వ్యవసాయ మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత రాయబార కార్యాలయాలు చేపట్టినకేంద్రీకృత కార్యకలాపాలతో ప్రారంభమైన అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (ఐవైఎం)2023.

Posted On: 01 JAN 2023 11:48AM by PIB Hyderabad

*ఐవైఎం ద్వారా పెద్ద ఎత్తున చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని ప్రోత్సహించడం , మొత్తం ప్రపంచానికి చేర్చడం డి ఎ అండ్ ఎఫ్ డబ్ల్యు లక్ష్యం.

 

*ఐవైఎంను ప్రోత్సహించడానికి మరియు చిరుధాన్యాల ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి వివిధ కార్యకలాపాలను చేపట్టడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు , భారత రాయబార కార్యాలయాలకు 2023 లో కేంద్రీకృత నెలల కేటాయింపు

 

*ఐవైఎం కు ప్రచారం కల్పించడానికి, చిరుధాన్యాల ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి వివిధ కార్యకలాపాలను చేపట్టడానికి 2023 లో ప్రత్యేకంగా ఒక నెలను కేటాయించిన కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు ,భారత రాయబార కార్యాలయాలు

 

*ఐవైఎమ్ ఈవెంట్ లు/కార్యకలాపాలను నిర్వహించడానికి కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఛత్తీస్ గఢ్, మిజోరం రాజస్థాన్ రాష్ట్రాలకు జనవరి, 2023 ప్రత్యేక కేంద్రీకృత మాసం

 

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (ఐవైఎం) 2023 కోసం భారత ప్రభుత్వం ప్రాయోజితం చేసింది, దీనిని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్జిఎ) ఆమోదించింది.

ప్రధానమంత్రి నేతృత్వంలో, 2023 ను అంతర్జాతీయ చిరు ధాన్యాల (మిల్లెట్స్) సంవత్సరంగా జరపాలని భారత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ

(యు ఎన్ జి ఎ) ఆమోదించింది. ఐవైఎం వేడుకలను జరుపుకోవడంలో భారత ప్రభుత్వం ముందంజలో ఉండటానికి ఈ ప్రకటన కీలకంగా నిలిచింది. ఐవైఎం 2023 ను 'పీపుల్స్ మూవ్ మెంట్'గా మార్చడంతో పాటు భారతదేశాన్ని 'మిల్లెట్స్ గ్లోబల్ హబ్'గా మార్చాలనే తన విజన్ ను భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

 

సింధు లోయ నాగరికత సమయంలో దాని వినియోగానికి అనేక ఆధారాలతో భారతదేశంలో పెంపకం చేసిన మొదటి పంటలలో 'చిరుధాన్యాలు' ఒకటి. ప్రస్తుతం 130 కి పైగా దేశాలలో పండించబడుతున్న చిరుధాన్యాలు ఆసియా మరియు ఆఫ్రికా అంతటా అర బిలియన్ మందికి పైగా ప్రజలకు సాంప్రదాయ ఆహారంగా పరిగణించబడుతున్నాయి.

 

సింధు లోయ నాగరికత కాలంలో వినియోగించినట్టు అనేక ఆధారాలు కలిగి భారతదేశంలో సాగు అయిన మొదటి పంటలలో 'మిల్లెట్' ఒకటి. ప్రస్తుతం 130 కంటే ఎక్కువ దేశాలలో వీటిని పండిస్తున్నారు, మిల్లెట్‌లు ఆసియా ఆఫ్రికా అంతటా అర బిలియన్ కంటే ఎక్కువ మందికి సాంప్రదాయ ఆహారంగా పరిగణించబడుతున్నాయి.భారతదేశంలో, చిరుధాన్యాలు ప్రధానంగా ఖరీఫ్ పం. ఇతర సారూప్య పంటల కంటే వీటికి తక్కువ నీరు , పెట్టుబడులు చాలు. జీవనోపాధిని సృష్టించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ,ప్రపంచ వ్యాప్తంగా ఆహారం ,పోషక భద్రతను నిర్ధారించడానికి చిరుధాన్యాలు వాటి భారీ సామర్థ్యం కారణంగా ఎంతో ముఖ్యమైనవి.

