ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

2023 నాటికి దేశం నుండి కాలా-అజార్ ను నిర్మూలించడం పై సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వాలతో ఉన్నత స్థాయి సమావేశం.


ఈ వ్యాధిని నిర్మూలించడానికి కలిసి పనిచేయడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించిన రాష్ట్ర ప్రభుత్వాలు: అన్ని విధాలా సహకరిస్తామని కేంద్రం హామీ

కాలా అజర్ కేసులు 44,533 (2007) నుండి 834 (2022) కు 98.7% తగ్గాయి

నిర్మూలన స్థితిని సాధించిన 632 (99.8%) స్థానిక (ఎండెమిక్ ) బ్లాకులు

ఇక స్థానిక కేటగిరీ లో ఒక్క జార్ఖండ్ లోని పాకూర్ జిల్లాలో ఒక్క బ్లాక్ (లిట్టిపారా) మాత్రమే

Posted On: 04 JAN 2023 6:16PM by PIB Hyderabad

'2023 నాటికి దేశం లో కాలా అజార్ వ్యాధిని నిర్మూలించేందుకు భారత్ కట్టుబడి ఉంది. 632 (99.8%) స్థానిక బ్లాకులు ఇప్పటికే ఎలిమినేషన్ స్థితిని సాధించాయి (<1 కేసు / 10,000).

జార్ఖండ్ లోని పాకూర్ జిల్లాలో ఒక బ్లాక్ (లిట్టిపారా) మాత్రమే ఇంకా స్థానిక కేటగిరీ (1.23 కేసులు / 10,000 జనాభా) లో ఉంది. జార్ఖండ్ లో కూడా వ్యాధి పూర్తి నిర్మూలన సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం , ఇతర భాగస్వాములతో కలసి కేంద్రం సమగ్రంగా పని చేస్తోంది. బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో కాలా-అజర్ వ్యాధి స్థితి పై ఉన్నత స్థాయీ సమీక్ష సందర్భంగా కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ విషయం తెలిపారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ,బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి శ్రీ తేజస్వీ యాదవ్, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి శ్రీ బ్రజేశ్ పాఠక్, జార్ఖండ్ ఆరోగ్య మంత్రి శ్రీ బన్నా గుప్తా, పశ్చిమ బెంగాల్ కు చెందిన సీనియ ర్ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రి చేసిన ఈ ట్వీట్ ద్వారా సమావేశం వివరాలను చూడవచ్చు

 

ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలలో కాలా అజార్ వ్యాధి నిర్మూలన పురోగతిని సమీక్షించడానికి  ఈ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా సమావేశం నిర్వహించారు.

కాలా అజార్ ను నిర్మూలించడానికి రాష్ట్రాలు చూపిన నిబద్ధతను ప్రశంసించారు. pic.twitter.com/XImF0rxlZo

– డాక్టర్ మన్సుఖ్ మాండవీయ (@mansukhmandviya) జనవరి 4, 2023

ఇమేజ్

వ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని చేరుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను డాక్టర్ మన్సుఖ్ మాండవీయ  ప్రశంసించారు. " మన ప్రధాన మంత్రి దార్శనిక నాయకత్వంలో, మన పౌరులందరికీ ఆరోగ్యాన్ని అందించడం మా లక్ష్యం‘‘ అని అన్నారు. ఈ 2023 లోనే కాలా-అజార్ నిర్మూలనకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎమ్ఎవై) ద్వారా పక్కా గృహాలు, గ్రామీణ విద్యుదీకరణ, సకాలంలో పరీక్షలు, చికిత్స, నియతానుసారంగా ఉన్నత స్థాయి సమీక్ష మొదలు రాష్ట్రాలు / జిల్లాలు / బ్లాకులకు అవార్డుల పంపిణీ ద్వారా ప్రోత్సహించడం వరకు, ప్రభుత్వం , దాని భాగస్వాములు ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించడానికి, సకాలంలో చికిత్స చేయడానికి బలమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేశాయి.

క్రియాశీల కేసులను గుర్తించడం, నిఘా, చికిత్స, రోగనిర్ధారణ కిట్లు, మందులు, స్ప్రేలు మొదలైన వాటిలో భారత ప్రభుత్వం రాష్ట్రాలకు మద్దతు ఇస్తోంది.

డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ, “ప్రభావిత రాష్ట్రాలు లక్ష్య జోక్యాలను అమలు చేయడం ప్రశంసనీయం, కొన్ని రాష్ట్రాలు తమ జిల్లాల్లో వ్యాధిని నిర్మూలించాయి, పురోగతిని కొనసాగించడం, కేసులు ఒక కేసు/10,000 జనాభా కంటే తక్కువగా ఉండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం." అని అన్నారు.ప్రతి 10,000 జనాభాకు 0.5 > అధిక-ప్రమాద బ్లాక్ లలో క్రమం తప్పకుండా సమీక్ష ,సూక్ష్మ-వర్గీకరణ ఉండేలా చూడాలని ఆయన ప్రభావిత రాష్ట్రాలను కోరారు. "కాలా-అజార్ సమాజంలోని దిగువ సామాజిక-ఆర్థిక వర్గాల వారిని ప్రభావితం చేస్తుంది కాబట్టి, ముందస్తు రోగ నిర్ధారణ ,పూర్తి కేసు నిర్వహణ, సమగ్ర నియంత్రణ, నిఘాతో పాటు మానవ వనరుల సామర్థ్యాన్ని పెంచడం క్షేత్ర స్థాయిలో చేపట్టాలి" అని ఆయన సూచించారు.

దీర్ఘకాలిక జ్వరం, సంబంధిత లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, సంబంధిత లక్షణాలకు సంబంధించిన సమాచారం ,రోగ నిర్ధారణ , ఉచిత చికిత్స, నష్టపరిహారం / ప్రోత్సాహకాలు, ఇతర ప్రభుత్వ జోక్యాలను వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

కేంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రాష్ట్రాల ప్రయత్నాలను ప్రశంసించారు “ హానికర శాండ్ ఫ్లై ద్వారా వ్యాప్తిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిరోధించాలి. వ్యాధి లక్షణాలు, ముందస్తుగా గుర్తించడం,ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా లభించే చికిత్సకు సంబంధించిన అవగాహన ప్రచారాలను బలోపేతం చేయడం ద్వారా ప్రభావిత వ్యక్తులను ముందస్తుగా గుర్తించడానికి వీలు కలుగుతుంది" అని అన్నారు.

సమావేశంలో రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో వ్యాధి స్థితి గురించి తెలియజేసాయి. తాము అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను కూడా పంచుకున్నాయి.

వివిధ జోక్యాల ద్వారా గుర్తించడం, నిఘా, చికిత్స కోసం కేంద్రం అందించిన మద్దతుకు రాష్ట్ర ఆరోగ్య మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. వ్యాధి నిర్మూలన స్థితిని సాధించిన రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు గణాంకాలు స్థిరంగా ఉండేలా చూడటానికి మిషన్ మోడ్ లో పనిచేయడం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

2021 లో బ్రెజిల్, ఎరిట్రియా, ఇథియోపియా, భారతదేశం, కెన్యా, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్ వంటి ఎనిమిది దేశాల నుండి కాలా అజార్ కేసులు 90% నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా నివేదించబడిన మొత్తం కేసులలో భారతదేశం 11.5% వాటాను కలిగి ఉంది. బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 54 జిల్లాల్లోని 633 బ్లాకుల్లో కాలా-అజార్ స్థానికంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ఇది గుర్తించదగిన వ్యాధి. ప్రస్తుతం కాలా అజార్ కేసుల్లో 90 శాతానికి పైగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ (2019), పశ్చిమ బెంగాల్ (2017) రాష్ట్రాలు బ్లాక్ స్థాయిలో తమ ఎలిమినేషన్ లక్ష్యాలను సాధించాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి  శ్రీ రాజేష్ భూషణ్, సంయుక్త కార్యదర్శి శ్రీ. రాజీవ్ మాంఝీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న సీనియర్ ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అభివృద్ధి భాగస్వాములు కూడా వర్చువల్ గా హాజరయ్యారు.

 

****



(Release ID: 1888735) Visitor Counter : 178


Read this release in: English , Urdu , Hindi , Punjabi