ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆధార్‌లో ‘కుటుంబ అధిపతి’ ఆధారిత ఆన్‌లైన్ చిరునామా అప్‌డేట్‌ను ప్రారంభించిన యుఐడిఏఐ
నివాసితులు తమ కుటుంబ పెద్ద (హెచ్‌ఓఎఫ్) సమ్మతితో ఆన్‌లైన్‌లో ఆధార్‌లో చిరునామాను అప్‌డేట్ చేయవచ్చు
సర్వీస్ అభ్యర్థన తేదీ నుండి 30 రోజులలోపు హెచ్‌ఓఎఫ్ ఆ అభ్యర్థనను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు
తమ స్వంత పేరుతో సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేని నివాసితులకు ప్రయోజనం చేకూర్చడానికి హెచ్‌ఓఎఫ్ ఆధారిత ఆన్‌లైన్ చిరునామా అప్‌డేట్ విధానం
प्रविष्टि तिथि:
03 JAN 2023 12:32PM by PIB Hyderabad
కుటుంబ పెద్ద (హెచ్‌ఓఎఫ్) సమ్మతితో ఆన్‌లైన్‌లో ఆధార్‌లో చిరునామాను అప్‌డేట్ చేయడంలో సహాయపడటానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఏఐ) పౌరులకు స్నేహపూర్వక సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది.
ఆధార్‌లోని హెచ్‌ఓఎఫ్ ఆధారిత ఆన్‌లైన్ అడ్రస్ అప్‌డేట్ వారి ఆధార్‌లోని చిరునామాను అప్‌డేట్ చేయడానికి తమ స్వంత పేరుతో సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేని పిల్లలు, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు మొదలైన నివాసితుల బంధువులకు ఉపయోగపడుతుంది.
ఇది రేషన్ కార్డ్, మార్క్‌షీట్, వివాహ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ వంటి వాటికి సంబంధించిన రుజువు పత్రాన్ని సమర్పించడం ద్వారా దరఖాస్తుదారు మరియు హెచ్‌ఓఎఫ్ మరియు వారి మధ్య సంబంధాన్ని మరియు హెచ్‌ఓఎఫ్ ద్వారా ఓటిపీ ఆధారిత ప్రమాణీకరణను పేర్కొనడం ద్వారా చేయవచ్చు. బంధుత్వానికి సంబంధించిన రుజువు పత్రం కూడా అందుబాటులో లేనట్లయితే యుఐడిఏఐ సూచించిన ఫార్మాట్‌లో హెచ్‌ఓఎఫ్ ద్వారా స్వీయ-డిక్లరేషన్‌ను సమర్పించడానికి కూడా యుఐడిఏఐ అవకాశం అందిస్తోంది.
దేశంలోని వివిధ కారణాల వల్ల ప్రజలు నగరాలు మరియు పట్టణాలకు తరలి వెళ్తుండడంతో ఈ సదుపాయం లక్షలాది మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఎంపిక యుఐడిఏఐ సూచించిన ఏదైనా చెల్లుబాటు అయ్యే చిరునామా పత్రాన్ని ఉపయోగించి ప్రస్తుత చిరునామా నవీకరణ సౌకర్యానికి అదనంగా ఉంటుంది. 18 ఏళ్లు పైబడిన ఏ నివాసి అయినా ఈ ప్రయోజనం కోసం హెచ్‌ఓఎఫ్ కావచ్చు మరియు ఈ ప్రక్రియ ద్వారా అతని/ఆమె బంధువులతో అతని/ఆమె చిరునామాను పంచుకోవచ్చు.
'మై ఆధార్' పోర్టల్‌లో https://myaadhaar.uidai.gov.in నివాసి తన చిరునామాను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎంపికను ఎంచుకోవచ్చు. దీని తరువాత, నివాసి హెచ్‌ఓఎఫ్ యొక్క ఆధార్ నంబర్‌ను నమోదు చేయడానికి అనుమతించబడతారు. అది మాత్రమే ధృవీకరించబడుతుంది. హెచ్‌ఓఎఫ్ తగినంత గోప్యతను నిర్వహించడానికి హెచ్‌ఓఎఫ్ యొక్క ఆధార్ యొక్క ఇతర సమాచారం ఏదీ స్క్రీన్‌పై ప్రదర్శించబడదు.
హెచ్‌ఓఎఫ్‌కు సంబంధించిన ఆధార్ నంబర్ యొక్క విజయవంతమైన ధ్రువీకరణ తర్వాత, నివాసి రిలేషన్‌షిప్ రుజువు పత్రాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఈ సర్వీస్ కోసం నివాసి రూ.50/ రుసుము చెల్లించాలి. విజయవంతమైన చెల్లింపుపై, సేవా అభ్యర్థన నంబర్ (ఎస్‌ఆర్‌ఎన్) నివాసితో భాగస్వామ్యం చేయబడుతుంది మరియు చిరునామా అభ్యర్థన గురించి హెచ్‌ఓఎఫ్‌కి ఎస్‌ఎంఎస్ పంపబడుతుంది. నోటిఫికేషన్‌ను స్వీకరించిన తేదీ నుండి 30 రోజులలోపు మైఆధార్ పోర్టల్‌కి లాగిన్ చేయడం ద్వారా హెచ్‌ఓఎఫ్ ఆ అభ్యర్థనను ఆమోదించి, అతని/ఆమె సమ్మతిని అందించాలి. అనంతరం ఆ అభ్యర్థన ప్రాసెస్ చేయబడుతుంది.
హెచ్‌ఓఎఫ్ ఆమె/అతని చిరునామాను పంచుకోవడానికి తిరస్కరిస్తే లేదా ఎన్‌ఆర్‌ఎన్ సృష్టించిన నిర్ణీత 30 రోజులలోపు అంగీకరించకపోతే లేదా తిరస్కరించినట్లయితే, అభ్యర్థన మూసివేయబడుతుంది. ఈ ఎంపిక ద్వారా చిరునామా అప్‌డేట్ కోరుకునే నివాసికి ఎస్‌ఎంఎస్ ద్వారా అభ్యర్థన మూసివేత గురించి తెలియజేయబడుతుంది.హెచ్‌ఓఎఫ్ అంగీకరించని కారణంగా అభ్యర్థన మూసివేయబడినా లేదా తిరస్కరించబడినా లేదా ప్రక్రియ సమయంలో తిరస్కరించబడినా దరఖాస్తుదారుకు మొత్తం తిరిగి చెల్లించబడదు.
***
(रिलीज़ आईडी: 1888691)
आगंतुक पटल : 435