సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

సంగీతం మరియు నాట్య పరంపరపై 'ధార'ను నిర్వహించిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు విద్యా మంత్రిత్వ శాఖ

Posted On: 07 JAN 2023 4:23PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:
మన ప్రదర్శన కళా సంప్రదాయాలను పునరుజ్జీవింపజేసేందుకు మరియు ప్రాచుర్యం కల్పించేందుకు మరియు ఈ  వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించేందుకు విజన్ డాక్యుమెంట్ 2047ను రూపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు విద్యా మంత్రిత్వ శాఖ బృహత్, ప్రాచ్యం మరియు సంగం చర్చల సహకారంతో తమిళనాడు తంజావూరులోని శాస్త్రా (డీమ్డ్-టు-బి యూనివర్శిటీ)లో 2023 జనవరి 5-6 తేదీల్లో సంగీత మరియు నాట్య పరంపరపై ధారను నిర్వహించాయి.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో భారతీయ నాలెడ్జ్ సిస్టమ్‌ల బహుళ డొమైన్‌లపై అవగాహన కల్పించడానికి, సంరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి జరిగే సమావేశాల శ్రేణి ధారా.

మన ప్రదర్శన కళా సంప్రదాయాలను పునరుజ్జీవింపజేసేందుకు మరియు ప్రాచుర్యం పొందేందుకు మరియు ఈ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించేందుకు విజన్ డాక్యుమెంట్ 2047ను రూపొందించడం ఈ ఈవెంట్ లక్ష్యం.

ముఖ్య అతిథి డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం (ప్రెసిడెంట్, నృత్యోదయ), ప్రొఫెసర్ గంటి ఎస్ మూర్తి (నేషనల్ కో-ఆర్డినేటర్, ఐకెఎస్ డివిజన్), డాక్టర్ ఆర్.చంద్రమౌళి (రిజిస్ట్రార్, శాస్త్రా యూనివర్సిటీ), సంస్కృతి మంత్రిత్వ శాఖ నుండి  శ్రీ శ్రీనివాసన్ అయ్యర్ మరియు ప్రొఫెసర్ అనురాధ చౌదరి (అవుట్‌రీచ్ కో-ఆర్డినేటర్, ఐకెఎస్ డివిజన్) వంటి ప్రముఖుల సమక్షంలో ఈ ధార కార్యక్రమం ప్రారంభమైంది.

డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం కార్యక్రమంలో కీలకోపన్యాసం చేశారు. భారతదేశ సుసంపన్నమైన  వారసత్వ వైభవాన్ని, మనం ఎదుర్కొంటున్న ఆందోళనలను మరియు మన ప్రదర్శన కళల కోసం ముందున్న రోడ్‌మ్యాప్‌ను క్లుప్తంగా వివరించారు. భారతీయ కళలు మనలోని దైవిక అంతర్లీనాన్ని గ్రహించే మార్గమని ఆమె నొక్కి చెప్పారు. దేశంలోని యువత సంస్కృతి పట్ల మమకారం పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మన కళారూపాలను గౌరవించే కళాకారులుగా వికసించారని ఆమె అన్నారు.

తరువాతి రెండు రోజుల పాటు జరిగిన వరుస ప్యానెల్ చర్చలలో దేశం నలుమూలల నుండి ప్రముఖ అభ్యాసకులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు మరియు విద్యావేత్తలు సంగీత్ మరియు నృత్యాలలో కర్ణాటక, హిందుస్థానీ మరియు లోక (గాత్ర మరియు వాయిద్య) పరంపరలకు ప్రాతినిధ్యం వహించారు.

శ్రీ కన్నన్ బాలకృష్ణన్ మరియు బృందం నేతృత్వంలోని జుగల్బందీ, సంగీత పరంపరకు ప్రాతినిధ్యం వహిస్తున్న సునాద్ నాట్య పరంపరకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ తోక్‌చోమ్ టోలెన్ మైతేయిచే మణిపురి నృత్య ప్రదర్శన మరియు డాక్టర్ రేవతి సకల్కర్ నేతృత్వంలో సంగీత ప్రదర్శన వంటివి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్ధులను  మంత్రముగ్ధులను చేశాయి.

ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు మరియు కాన్ఫరెన్స్ వక్తలు రాబోయే సంవత్సరాల్లో పని చేయడానికి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. మరియు భారతదేశ పురాతన ప్రదర్శన కళలకు ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికారు. ఇవి అధికారిక శ్వేతపత్రం "సంగీతం మరియు నాట్య పరంపర కోసం ధార - విజన్ 2047" పేరుతో సమర్పించబడతాయి.


 

****



(Release ID: 1889495) Visitor Counter : 165