వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
గత 8 సంవత్సరాలలో చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు భారత దేశం
ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థ లలో ఒకటిగా ఎదిగేందుకు దోహద పడతాయి: శ్రీ గోయల్
మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్ , దేశీయ తయారీ రంగాలు భారత దేశ వ్యూహాత్మక ప్రాధాన్య రంగాలలో కొన్ని: శ్రీ గోయల్
నిబంధనల ఆధారిత క్రమం, పారదర్శక ఆర్థిక వ్యవస్థలతో సమాన ఆలోచనలు కలిగిన దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం పట్ల భారత్ ఆసక్తి: శ్రీ గోయల్
నాణ్యత ప్రాముఖ్యతను గుర్తించి, విలువ ఇచ్చే మనస్తత్వం భారతదేశానికి అవసరం : శ్రీ గోయల్
వార్టన్ ఇండియా ఎకనామిక్ ఫోరం 27వ ఎడిషన్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విస్తృత అంశాలపై మాట్లాడిన
శ్రీ గోయల్
प्रविष्टि तिथि:
07 JAN 2023 2:28PM by PIB Hyderabad
గత ఎనిమిది సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు
భారత దేశం ప్రపంచం లోని మూడు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ లలో
ఒకటిగా ఎదిగేందుకు దోహద పడతాయని కేంద్ర వాణిజ్య , పరిశ్రమల, వినియోగ దారుల వ్యవహారాల , ఆహార , ప్రజా పంపిణీ, జౌళి శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ విశ్వాసం వ్య క్తం చేశారు.
వార్టన్ ఇండియా ఎకనామిక్ ఫోరం 27వ ఎడిషన్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. అనిశ్చితి యుగంలో భారతదేశం అగ్రగామి ఆవిష్కరణ అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరిగింది.
రాబోయే సంవత్సరాలలో భారతదేశ వృద్ధి గాథకు మార్గం సుగమం చేసే అత్యంత ప్రభావవంతమైన ఆర్థిక సంస్కరణల గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, గత ఎనిమిది సంవత్సరాలలో జరిగిన అనేక నిర్మాణాత్మక మార్పులు భారత ఆర్థిక వ్యవస్థ పురోగమించే దిశగా గణనీయమైన ప్రభావాన్ని చూపాయని అన్నారు.
జి ఎస్ టి ని ముఖ్యమైన సంస్కరణలలో ఒకటి గా పేర్కొంటూ, ప్రపంచంలో సవాళ్ల తో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ
ఇటీవల జి ఎస్ టి వసూళ్లు చాలా పటిష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
భారతదేశం ఇప్పుడు మరింత నిజాయితీ, పారదర్శక ఆర్థిక వ్యవస్థ అని, ప్రజలు ఇప్పుడు తమ పన్నులు చెల్లించడానికి అలవాటు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబిసి) కూడా ఒక ముఖ్యమైన సంస్కరణ చర్య అని, దీని ఫలితంగా భారతదేశంలో బలమైన బ్యాంకింగ్ వ్యవస్థలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు.
ఈ బ్యాంకులు పరిశ్రమలు వృద్ధి చెందడానికి వనరులను అందించగలిగాయి. ప్రైవేటీకరణ, ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఆర్థిక రంగం డిజిటలైజేషన్, , చట్టాల డిక్రిమినలైజేషన్, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి నిబంధనలను సరళీకృతం చేయడం వంటి సంస్కరణలను కూడా ఆయన ప్రస్తావించారు.
ప్రభుత్వానికి వ్యూహాత్మక ప్రాధాన్యతలు ఏ రంగాలు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్, దేశీయ తయారీ ప్రాధాన్యతా రంగాలలో కొన్ని అని శ్రీ గోయల్ చెప్పారు. భారత దేశంలో బలమైన మౌలిక సదుపాయాలను నిర్మించడంపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించారని ఆయన అన్నారు.ప్రైవేటు రంగం కూడా ఈ ప్రయత్నంలో సహకరిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థకు సెమీకండక్టర్ మరో కీలకమైన రంగం అని శ్రీ గోయల్ అన్నారు. మరో ముఖ్యమైన రంగం దేశీయ తయారీ అని, 14కి పైగా రంగాలలో భారతీయ తయారీని ప్రారంభించడానికి ప్రభుత్వం పిఎల్ఐ పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు.
ప్రభుత్వం నుండి ఏ రంగాలలో తమకు ఏ మద్దతు అవసరమో నిర్ణయించుకునేలా ప్రైవేటు రంగం / పరిశ్రమల సంఘాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
రష్యా, పాశ్చాత్య దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాతావరణంపై తన అభిప్రాయాలను పంచుకున్న శ్రీ గోయల్, నేటి శకం యుద్ధ యుగం కాకూడదనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి చర్చలు, దౌత్యం మాత్రమే మార్గమని భారతదేశం విశ్వసిస్తుందని, వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రధాని మోదీ ప్రపంచ నాయకులతో అనేకసార్లు చర్చలు జరిపారని ఆయన గుర్తు చేశారు.
బాలిలో జరిగిన జి 20 సమావేశంలో ఏకాభిప్రాయాన్ని పొందడానికి ప్రయత్నించడంలో భారతదేశం కీలక పాత్ర పోషించింది. ప్రధాని మోదీ జోక్యం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు జి 20 లో ఒక ఫలితానికి రాగలిగాయని, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారాలను కనుగొనడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భారత దేశంలో ప్రభుత్వం ఆహార ధాన్యాలు, ఇంధనం, సమర్థమైన విత్తనాలు, తగినంత ఎరువులను అందుబాటు లోకి తీసుకురావడం ద్వారా సామాన్య ప్రజల అవసరాలను తీర్చడం పై దృష్టి సారించిందని శ్రీ గోయెల్ చెప్పారు.
