ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

రేపు డిజిటల్ ఇండియా అవార్డులు- 2022 ప్రదానం చేయనున్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

Posted On: 06 JAN 2023 12:36PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

జనవరి 7, 2023 (శనివారం) న న్యూఢిల్లీ లో 2022 సంవత్సరం డిజిటల్ ఇండియా అవార్డులను విజేతలకు ప్రదానం చేస్తారు.

భారత దేశాన్ని డిజిటల్ సాధికార

సమాజంగా, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టింది. డిజిటల్ ఇండియా అవార్డులు (https://digitalindiaawards.gov.in) అన్ని స్థాయిలలో ప్రభుత్వ సంస్థల వినూత్న డిజిటల్ చొరవలను ప్రోత్సహిస్తాయి. గౌరవిస్తాయి. డిజిటల్ ఇండియా విజన్ ను నెరవేర్చడంలో ప్రభుత్వ సంస్థలే కాకుండా స్టార్టప్ లు, అట్టడుగు స్థాయి డిజిటల్ చొరవలను కూడా ప్రేరేపించడం, స్ఫూర్తి నివ్వడం డిజిటల్ ఇండియా అవార్డులు-2022

(డి ఐ ఎ 2022) లక్ష్యం.

 

న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్ర మానికి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క మ్యూనికేషన్స్ , రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ , ఎల క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి

శ్రీ అల్కేశ్ కుమార్ శర్మ, ఇతర ప్రముఖులు హాజరవుతారు.

 

ఈ కార్యక్రమం 7 జనవరి 2023 న ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతుంది.  దూరదర్శన్  ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇంకా ఎన్ఐసి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ లపై కూడా లైవ్ స్ట్రీమింగ్ (ప్రత్యక్ష ప్రసారం) అవుతుంది.

 

ఎన్ ఐ సి వెబ్ కాస్ట్ - http://webcast.gov.in/digitalindiaawards

 

యూ ట్యూబ్ - https://www.youtube.com/nationalinformaticscentre

 

ట్విట్టర్-

https://twitter.com/NICMeity

 

ఫేస్ బుక్ - https://www.facebook.com/NICIndia

 

నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా (https://india.gov.in) ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా అవార్డులు ఏర్పాటు అయ్యాయి. ఇది అన్ని స్థాయిలలో భారత ప్రభుత్వ సంస్థలు అందించే సమాచారం, సేవలకు సింగిల్ విండో ప్రాప్యతను అందిస్తుంది. భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) కు చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) నేషనల్ పోర్టల్ రూపకల్పన, అభివృద్ధి  చేసి నిర్వహిస్తోంది.

 

డిజిటల్ ఇండియా అవార్డులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని అవార్డుల డైరెక్టర్ జనరల్ నిర్వహించే రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in) ద్వారా ప్రభుత్వ సంస్థల డిజిటల్ చొరవలను నామినేట్ చేస్తారు. అన్ని జాతీయ అవార్డుల నిర్వహణ కోసం గౌరవ ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు ఏకీకృత పోర్టల్ ను అభివృద్ధి చేసి నిర్వహిస్తున్నారు. దీని తరువాత నామినేషన్ ల ప్రాసెసింగ్ భాగస్వామి అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ఢిల్లీ ఎంట్రీలకు ర్యాంకింగ్ ఇస్తుంది. ప్రభుత్వం, పరిశ్రమ , విద్యావేత్తల ప్రాతినిధ్యంతో ఎంఇఐటివై కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు ఆయన చేసిన జ్యూరీ విజేతలను ఎంపిక చేస్తుంది. .

 

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాలు / సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు / కార్యాలయాలు / సంస్థలు, జిల్లా పాలనా యంత్రాంగాలు ఇంకా విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ఈ అవార్డులకు దరఖాస్తు చేయడానికి అర్హులు.

 

అవార్డుల 7 వ ఎడిషన్ ను ఈ క్రింది ఏడు విభాగాల క్రింద ప్రకటించారు:

 

1.పౌరుల డిజిటల్ సాధికారత: విశ్వవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా గుర్తించడం, డిజిటల్ వనరులను ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేయడం, భాగస్వామ్య పాలన ,డిజిటల్ అక్షరాస్యతలో సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా జీవన సౌలభ్యం మెరుగుపడుతుంది.

 

 

పురస్కారం

విజేతలు

ప్లాటినం

-నామ్ (వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ)

గోల్డ్

ట్రాన్స్ పోర్ట్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ (ఇ-ట్రాన్స్ పోర్ట్) (రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ)

సిల్వర్

తీర్పు శోధన పోర్టల్ (ఇ-కమిటీ, సుప్రీంకోర్టు)

 

2.అట్టడుగు స్థాయిలో డిజిటల్ చొరవలు: పంచాయితీ, స్థానిక సంస్థ ,ఉప-జిల్లా స్థాయిలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఉపాధి, కార్మిక, నైపుణ్యం మొదలైన రంగాలలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించే చొరవలను గుర్తించడం, ఉదా. ఎ ఐ, బ్లాక్ చెయిన్, డ్రోన్ లు,

ఐ ఒ టి,ఎంఎల్ , జి ఐ ఎస్ మొదలైనవి.

