విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అద్భుతమైన పనితీరు కనబరిచిన ఎన్టీపీసీ


- 11.6 శాతం వృద్ధితో 295.4 బీయూల ఉత్పత్తి నమోదు

Posted On: 03 JAN 2023 12:43PM by PIB Hyderabad

-      2022 సంవత్సరం ‘ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ  ఎన్టీపీసీ మేటి పని తీరును కనబరిచింది.

-      సంస్థ స్వతంత్ర ప్రాతిపదికన మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఉత్పత్తిలో 16.1 శాతం వృద్ధిని కనబరుస్తూ
254.6 బీయూల ఉత్తత్తిని నమోదు చేసింది.

-      ఎన్టీపీసీ సంస్థ 14.6 ఎంఎంటీల ఉత్పత్తిని సాధించడం ద్వారా క్యాప్టివ్ బొగ్గు ఉత్పత్తిలో అసాధారణ వృద్ధిని నమోదు చేసింది

-      ఎన్టీపీసీ గ్రూప్ స్థాపిత సామర్థ్యం 70824 మెగా వాట్లు

-      కంపెనీ పునరుత్పాదక సామర్థ్యాన్ని 3 గిగా వాట్లు దాటింది

-      భారతదేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ ఏప్రిల్-డిసెంబర్, 2022లో 295.4 బీయుల ఉత్పత్తిని నమోదు చేసింది, గత సంవత్సరం ఇదే కాలంతో ఉత్పత్తితో పోలిస్తే 11.6% వృద్ధిని నమోదు చేసింది.

భారతదేశంలోని అతిపెద్ద విద్యుత్తు ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ (ఎన్టీపీసీ) ఏప్రిల్-డిసెంబర్, 2022లో 295.4 బీయూల విద్యుత్ ఉత్పత్తిని నమోదు చేసింది, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఉత్పత్తిలో 11.6 శాతం వృద్ధి నమోదయింది.

స్వతంత్ర ప్రాతిపదికన మునుపటి సంవత్సరంతో పోలిస్తే సంస్థ 16.1 శాతం వృద్ధిని కనబరుస్తూ
254.6 బీయూల ఉత్పత్తిని నమోదు చేసింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9 నెలల కాలానికి బొగ్గు కర్మాగారాలు 73.7% పీఎల్ఎఫ్ ను నమోదు చేశాయి, గత ఆర్థిక సంవత్సరంల అదే కాలానికి పీఎల్ఎఫ్ 68.5 శాతంగా నమోదయింది.  ఎన్టీపీసీ సంస్థ  తారాస్థాయి పనితీరు ఎన్టీపీసీ ఇంజనీర్లు, ఆపరేషన్ & నిర్వహణ పద్ధతులు మరియు సంస్థ వ్యవస్థల మేటి నైపుణ్యానికి నిదర్శనం. దీనికి తోడు ఎన్టీపీసీ 14.6 ఎంఎటీల ఉత్పత్తిని సాధించడం ద్వారా క్యాప్టివ్ బొగ్గు ఉత్పత్తిలో అసాధారణ వృద్ధిని చిత్రీకరించింది, అదే కాలానికి మునుపటి సంవత్సరంతో పోలిస్తే 51% వృద్ధిని నమోదు చేసింది. ఎన్టీపీసీ గ్రూప్ స్థాపిత సామర్థ్యం 70824 మెగా వాట్లు. ఇటీవల, కంపెనీ 3 గిగా వాటంల పునరుత్పాదక సామర్థ్యాన్ని అధిగమించింది.

 

***

 

 


(Release ID: 1888378) Visitor Counter : 219