రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన కార్యక్రమంలో ఏడు సరిహద్దు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.724 కోట్ల విలువైన వంతెనలు, రహదారులతో సహా 28 బీఆర్ వో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి


లడఖ్, మిజోరంలో మూడు వీశాట్ ఆధారిత టెలిమెడిసిన్ నోడ్ లు కూడా ప్రారంభం

‘‘మరింత రక్షణ సంసిద్ధత, సామాజిక- ఆర్థిక పురోగతి కోసం సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి దిశగా ప్రభుత్వ సంకల్పానికి ఈ ప్రాజెక్టులు నిదర్శనం.

భారత్ కు యుద్ధంపై నమ్మకం లేదు, కానీ బలవంతం చేస్తే పోరాడేందుకు సిద్ధంగా ఉంటుంది: శ్రీ రాజ్ నాథ్ సింగ్

Posted On: 03 JAN 2023 1:25PM by PIB Hyderabad

2023 జనవరి 3న అరుణాచల్ ప్రదేశ్ లోని అలోంగ్-యిన్కియాంగ్ రోడ్ లోని సియోమ్ వంతెన వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.724 కోట్ల విలువైన 28 బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ ఓ) మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుల్లో సియోమ్ వంతెనతో సహా 22 వంతెనలు , ఉత్తర,  ఈశాన్య ప్రాంతాల ఏడు సరిహద్దు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలల మూడు రోడ్లు , మూడు ఇతర ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఎనిమిది ప్రాజెక్టులు లడఖ్ లో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో ఐదు; జమ్మూ కాశ్మీర్ లో నాలుగు; సిక్కింలో, పంజాబ్, ఉత్తరాఖండ్ లో మూడు చొప్పున, రాజస్థాన్ లో రెండు

ఉన్నాయి. వీటితో పాటు లడఖ్ లో రెండు, మిజోరంలో ఒకటి టెలిమెడిసిన్ నోడ్ లను ప్రారంభించారు.

 

రక్షణ మంత్రి తన ప్రసంగంలో, సాయుధ దళాల కార్యాచరణ సంసిద్ధతను పెంచడానికి ,సుదూర ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి దిశగా ప్రభుత్వ, బిఆర్ఓ ల సంఘటిత ప్రయత్నాలకు ఈ ప్రాజెక్టులను నిదర్శనంగా అభివర్ణించారు.

సరిహద్దు ప్రాంతాలను అనుసంధానం చేసి, ఆ ప్రాంత వాసుల అభివృద్ధికి భరోసా కల్పించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన స్ప ష్టం చేశారు.

 

నిరంతరం మారుతున్న అంతర్జాతీయ పరిణామాల కారణంగా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి బలమైన , స్వావలంబన కలిగిన 'న్యూ ఇండియా' ను నిర్మించడమే తమ లక్ష్యమని శ్రీ రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. 'ప్రపంచం నేడు అనేక సంఘర్షణలను చూస్తోంది. భారతదేశం ఎల్లప్పుడూ యుద్ధానికి వ్యతిరేకం. ఇది మా విధానం. ఇటీవల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  'ఇది యుద్ధ యుగం కాదు' అన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.మేము యుద్ధాన్ని నమ్మము, కానీ అది మాపై బలవంతం గా రుద్దితే మేము దీటుగా పోరాడతాము. అన్ని బెదిరింపుల నుండి దేశాన్ని రక్షించేలా మేము భరోసా ఇస్తున్నాము. మన సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. బిఆర్ఓ వారితో భుజం భుజం కలిపి నడవడం సంతోషంగా ఉంది‘‘ అని ఆయన అన్నారు.

 

సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా దేశ భద్రతను పెంచడంలో బిఆర్ఓ పోషించిన కీలక పాత్రను రక్షణ మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఇటీవల, మన దళాలు ఉత్తర సెక్టార్ లో ప్రతికూలతను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి పరిస్థితి పట్ల సకాలంలో, సాహసంతో వ్యవహరించాయి. ఈ ప్రాంతంలో తగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఇది సాధ్యమైంది. సుదూర ప్రాంతాల పురోగతికి ఇది మమ్మల్ని మరింత ప్రేరేపిస్తుంది" అని ఆయన అన్నారు.

 

సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒక గేమ్ ఛేంజర్ గా అభివర్ణించిన శ్రీ రాజ్ నాథ్ సింగ్, సుదూర ప్రాంతాలలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి భరోసా ఇచ్చినందుకు బిఆర్ ఓను ప్రశంసించారు.

ఈశాన్య ప్రాంతం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, ఇది దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేసిందని ఆయన చెప్పారు. సాయుధ దళాలకు, స్థానిక ప్రజలకు మద్దతు ఇవ్వడానికి సంస్థ అలుపెరగని ప్రయత్నాలకు గాను శ్రీ రాజ్ నాథ్ సింగ్ "బిఆర్ ఓ జాతికి సోదరుడు- బి ఆర్ ఓ ఈజ్ ది నేషన్స్ బ్రో) అనే కొత్త పదబంధాన్ని ప్రయోగించారు. 'ఇది గమ్యం కాదు, ఇది ప్రయాణం' అనే ప్రసిద్ధ ఉటంకిస్తూ, సరిహద్దు ప్రాంతాల్లో రహదారి మౌలిక సదుపాయాల నిర్మాణం బిఆర్ఓకు ఒక ప్రయాణం అని, బలమైన, సంపన్న భారతదేశం దాని గమ్యస్థానంగా ఉండాలని ఆయన అన్నారు.