గత ఐదు సంవత్సరాలలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడంపై. భారత దేశం ప్రత్యేక దృష్టి సారించినట్లు శ్రీ గోయల్ తెలిపారు. భారతదేశం నేడు గత నీడల నుండి బయటపడిందని అన్నారు. వాటాదారులందరికీ ప్రయోజనం
చేకూర్చేవి కాకున్నా బహుళ పక్ష ఒప్పందాలు తరచూ ఆర్థిక భాగస్వామ్యాలకు దోహద పడతాయని గుర్తించినట్టు చెప్పారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్ సిఇపి) నుండి భారతదేశం వైదొలగడాన్ని ఆయన ఉదహరించారు, ఎందుకంటే ఇది చాలా అన్యాయమైన, అసమతుల్య ఒప్పందం అని పేర్కొన్నారు. ఇరు దేశాల ఉత్తమ ప్రయోజనాల దృష్ట్యా సమతుల్యమైన ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడమే భారతదేశ ఆసక్తి అని ఆయన అన్నారు. భావసారూప్యత కలిగిన దేశాలతో ముఖ్యంగా నియమాల ఆధారిత క్రమం, పారదర్శక ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలతో పరస్పర ప్రయోజనదాయక ఒప్పందాలను కుదుర్చుకుంటున్నామని
తెలిపారు.
కోవిడ్ మహమ్మారి నుండి నేర్చుకున్న పాఠాల గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, మన ఆరోగ్య మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేయడం ,విస్తరించడం అత్యంత ప్రాధాన్యత గా మారిందని అన్నారు. ప్రభుత్వం ఆసుపత్రి మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరిచిందని, ఐసియు పడకలను, ఆక్సిజన్ సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచిందని, దేశంలోని వైద్య కళాశాలల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసిందని ఆయన చెప్పారు. ఆరోగ్య కార్యకర్తలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణపై కూడా దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రపంచం లోనే అతి పెద్ద భారత దేశ ఉచిత ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం గురించి కూడా ఆయన ప్రస్తావించారు, దీనిలో ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం ద్వారా భారత దేశంలో 500
మిలియన్ ల మంది ప్రజల ఉచిత ఆరోగ్య సంరక్షణకు అర్హులు.
స్థితిస్థాపక సరఫరా గొలుసుల ప్రాముఖ్యతను గుర్తించడం మరొక నేర్చుకున్న పాఠం అని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి సమయంలో అత్యుత్తమ ప్రయత్నాలు చేసినప్పటికీ పీపీఈలు వంటి కీలకమైన పరికరాల కోసం దేశం శ్రమపడాల్సివచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ రంగాలన్నింటిలో భారత దేశ సామర్థ్యాల ను బలోపేతం చేయడంపై ప్రభుత్వం
ప్రస్తుతం దృష్టి సారిస్తోందని ఆయన చెప్పారు. ఈ సవాళ్ళు భారత దేశ
భవిష్యత్తు వృద్ధి గాథ కు అవకాశాలుగా మారాయని ఆయన వివరించారు. మన భారతీయ పరిశ్రమ నిజంగా ఈ సందర్భానికి అనుగుణంగా ఎదిగింది, ఇంకా భారతదేశం ఇప్పుడు వ్యక్తిగత రక్షణ పరికరాల తయారీదారుగా కూడా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత దేశం ఒక ధృఢమైన, నిబంధనల ఆధారిత వ్యవస్థను నమ్మే
పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసం మౌలిక సదుపాయాలను, పర్యావరణాన్ని నిర్మించడంపై దృష్టి సారించిందని
ఆయన చెప్పారు. నిర్మాణాత్మక సంస్కరణలు, భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటైజేషన్, ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న భారీ ప్రతిభపై దృష్టి సారించామని, ఇది భారతదేశ భవిష్యత్తును తిరిగి వ్రాయడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
రాబోయే 25 ఏళ్లలో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాల గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, నాణ్యత ప్రాముఖ్యతను గుర్తించి, విలువ ఇచ్చేలా జాతి మనస్తత్వాన్ని మార్చడం అతిపెద్ద సవాళ్లలో ఒకటి కాబోతోందని అన్నారు.
ఇది భారత దేశ భవిష్యత్తును నిర్వచించే అంశంగా ఆయన అభివర్ణించారు. డిజిటలైజేషన్ పై దృష్టి సారించి, భారతదేశాన్ని నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వం తయారీ రంగానికి మద్దతు ఇవ్వడం కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. భారతదేశం డిజిటల్ గా 74 బిలియన్లకు పైగా ఆర్థిక లావాదేవీలను చేసిందని, ఇది యూరప్, యుఎస్, చైనాల కంటే ఎక్కువ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల అవసరాలను తీర్చగల అత్యున్నత నాణ్యత, అధిక సాంకేతిక పరిజ్ఞానం, అధిక సేవా ఆధారితంగా పనిచేసే దిశగా దేశం మనస్తత్వాన్ని పొందడం సవాల్ అని ఆయన అన్నారు.
*****
(रिलीज़ आईडी: 1889494)
आगंतुक पटल : 245