 

ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి

లక్ష్యాలు (ఎస్డిజి) అనేకం తో అనుసంధానమైన చిరుధాన్యాల అపారమైన సామర్థ్యాన్ని గుర్తించి, భారత ప్రభుత్వం (జిఓఐ) చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇచ్చింది.ఏప్రిల్ 2018 లో, చిరుధాన్యాలను "న్యూట్రి తృణధాన్యాలు" గా రీబ్రాండ్ చేశారు, తరువాత 2018 సంవత్సరాన్ని చిరుధాన్యాల జాతీయ సంవత్సరంగా ప్రకటించారు.

 

ఏప్రిల్ 2018లో, మిల్లెట్‌లను "న్యూట్రి సెరియల్స్"గా రీబ్రాండ్ చేశారు, ఆ తర్వాత భారీ ప్రచారం, ఉత్పత్తి డిమాండ్ ను లక్ష్యంగా చేసుకుని 2018 సంవత్సరాన్ని మిల్లెట్స్ జాతీయ సంవత్సరంగా ప్రకటించారు, ప్రపంచ చిరుధాన్యాల మార్కెట్ 2021-2026 మధ్య 4.5% సిఎజిఆర్ ను నమోదు చేస్తుందని అంచనా వేశారు.

 

2022 డిసెంబరు 6 న, ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ఇటలీలోని రోమ్ లో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం - 2023 ప్రారంభ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారతదేశం నుండి సీనియర్ ప్రభుత్వ అధికారుల ప్రతినిధి బృందం హాజరైంది.

ఆ తర్వాత అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం (ఐవైఎం) 2023' వేడుకలకు ముందు వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ పార్లమెంటు సభ్యుల కోసం పార్లమెంట్ హౌస్ లో ప్రత్యేక 'మిల్లెట్ లంచ్' ఏర్పాటు చేసింది.

 

ఐవైఎం 2023 లక్ష్యాన్ని సాధించడానికి, భారతీయ చిరుధాన్యాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ చురుకైన బహుళ వాటాదారుల (అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, రైతులు, స్టార్టప్ లు, ఎగుమతిదారులు, రిటైల్ వ్యాపారాలు, హోటళ్లు, భారతీయ రాయబార కార్యాలయాలు మొదలైనవి) ను భాగస్వాములను చేసే విధానాన్ని చేపట్టింది. ఐవైఎంను ప్రోత్సహించడానికి, వినియోగదారుడు, సాగు దారుడు, వాతావరణానికి చిరుధాన్యాల ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి వివిధ కార్యకలాపాలను చేపట్టడానికి మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు భారత రాయబార కార్యాలయాలకు 2023 లో నెల చొప్పున కేటాయించారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో, 2023 జనవరి నెలకు ఐవైఎంకు సంబంధించిన కార్యకలాపాలను భారత ప్రభుత్వ క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తుంది. క్రీడా రంగ వ్యక్తులు, పోషకాహార నిపుణులు ,ఫిట్నెస్ నిపుణులను వీడియో సందేశాల ద్వారా నిమగ్నం చేయడం, ప్రముఖ పోషకాహార నిపుణులు, డైటీషియన్లు ,ప్రముఖ అథ్లెట్లతో చిరుధాన్యాలపై వెబినార్లు నిర్వహించడం, ఫిట్ ఇండియా యాప్ ద్వారా ప్రమోషన్ యాంప్లిఫికేషన్ మొదలైన 15 కార్యకలాపాలను మంత్రిత్వ శాఖ జనవరిలో 15 రోజుల పాటు ప్లాన్ చేసింది. జనవరి లో ఈవెంట్లు ప్లాన్ చేసిన కొన్ని ఇతర మంత్రిత్వ శాఖలలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లలో మిల్లెట్ ఫెయిర్-కమ్-ఎగ్జిబిషన్లను నిర్వహిస్తుంది. అలాగే, పంజాబ్, కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాల్లో ఈట్ రైట్ మేళాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్వహిస్తుంది.

 

రాష్ట్రాలకు సంబంధించి, ఛత్తీస్ గఢ్, మిజోరం, రాజస్థాన్ లు జనవరి నెలను ఐవైఎం అవగాహన, ప్రమోషన్ కార్యకలాపాలను నిర్వహించడానికి కేటాయించాయి. మహోత్సవ్ లు/ మేళాలు, ఫుడ్ ఫెస్టివల్స్, రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, వర్క్ షాపులు / సెమినార్లు, హోర్డింగ్ ల ఏర్పాటు ఇంకా రాష్ట్రంలోని వివిధ కీలక ప్రదేశాలలో ప్రమోషనల్ మెటీరియల్ పంపిణీ వంటి చిరుధాన్యాల కేంద్రిత కార్యకలాపాలను రాష్ట్రాలు నిర్వహిస్తాయి. జనవరి నెలలో ఇలాంటి కార్యకలాపాలను నిర్వహించే ఇతర రాష్ట్రాలలో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ ,పంజాబ్ ఉన్నాయి.