 

 

పురస్కారం

విజేతలు

ప్లాటినం

-వివేచన యాప్ (మధ్యప్రదేశ్)

గోల్డ్

డిఇజిఎస్ కంప్యూటర్ బేసిక్ ట్రైనింగ్ (జార్ఖండ్)

సిల్వర్

క్షీరశ్రీ పోర్టల్ (కేరళ)

 

3. సులభ వ్యాపారం కోసం డిజిటల్ చొరవలు: వ్యాపార కార్యకలాపాలను ఏర్పాటు చేయడం, నిర్వహించడం, ఆపరేట్ చేయడంలో సమయం, ఖర్చులు, ప్రయత్నాలను తగ్గించడం ద్వారా గణనీయమైన ప్రభావాన్ని సృష్టించే డిజిటల్ చొరవలను గౌరవించడం.

 

పురస్కారం

విజేతలు

ప్లాటినం

మై మిత్రా (ఉత్తర ప్రదేశ్)

గోల్డ్

ఇఅబ్కారీ (ఒడిశా)

సిల్వర్

ఇన్వెస్ట్ పంజాబ్ (పంజాబ్)

 

4.సామాజిక ఆర్థికాభివృద్ధి కోసం డేటా భాగస్వామ్యం-ఉపయోగం: విశ్లేషణ, నిర్ణయం తీసుకోవడం, ఆవిష్కరణ, ఆర్థిక అభివృద్ధి ,ప్రజా శ్రేయస్సు కోసం దేశంలో శక్తివంతమైన డేటా పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి మంత్రిత్వ శాఖలు / విభాగాలు / సంస్థలు, రాష్ట్రాలు, స్మార్ట్ నగరాలు , పట్టణ స్థానిక సంస్థలు ప్రభుత్వ డేటాను కేంద్ర యంత్రాంగం (రిపోజిటరీక) తో పంచుకోవడానికి గుర్తింపు

 

పురస్కారం

విజేతలు

ప్లాటినం

స్మార్ట్ సిటీస్ మిషన్ (గృహనిర్మాణ,పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ)

గోల్డ్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్

(సిబిఎస్ ఇ)

సిల్వర్

సెంటర్ ఫర్ ఇ-గవర్నెన్స్ (కర్ణాటక)

 

5.పబ్లిక్ డిజిటల్ ప్లాట్ ఫారమ్ లు - కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు , రాష్ట్రాలు: విస్తృత స్థాయి కవరేజ్, సమాజంలో అధిక ప్రభావాన్ని కలిగి ఉన్న పబ్లిక్ డిజిటల్ ప్లాట్ ఫారమ్ ల రూపకల్పన అమలులో ప్రతిభకు గుర్తింపు

 

పురస్కారం

విజేతలు

ప్లాటినం

దువారే సర్కార్ (పశ్చిమ బెంగాల్)

గోల్డ్

-సర్వీసెస్ మణిపూర్ (మణిపూర్)

 

 

పురస్కారం

విజేతలు - కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు

ప్లాటినం

ఐ సి ఇ జి ఎ టి ఇ పోర్టల్ (ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖ)

గోల్డ్

- శ్రమ్ (కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ)

 

 6.స్టార్టప్ ల సహకారంతో డిజిటల్ చొరవలు: డిజిటల్ పాలనను మెరుగుపరచడం మరియు/లేదా మార్పు చేయడం, డిజిటల్ సేవల అనుభవాన్ని మెరుగుపరచడం ,పౌరుల డిజిటల్ సాధికారత కోసం స్టార్టప్‌ల సహకారంతో ప్రభుత్వ సంస్థల ద్వారా ప్రతిభను గౌరవించడం. 

 

పురస్కారం

విజేతలు

ప్లాటినం

డిజిటల్ వర్క్ ఫోర్స్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (కేరళ)

గోల్డ్

భూసార స్మార్ట్ న్యూట్రియెంట్ మేనేజ్ మెంట్ (తెలంగాణ)

సిల్వర్

డిజిటల్ డిపాజిట్ రిఫండ్ సిస్టమ్ (ఉత్తరాఖండ్)

 

7. జి ఐ జి డబ్ల్యు అండ్ యాక్సెసబిలిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యుత్తమ వెబ్ , మొబైల్ చొరవలు: ఏదైనా పరికరంలో గొప్ప కంటెంట్, అడ్డంకులు లేని ప్రాప్యతను నిర్ధారించే వెబ్, మొబైల్ చొరవలకు గుర్తింపు

 

పురస్కారం

విజేతలు

ప్లాటినం

బిలాస్ పూర్ జిల్లా వెబ్ సైట్ (ఛత్తీస్ గఢ్)

గోల్డ్

కొట్టాయం జిల్లా (కేరళ) వెబ్ సైట్

సిల్వర్

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వెబ్ సైట్(రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ, రసాయనాలు మరియు పెట్రో కెమికల్స్ విభాగం)

 

***



(Release ID: 1889225) Visitor Counter : 176