారు.

గత సిఐబి సమావేశాల సిఫార్సుల ఆధారంగా ఎయిమ్స్‌లు చేసిన పనిని డాక్టర్ మాండవ్య అభినందించారు. గుర్తించబడిన అభివృద్ధి డొమైన్‌లపై సహకారంతో పని చేయాలని మరియు వాటిపై వివరణాత్మక నివేదికలను రూపొందించాలని ఆయన ప్రముఖులను కోరారు. నేటి సమావేశంలో చర్చించిన ముఖ్యమైన అంశాలపై మరింత మేధోమథనం చేయాలని కూడా ఆయన సూచించారు. "భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో మనం సమిష్టిగా కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పాలి" అని ఆయన అన్నారు.

 

image.png

 

సిఐబి సమావేశానికి అధ్యక్షత వహించే ముందు, కేంద్ర ఆరోగ్య మంత్రి రోగుల సేవలను అంచనా వేయడానికి ఎయిమ్స్‌ భువనేశ్వర్ పనితీరును సమీక్షించారు మరియు అక్కడ ఉన్న లబ్ధిదారులతో సంభాషించారు.

 

image.png

 

డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఎయిమ్స్ బ్రాండ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని హైలైట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన వైద్య సంస్థల పనితీరు నమూనాను అధ్యయనం చేయాలని మరియు స్థానికంగా ఉత్తమ విధానాలను అమలు చేయాలని ఆమె ప్రతినిధులను కోరారు. ఏబిహెచ్‌ఏ ఐడీలు మరియు ఇతర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని కూడా ఆమె సూచించారు.

 

image.png


మునుపటి చింతన్ శివిర్ సిఫార్సులను అనుసరించడం మరియు అన్ని కొత్త ఎయిమ్స్‌ల పనితీరుపై వివరణాత్మక చర్చలు జరిగాయి. పిఎంఎస్‌ఎస్‌వై కింద కొత్త ఎయిమ్స్‌ అవలోకనం, సస్టైనబుల్ ఫైనాన్షియల్ మోడల్, పేషెంట్ సంతృప్తిని పెంపొందించడం మరియు ఐసీటిని ఎనేబుల్‌ చేయడం మేనేజ్‌మెంట్ మరియు గవర్నెన్స్ పారాడిగ్‌లు & మేనేజ్‌మెంట్ హ్యూమన్ రిసోర్సెస్, మేనేజింగ్ ఎకానమీస్ ఆఫ్ ప్రొక్యూర్‌మెంట్, విజన్ 2030, కొల్లాబోర్ రీసెర్చ్ మరియు కొల్లా ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు 5వ సిఐబి సమావేశంలో మిగిలిన ఎజెండాలను అనుసరించడం వంటి అంశాలు ఇందులో చర్చించబడ్డాయి.

తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేయడానికి మరియు సూచనలను పంచుకోవడానికి వీలుగా మరియు ఆలోచనలను రేకెత్తించే పద్ధతిలో నిర్వహించబడిన ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్‌కు తమను ఆహ్వానించినందుకు పాల్గొనేవారు కేంద్ర ఆరోగ్య మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వారికి గొప్ప అభ్యాస అనుభవాన్ని అందించినందుకు వారు తమ ప్రశంసలను కూడా వ్యక్తం చేశారు.

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏఎస్ మనోహర్ అగ్నానీ, శ్రీ జైదీప్ కుమార్ మిశ్రా,ఏఎస్ మరియుఎఫ్‌ఏ జీఓఎల్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డాక్టర్ ఎన్‌ కె అరోరా, ఎయిమ్స్‌ డియోగర్ అధ్యక్షుడు, డాక్టర్ ప్రమోద్ గార్గ్, ఎయిమ్స్‌ అవంతిపోరా అధ్యక్షుడు, డాక్టర్ చిత్ర సర్కార్, ఎయిమ్స్‌ అధ్యక్షురాలు కళ్యాణి, ప్రొఫెసర్‌ విజయ్‌ కుమార్‌ శుక్లా, బనారస్‌ హిందూ యూనివర్సిటీ రెక్టార్‌, వైస్‌ ఛాన్సలర్‌, సీనియర్‌ అధికారులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌, ఎయిమ్స్‌, నిమ్‌హాన్స్‌, ఐసిఎంఆర్‌ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

****


(Release ID: 1889668) Visitor Counter : 164


Read this release in: English , Urdu , Marathi , Hindi , Odia