 

ఈ జనవరినెలలో , అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (అపెడా), డి ఎ అండ్ ఎఫ్ డబ్ల్యు బెల్జియంలో జరిగే ట్రేడ్ షోలో పాల్గొంటాయి, డి ఎ అండ్ ఎఫ్ డబ్ల్యు, అపెడా , స్టార్ట్ అప్ లు , ఎగుమతిదారులు, రైతు ఉత్పత్తి సంస్థలు (ఎఫ్ పి ఓ) మొదలైన బహుళ వాటాదారుల ప్రతినిధులతో కూడిన బృందం బెల్జియం ట్రేడ్ షో లో భారతీయ కంపెనీలు మార్కెట్ చేసిన ఆర్ టి ఇ , ఆర్ టి సి మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా, బి 2 బి, బి 2 జి ద్వారా భారతీయ చిరుధాన్యాల వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి.

 

అంతేకాకుండా, 140 కంటే ఎక్కువ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు 2023లో ఐ వై ఎం వేడుకల్లో పాల్గొనడం ద్వారా భారతీయ ప్రవాస భారతీయులతో ప్రదర్శన, సెమినార్‌లు, చర్చలు, ప్యానెల్ చర్చలు మొదలైన వాటి ద్వారా ఐ వై ఎం పై సైడ్ ఈవెంట్‌లను నిర్వహిస్తాయి. జనవరిలో, అజర్ బైజాన్ లోని భారత రాయబార కార్యాలయం , బెలారస్ లోని భారత రాయబార కార్యాలయం స్థానిక ఛాంబర్లు, ఆహార బ్లాగర్లు, ఆహార పదార్థాల దిగుమతిదారులు ,స్థానిక రెస్టారెంట్లు మొదలైన వాటి భాగస్వామ్యంతో బి 2 బి సమావేశం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ప్రవాస భారతీయుల సహాయంతో వండిన చిరుధాన్యాల వంటకాల ఎగ్జిబిషన్లు / పోటీలు నిర్వహించబడతాయి. చిరుధాన్యాల వంటకాలతో అతిథులకు విందు కూడా చేస్తారు. ఐవైఎంను ప్రోత్సహించడంలో భాగంగా అబుజాలోని భారత హైకమిషన్, లాగోస్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా జనవరి 2023 లో చిరుధాన్యాల ఆహార ఉత్సవాన్ని ,చిరుధాన్యాల ఆహార తయారీ పోటీని ప్లాన్ చేశాయి. మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్ హై కమిషన్ ప్రాంగణంలో జరుగుతుంది. నైజీరియా ప్రముఖులు, భారతీయ సమాజంతో సహా ఆహ్వానితులతో తయారీ కోసం స్టాల్స్ ను అందిస్తుంది.

 

ఈ ప్రయత్నంలో భాగంగా, ఒక సహకార విధానం ద్వారా, అంతర్జాతీయ సంస్థలు, విద్యావేత్తలు, హోటళ్లు, మీడియా, ప్రవాస భారతీయులు , స్టార్టప్ కమ్యూనిటీలు, పౌర సమాజం ఇంకా చిరుధాన్యాల విలువ గొలుసులోని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం - 2023 గ్రాండ్ సెలబ్రేషన్ ద్వారా 'మిరాకిల్ మిల్లెట్స్' గత వైభవాన్ని పునరుద్ధరించడానికి చేతులు కలపాలని డిఎ అండ్ ఎఫ్ డబ్ల్యు కోరుతోంది.

 

చిరుధాన్యాలు జి-20 సమావేశాలలో కూడా చిరుధాన్యాలు అంతర్భాగం. ప్రతినిధులకు రుచి చూపించడం, రైతులను కలవడం ,స్టార్టప్ లు ,ఎఫ్ పిఓలతో ఇంటరాక్టివ్ సెషన్ ల ద్వారా నిజమైన చిరుధాన్యాల అనుభవాన్ని అందిస్తారు.

 

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 వేడుకలో మొత్తం ప్రభుత్వ విధానం నిజమైన స్ఫూర్తి కనిపిస్తుంది.

 

*****



(Release ID: 1887991) Visitor Counter : 538