ఉక్కు మంత్రిత్వ శాఖ
డిసెంబర్ లో రికార్డు ఉత్పత్తిని నమోదు చేసిన ఎంఓఐఎల్
प्रविष्टि तिथि:
02 JAN 2023 5:32PM by PIB Hyderabad
ఎంఓఐఎల్ డిసెంబర్ 2022లో 1,41,321 టన్నుల మాంగనీస్ ధాతువు ఉత్పత్తిని నమోదు చేసి ఉత్తమ ఫలితాలను సాధించింది. దాని రేటింగ్ సామర్థ్యం స్థాయిలో ఉత్పత్తి చేయడం ద్వారా, ఉత్పత్తి పెరుగుదల 2022 నవంబర్ కంటే 18 శాతం పెరిగింది. ఈ నెలలో 1,64,235 టన్నుల అమ్మకాలు జరిగాయి. నవంబర్, 2022 కంటే దాదాపు 91 శాతం అద్భుతమైన వృద్ధి సాధించింది.

సీఎండీ గా గత నెల 29న బాధ్యతలు స్వీకరించిన శ్రీ అజిత్ కుమార్ సక్సేనా, బృందం ఉమ్మడి పనితీరుతో ఈ విధంగా మంచి ఫలితం నమోదు కావడం సంతోషదాయకమని, ఇది ఇలాగే కొనసాగాలని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఎంఓఐఎల్ గురించి: ఎంఓఐఎల్ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ అడ్మినిస్ట్రేటివ్ నియంత్రణలో ఉన్న షెడ్యూల్ఏ , మినీరత్న కేటగిరీ-1 సిపిఎస్ఈ . మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు గనులను నిర్వహిస్తూ సుమారు 45% మార్కెట్ వాటాతో ఎంఓఐఎల్ దేశంలోనే అతిపెద్ద మాంగనీస్ ఖనిజాన్ని ఉత్పత్తి చేసే సంస్థ. 2030 నాటికి తమ ఉత్పత్తిని దాదాపు రెట్టింపు చేసి 3 మిలియన్ టన్నులకు పెంచాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని విధించింది. ఎంఓఐఎల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు గుజరాత్, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రంలో కూడా వ్యాపార అవకాశాలను అన్వేషిస్తోంది.
*****
(रिलीज़ आईडी: 1888187)
आगंतुक पटल : 222