 

అలోంగ్-యిన్కియాంగ్ రోడ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన సియోమ్ వంతెనకు రాజ్ నాథ్ సింగ్ స్వయంగా ప్రారంభోత్సవం చేయగా ఇతర ప్రాజెక్టులను వర్చువల్ గా జాతికి అంకితం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ లోని సియోమ్ నదిపై 100 మీటర్ల పొడవు, క్లాస్ 70 స్టీల్ ఆర్చ్ సూపర్ స్ట్రక్చర్ సియోమ్ వంతెన.

 

అరుణాచల్ ప్రదేశ్‌లోని సియోమ్ వంతెన  ను. సియోమ్ నదిపై 100 మీటర్ల పొడవు, క్లాస్ 70 స్టీల్ ఆర్చ్ సూపర్‌స్ట్రక్చర్ తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో నిర్మించారు.

 

రక్షణ మంత్రి ఇ-ప్రారంభోత్సవం చేసిన మూడు టెలిమెడిసిన్ నోడ్ లను విఎస్ఎటి (వెరీ స్మాల్ ఎపర్చర్ టెర్మినల్) ఉపగ్రహ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా సర్వీసు ఆసుపత్రులతో అనుసంధానించనున్నారు. శాట్ కామ్ విఎస్ఎటి కమ్యూనికేషన్ ఉపయోగించి సర్వీస్ ఆసుపత్రులలోని నిపుణులతో టెలిమెడిసిన్ సంప్రదింపుల ద్వారా వైద్య, శస్త్రచికిత్స అత్యవసరాలకు సత్వర వైద్య జోక్యాన్ని అందిస్తుంది. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మారుమూల సరిహద్దు ప్రదేశాలలో తన సిబ్బందికి వైద్య సేవలను అందించడంలో బిఆర్ఓ సాధించిన ప్రత్యేక విజయాలలో ఇది ఒకటి. ఈ నోడ్ లు స్థానిక ప్రజల ఆరోగ్య సంబంధిత అవసరాలకు సహాయపడతాయని రక్షణ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

2022 లో పూర్తయిన ఈ 28 ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో, రూ .2,897 కోట్ల వ్యయంతో  కూడిన బిఆర్ఓ కు చెందిన మొత్తం 103 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఈ సంవత్సరంలో దేశానికి అంకితం చేయబడ్డాయి. గత ఏడాది అక్టోబర్ లో రూ.2,173 కోట్ల విలువైన 75 ప్రాజెక్టులను లడఖ్ లోని ష్యోక్ గ్రామం నుంచి రక్షణ మంత్రి ప్రారంభించారు. 2021లో రూ.2,229 కోట్ల వ్యయంతో కూడిన 102 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.  కఠినమైన ప్రదేశాలలో సవాలుతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా బిఆర్ఓ అభివృద్ధి పనులను చేపట్టిన అంకితభావాన్ని,  వేగవంతమైన పురోగతిని శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు.

 

ఈ సందర్భంగా రక్షణ మంత్రి న్యూ

టెక్నాలజీస్ పై ఒక సంకలనాన్ని కూడా విడుదల చేశారు.ప్రతికూల వాతావరణ పరిస్థితులతో సుదూర, శత్రు భూభాగం ప్రభావాలను అధిగమించేలా రోడ్లు, వంతెనలు, ఎయిర్ ఫీల్డ్ లు ,సొరంగ మౌలిక సదుపాయాల నిర్మాణంలో

తాజా సాంకేతిక పరిజ్ఞానాలను బిఆర్ఒ అనుసరిస్తోంది. సివిల్ ఇంజనీరింగ్ పనులలో పూర్తి నాణ్యతతో నిర్ణీత వ్యవధి

భరోసాను కలిగివుంటాయి.

ఇది రోడ్లు, వంతెనలు, ఎయిర్‌ఫీల్డ్‌లు మరియు టన్నెల్ అవస్థాపనల నిర్మాణంలో BRO చే అవలంబిస్తున్న తాజా సాంకేతికతలను కలిగి ఉంది, ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితులతో రిమోట్ మరియు శత్రు భూభాగాల ప్రభావాలను తిరస్కరించడానికి, ఇది సివిల్ ఇంజనీరింగ్ పనుల నాణ్యతను మరియు పూర్తి సమయపాలనకు అనుగుణంగా అనవసరంగా ప్రభావితం చేస్తుంది.

 

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ, అరుణాచల్ అరుణాచల్ ఈస్ట్ ఎంపి శ్రీ తాపిర్ గావో, జిఓసి-ఇన్-సి ఈస్టర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్ పి కలిత, జిఓసి స్పియర్ కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్ సి తివారీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1888432) Visitor Counter : 175