శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
రాబోయే సంవత్సరాల్లో గ్లోబల్ పాత్రను పోషించడానికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసుకోవడానికి భారతదేశం ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా జీవించాలని నిర్ణయించుకున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
నాగ్‌పూర్‌లో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ ఢిల్లీ మరియు ప్రాంతీయ మీడియా ప్రతినిధులతో సంభాషించారు.
ప్రైవేట్ పరిశ్రమల కోసం అంతరిక్ష రంగాన్ని అన్‌లాక్ చేయడం, జియోస్పేషియల్ మార్గదర్శకాలకు క్యాబినెట్ ఆమోదాలు, డ్రోన్ పాలసీ మరియు బ్లూ ఎకానమీపై మోడీ నిర్ణయాలు వచ్చే దశాబ్దంలో భారతదేశాన్ని ప్రపంచంలోని మొదటి 5 దేశాలలో ఖచ్చితంగా ముందుకు తీసుకువెళుతుంది: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
03 JAN 2023 7:04PM by PIB Hyderabad
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా మీడియాతో ముఖాముఖిలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ & ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. భారతదేశం ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా జీవించాలని నిర్ణయించుకుందని రాబోయే సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను అది సాకారం చేస్తుందని తెలిపారు.
"మహిళా సాధికారతతో సుస్థిర అభివృద్ధికి సైన్స్ & టెక్నాలజీ" అనే ఈ సంవత్సరం సైన్స్ కాంగ్రెస్ యొక్క ఫోకల్ థీమ్ చాలా సముచితమైనది మరియు ఆలోచనాత్మకమైనది అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
సమగ్ర వృద్ధి, వృత్తాకార ఆర్థిక వ్యవస్థలు మరియు సుస్థిర లక్ష్యాలపై సదస్సులో చర్చ జరుగుతుందని అదే సమయంలో సైన్స్ & టెక్నాలజీలో మహిళల ఎదుగుదలకు సాధ్యమయ్యే అడ్డంకులను పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.
మోదీ ప్రభుత్వ హయాంలో గత ఎనిమిదిన్నరరేళ్లలో భారతదేశం సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లలో ఎన్నో కొత్త పుంతలు తొక్కిందని, ప్రైవేట్ పరిశ్రమ ఏవియేషన్ యొక్క పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా స్పేస్ సెక్టార్‌ను అన్‌లాక్ చేయడం వంటి సాహసోపేత నిర్ణయాలను తీసుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. జియోస్పేషియల్ మార్గదర్శకాలకు కేబినెట్ ఆమోదం, డ్రోన్ పాలసీ మరియు బ్లూ ఎకానమీ వంటి నిర్ణయాలు వచ్చే దశాబ్దంలో ప్రపంచంలోని మొదటి 5 దేశాలలో భారతదేశాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళతాయని కొన్ని ప్రశ్నలకు ఆయన విలేకరులతో అన్నారు.
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2022లో భారతదేశం 40వ స్థానానికి, ప్రపంచ పరిశోధన ప్రచురణలలో 3వ స్థానానికి మరియు కొత్త స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో 3వ స్థానానికి చేరుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేసారు. దేశంలోని యువత కొత్త ఆలోచనలతో సమస్యలను పరిష్కరిస్తారని ఆకాంక్షించారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 2050 నాటికి మన ప్రపంచ జనాభా 9 బిలియన్లకు చేరుకోవచ్చని అంచనా. మరియు వీరిలో ప్రతి ఒక్కరు మన సహజ వనరులు & పర్యావరణానికి హాని కలిగించకుండా గణనీయమైన జీవన నాణ్యతను పొందగలరని మేము నిర్ధారించుకోవాలి. భవిష్యత్ తరాలకు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని రాజీ పడకుండా వర్తమాన అవసరాలను తీర్చే అభివృద్ధిని సుస్థిర అభివృద్ధిగా చెప్పవచ్చని ఆయన అన్నారు.
108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్, మహిళా సాధికారత మరియు అన్ని కోణాల్లో దీనిని సాధించడంలో సైన్స్ & టెక్నాలజీ పాత్ర గురించి చర్చిస్తుందని మంత్రి తెలిపారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దార్శనికత మరియు ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని సాకారం చేయడంలో ఎస్‌టిఐ మరియు ఎస్‌టిఈఎం కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
2023లో పిఎం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం జీ20 హోస్ట్‌గా అంతర్జాతీయ వేదికలలో తన స్థాయిని పునరుద్ఘాటించిందని అలాగే ప్రపంచం అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరాన్ని పాటిస్తున్న దేశంగా పునరుద్ఘాటించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలోని డిఎస్‌టి, డిబిటి, సిఎస్‌ఐఆర్, డిఓఎస్, డిఎఇ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ వంటి మొత్తం ఆరు సైన్స్ డిపార్ట్‌మెంట్‌ల మొత్తం ఐటెనరీ జి-20 మరియు ఎస్-20 సమావేశాలను సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్ చంద్రశేఖర్ మీడియాతో పంచుకున్నారు.
విలేఖరుల సమావేశంలో భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్,డిఎస్‌ఐఆర్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కెఆర్ సూద్, డాక్టర్ ఎన్ కలైసెల్వి, మంత్రిత్వ శాఖ ఎర్త్ సైన్సెస్ డాక్టర్ ఎం.రవిచంద్రన్ మరియు రెండు మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
*****
(Release ID: 1888692)
Visitor Counter : 200