శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

‘విజ్ఞాన సంబంధిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశపు మార్గం’ విషయమై చర్చ

Posted On: 04 JAN 2023 3:20PM by PIB Hyderabad

నాగ్‌పూర్‌లో జరిగిన భారతీయ సైన్స్ కాంగ్రెస్ మొదటి ప్లీనరీ సెషన్‌లో భారత ప్రభుత్వ వైజ్ఞానిక విభాగాల నాయకులు భారత దేశాన్ని విజ్ఞాన సంబంధిత ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి అవసరమైన  ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు.  సమావేశంలో భాగంగా దిశగా ఎదురయ్యే సవాళ్లు మరియు అవకాశాలపై చర్చించారు. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, ప్రొఫెసర్ ఎ.కె. సూద్ ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల కోసం భారత దేశం మూడవ అతిపెద్ద పర్యావరణ వ్యవస్థగా ఉద్భవించిందని అన్నారు. భారతదేశంలో డీప్ టెక్ స్టార్టప్ ల్యాండ్‌స్కేప్ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ దానిని ప్రత్యేకంగా పెంపొందించేందుకు వినియోగదారు సాంకేతికత, ఆటోమోటివ్, మీడియా మరియు వినోదం, అగ్రిటెక్, ఇంధన వినియోగాలు మరియు సైబర్ భద్రత వంటి రంగాలలో ఇంకా చాలా అవకాశం ఉందని నొక్కిచెప్పారు. క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీలో సాంకేతిక విప్లవాల కలయిక, అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీలు, క్లీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆరోగ్య మిషన్ ప్రపంచ విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు భారతదేశ పురోగతికి ఆజ్యం పోస్తున్నాయని ఆయన అన్నారు. “భారతదేశం యొక్క పరివర్తనలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుంది మరియు ఈ పరివర్తన మన ల్యాబ్‌లలో ఆధారపడి ఉంటుంది. కాబట్టి భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి మన సైన్స్ ఎంత వరకు సముచితంగా ఉంటుందో ఆలోచించడం మన శాస్త్రవేత్తల బాధ్యత. ఉత్పాదక లేదా సుస్థిరత సమస్యలలో భవిష్యత్తు సమస్యలను పరిష్కరించడానికి మేము మా ప్రశ్నలను రూపొందించుకోవాలి,” అని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్టీ) కార్యదర్శి డాక్టర్ ఎస్. చంద్రశేఖర్ అన్నారు. సైన్స్ భవిష్యత్తులో కర్మాగారాల అవసరాలను ఊహించి, వాటికి సరిపోయే తయారీ పద్ధతులను రూపొందించాలని, వ్యర్థాలను తగ్గించే విధంగా అవుట్‌పుట్‌ రూపొందించడం, వృత్తాకార శాస్త్ర భావనను అభివృద్ధి చేయడం, సబ్సిడీల ఆవశ్యకతను తొలగించే వ్యవసాయ సాంకేతికతలను రూపొందించడం, తక్కువ కాలుష్యం కలిగించే ప్రత్యామ్నాయ చలనశీలత ఎంపికలను కనుగొనడం వంటివి అవసరం అని ఆయన నొక్కిచెప్పారు. తన ప్రసంగంలో భాగంగా డాక్టర్ చంద్రశేఖర్ అట్టడుగు స్థాయి-గ్లోబల్ కనెక్షన్‌ని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకతను కూడా ప్రధానంగా ప్రస్తావించారు. తద్వారా అట్టడుగు స్థాయి నుండి పరిష్కారాలు ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఆధారాలు ఇవ్వగలవని అన్నారు.

 

విజయవంతమైన శాస్త్రీయ పరిష్కారాలలో స్థిరత్వం యొక్క ఆవశ్యకతను నొక్కిచెబుతూ, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ఎన్. కలైసెల్వి, పర్యావరణం మరియు వాతావరణ మార్పు, శక్తి మరియు చలనశీలత, ఆహారం మరియు పోషణ, పరిశ్రమ 4.0/5.0, సౌలభ్యం వంటి కొన్ని రంగాలలో భారతదేశం యొక్క సవాళ్లు మరియు అవకాశాలను వివరించారు. సైన్స్ మరియు రాబోయే ఏడేళ్లలో భారతదేశానికి కీలకమైన ప్రతిభను ఆకర్షించడం మరియు నిలుపుకోవడం. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు రానున్న 17 ఏళ్లకు ఇవి పునాది వేస్తాయని ఆమె అన్నారు. బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) సీనియర్ సలహాదారు డా. అల్కా శర్మ మాట్లాడుతూ శిలాజ ఇంధనం-ఉత్పన్న రసాయనాల స్థానంలో జీవ వ్యవస్థలను ఉపయోగించే బయో ఆధారిత ఇంధనాల తయారీ పారిశ్రామికీకరణలో సరికొత్త విధానంగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. ఇది వాతావరణ కార్బన్‌ను దాని స్థిరమైన రూపంలో లాక్ చేయగలదని, భారతదేశాన్ని సుస్థిరతలో ప్రపంచాన్ని నడిపించే దేశంగా మార్చే మార్గాన్ని సుగమం చేయగలదని ఆమె తెలిపారు.

***



(Release ID: 1888765) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Marathi , Hindi