రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జన్ ఔషధి చ్యవన్‌ప్రాష్ స్పెషల్‌ను ఆవిష్కరించిన భారత ఔషధ & వైద్య పరికరాల సంస్థ


అన్ని జన్ ఔషధి కేంద్రాల్లో అందుబాటులో ఉండనున్న చ్యవన్‌ప్రాష్ స్పెషల్

Posted On: 05 JAN 2023 6:52PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి భారతీయ జన్‌ ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) కింద, కొత్త ఉత్పత్తి జన్ ఔషధి స్పెషల్ చ్యవన్‌ప్రాష్‌ను ఇవాళ న్యూదిల్లీలో ఆవిష్కరించారు. భారత ఔషధ & వైద్య పరికరాల సంస్థ (పీఎంబీఐ) ముఖ్య కార్యనిర్వాహక అధికారి  శ్రీ రవి దధిచ్ ఈ కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించారు. చ్యవన్‌ప్రాష్ స్పెషల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జన్ ఔషధి కేంద్రాల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉంటుంది. ఇది శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ పేస్ట్. దాదాపు రకాల 50 మూలికలు, సుగంధ ద్రవ్యాల కలయికతో దీనిని తయారు చేశారు.

ప్రజలందరికీ తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజనను (పీఎంబీజేపీ) 2008లో ప్రారంభించారు. కేంద్ర రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఔషధ విభాగం వాటిని పర్యవేక్షిస్తోంది. ప్రధాన మంత్రి భారతీయ జన్‌ ఔషధి పరియోజనను (పీఎంబీజేపీ) అమలు చేసే ఏజెన్సీ అయిన భారత ఔషధ & వైద్య పరికరాల సంస్థ (పీఎంబీఐ) ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం మన దేశంలో 9000కు పైగా జన్‌ ఔషధి కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.869.12 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి, ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తయ్యేసరికి రూ.1200 కోట్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం, ఈ 9000 కేంద్రాల్లో 1759 రకాలకు పైగా ఔషధాలు, సువిధ శానిటరీ ప్యాడ్‌లు, 280 రకాల శస్త్రచికిత్స పరికరాలు లభ్యమవుతున్నాయి. సువిధ శానిటరీ ప్యాడ్‌ను ఒక్కొక్కటి రూ.1/-కే విక్రయిస్తున్నారు. జన్ ఔషధి ఔషధాల ధరలు బహిరంగ మార్కెట్‌లో లభించే బ్రాండెడ్ ఔషధాల ధరల కంటే 50%-90% తక్కువకే లభిస్తాయి. మొత్తంగా లెక్కిస్తే, ఈ కార్యక్రమం వల్ల గత 8 సంవత్సరాల్లో దేశ ప్రజలకు రూ.18000 కోట్లు ఆదా అయ్యాయి.

****


(Release ID: 1889095) Visitor Counter : 201


Read this release in: English , Urdu , Hindi , Marathi