విద్యుత్తు మంత్రిత్వ శాఖ
దేశంలో తొలిసారిగా పిఎన్ జి వ్యవస్థలో గ్రీన్ హైడ్రోజన్ మిళితం చేసి ఇంధన సరఫరా ప్రారంభించిన ఎన్టీపీసీ
Posted On:
03 JAN 2023 4:33PM by PIB Hyderabad
* పైప్ లైన్ ద్వారా సూరత్ ఆదిత్య నగర్ కావాస్ టౌన్‌షిప్ లో నివాస గృహాలకు హెచ్ 2-ఎన్ జి (సహజ వాయువు) ఇంధన సరఫరా
* ప్రపంచ హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని కేంద్ర బిందువుగా మార్చనున్న ప్రాజెక్టు
* నూతన విధానంతో హైడ్రోకార్బన్ దిగుమతి కోసం చేస్తున్న ఖర్చు తగ్గుతుంది. విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. ప్రపంచ దేశాలకు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ రసాయనాలను భారతదేశం ఎగుమతి చేయగలుగుతుంది.
Kawas HoP Ram Prasad starting the green hydrogen injection into PNG network of NTPC Kawas Township
NTPC Kawas Green H2 Blending project having electrolyser, hydrogen storage and blending skid
దేశంలో మొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్రాజెక్టును ఎన్టీపీసీ లిమిటెడ్ ప్రారంభించింది. సూరత్ లోని ఎన్టీపీసీ కవాస్ టౌన్‌షిప్ లోని పైపుల ద్వారా సరఫరా చేస్తున్న సహజవాయువు (పిఎన్ జి) వ్యవస్థలో గ్రీన్ హైడ్రోజన్ మిళితం చేయడం ప్రారంభమైంది. ఎన్టీపీసీ, గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ (జీజీఎల్) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాయి.
ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ మొదటి అణువును ఎన్టీపీసీ, జీజీఎల్ సీనియర్ అధికారుల సమక్షంలో కవాస్ ప్రాజెక్ట్ హెడ్ శ్రీ పి రామ్ ప్రసాద్ వ్యవస్థలో ప్రవేశపెట్టారు.
ప్రక్రియ ప్రారంభమైన తర్వాత జీజీఎల్ అధికారుల సహకారంతో టౌన్‌షిప్ లో నివసిస్తున్న ప్రజలకు ఎన్టీపీసీ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జూలై 30న శంకుస్థాపన చేశారు. రికార్డు వ్యవధిలో లక్ష్యాన్ని సాధించడానికి ఎన్టీపీసీ, గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ పనిచేసి విజయం సాధించారు. దీని ద్వారా సూరత్‌లోని ఆదిత్యనగర్‌లోని కవాస్ టౌన్‌షిప్ గృహాలకు హెచ్ 2-ఎన్ జి (సహజ వాయువు) సరఫరా చేస్తారు. కవాస్‌లో నెలకొల్పిన 1 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ సౌరశక్తిని ఉపయోగించి నీటి విద్యుద్విశ్లేషణ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేస్తుంది.
పిఎన్జీ 5% వాల్యూమ్/వాల్యూమ్‌కు హైడ్రోజన్ ను మిళితం చేయడానికి పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు ప్రాధమికంగా ఆమోదం తెలిపింది. ఈ స్థాయి 20% చేరేలా దశల వారీగా అనుమతులు మంజూరు అవుతాయి. సహజ వాయువులో హైడ్రోజన్ ను మిళితం చేసినప్పుడు కర్బన ఉద్గారాల విడుదల తగ్గుతుంది. అయితే, వేడి తగ్గదు.
ఇంతవరకు ప్రపంచంలో యూకే, జర్మనీ మరియు ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాలు మాత్రమే ఈ రంగంలో విజయం సాధించాయి. ప్రపంచ దేశాల సరసన ఇప్పుడు భారతదేశం చేరింది. దీంతో ప్రపంచ హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని కేంద్ర బిందువుగా మారుతుంది. ప్రక్రియ వల్ల హైడ్రోకార్బన్ దిగుమతి కోసం చేస్తున్న ఖర్చు తగ్గుతుంది. విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. ప్రపంచ దేశాలకు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ రసాయనాలను భారతదేశం ఎగుమతి చేయగలుగుతుంది.
(Release ID: 1888430)
Visitor Counter : 281